సులభమైన మాటల్లో చెప్పాలంటే శక్తి తరంగాలను బయటకు పంపడమే రేడియేషన్ అని అంటారు.. అంటే ఏమిటో మీకు తెలియకపోయినా మీరు చిన్నప్పటి నుంచి దాని గురించి వినే వుంటారు. మీరు ఒక చేతిని మండుతున్న పొయ్యి ముందు లేదా వెలుగుతున్న బల్కి కొంచెం దగ్గరగా వుంచినట్లయితే ప్రసరిస్తున్న వేడిని అనుభూతి పొందగలరు. మీరు ఎండలో కూర్చునివున్న సమయంలో అతినీలలోహిత కిరణాలు అనబడే ఒక రకమైన రేడియేషన్ మీ చర్మం పై పడుతుంది.
ఈ ఉదాహరణలన్నీ ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్కి సంబంధించినవి. మరో ముఖ్యమైన రేడియేషన్ పేరు రేడియో యాక్టివ్ రేడియేషన్. రేడియో యాక్టివ్ పదార్ధాల నుండి లేదా న్యూక్లియర్ రియాక్షన్స్ వల్ల ఇది వస్తుంది. ఈ రేడియో ఏక్టివ్ రేడియేషన్లో శక్తిగల తరంగాలతోపాటు రేణువులు కూడా విడుదల అవుతాయి.
ఎలక్ట్రో మాగ్నటిక్ రేడియేషన్లో శక్తి తరంగాలు విడుదల అవుతాయి కాబట్టి తరంగాల గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. తరంగాల మధ్య దూరాన్ని 'వేవ్ లెంగ్త్' అంటారు. ఒక్క క్షణంలో ఒక పాయింట్ని దాటే తరంగాల సంఖ్యని 'ఫ్రీక్వెన్సీ' అంటారు. ఒక పరిధిలో వున్న వేట్లెంగ్త్ కలిగిన తరంగాలను ఒక గుంపుగా వుంచితే దాన్నే 'స్పెక్ట్రం' అంటారు.
అతి చిన్న వేవ్ లెంగ్త్ కలిగిన గుంపు ఎక్స్-రే స్పెక్టం. దాని తర్వాతది అతి నీల లోహిత స్పెక్ట్రమ్. ఆ తర్వాత విజిబుల్ లైట్ స్పెక్ట్రమ్ వస్తుంది. ఈ తరంగాలను మనం చూడగలం. తరంగాలు ఇంకా పొడవు అవుతుంటాయి. వాటిని మనం చూడలేము. దీన్నే ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రం అంటారు. ఇంకా పొడవాటి తరంగాలను (హెర్టేజియన్ తరంగాలను) రేడియో, టెలివిజన్, రాడార్ల కోసం వుపయోగిస్తారు.
ఈ తరంగాలను ఏవి ఉత్పత్తి చేస్తాయి? కొన్నింటి విషయంలో పరికరాలు అవసరం. మరి కొన్ని ప్రకృతి సిద్ధంగా ఉత్పత్తి అవుతాయి అంటే సూర్యుడి నుండి వస్తాయి. ఏ రేడియేషన్ని అయినా ఉత్పత్తి చెయ్యాలంటే శక్తి అవసరం. సూర్యుని.........................
రేడియేషన్ అంటే ఏమిటి ? సులభమైన మాటల్లో చెప్పాలంటే శక్తి తరంగాలను బయటకు పంపడమే రేడియేషన్ అని అంటారు.. అంటే ఏమిటో మీకు తెలియకపోయినా మీరు చిన్నప్పటి నుంచి దాని గురించి వినే వుంటారు. మీరు ఒక చేతిని మండుతున్న పొయ్యి ముందు లేదా వెలుగుతున్న బల్కి కొంచెం దగ్గరగా వుంచినట్లయితే ప్రసరిస్తున్న వేడిని అనుభూతి పొందగలరు. మీరు ఎండలో కూర్చునివున్న సమయంలో అతినీలలోహిత కిరణాలు అనబడే ఒక రకమైన రేడియేషన్ మీ చర్మం పై పడుతుంది. ఈ ఉదాహరణలన్నీ ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్కి సంబంధించినవి. మరో ముఖ్యమైన రేడియేషన్ పేరు రేడియో యాక్టివ్ రేడియేషన్. రేడియో యాక్టివ్ పదార్ధాల నుండి లేదా న్యూక్లియర్ రియాక్షన్స్ వల్ల ఇది వస్తుంది. ఈ రేడియో ఏక్టివ్ రేడియేషన్లో శక్తిగల తరంగాలతోపాటు రేణువులు కూడా విడుదల అవుతాయి. ఎలక్ట్రో మాగ్నటిక్ రేడియేషన్లో శక్తి తరంగాలు విడుదల అవుతాయి కాబట్టి తరంగాల గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. తరంగాల మధ్య దూరాన్ని 'వేవ్ లెంగ్త్' అంటారు. ఒక్క క్షణంలో ఒక పాయింట్ని దాటే తరంగాల సంఖ్యని 'ఫ్రీక్వెన్సీ' అంటారు. ఒక పరిధిలో వున్న వేట్లెంగ్త్ కలిగిన తరంగాలను ఒక గుంపుగా వుంచితే దాన్నే 'స్పెక్ట్రం' అంటారు. అతి చిన్న వేవ్ లెంగ్త్ కలిగిన గుంపు ఎక్స్-రే స్పెక్టం. దాని తర్వాతది అతి నీల లోహిత స్పెక్ట్రమ్. ఆ తర్వాత విజిబుల్ లైట్ స్పెక్ట్రమ్ వస్తుంది. ఈ తరంగాలను మనం చూడగలం. తరంగాలు ఇంకా పొడవు అవుతుంటాయి. వాటిని మనం చూడలేము. దీన్నే ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రం అంటారు. ఇంకా పొడవాటి తరంగాలను (హెర్టేజియన్ తరంగాలను) రేడియో, టెలివిజన్, రాడార్ల కోసం వుపయోగిస్తారు. ఈ తరంగాలను ఏవి ఉత్పత్తి చేస్తాయి? కొన్నింటి విషయంలో పరికరాలు అవసరం. మరి కొన్ని ప్రకృతి సిద్ధంగా ఉత్పత్తి అవుతాయి అంటే సూర్యుడి నుండి వస్తాయి. ఏ రేడియేషన్ని అయినా ఉత్పత్తి చెయ్యాలంటే శక్తి అవసరం. సూర్యుని.........................© 2017,www.logili.com All Rights Reserved.