మాతృత్వం ఒక తీయని అనుభూతి. ఆ అనుభూతితో ఎన్నో తీయని ఊహలు. ఆ ఊహలతో పాటు ఎన్నో భయాలు, భయాలకి తోడు బాధలు తోడైతే... ఆ స్త్రీ ఆవేదన అంతా ఇంతా కాదు. ఎన్నో అనుమానాలు, ఎన్నో అపోహాలు. గర్భవతికి జ్వరం వస్తే ఏం అవుతుందో, మందు వేసుకోవచ్చో వేసుకోకూడదో అన్న సందేహం దగ్గర నుంచి గుండెజబ్బు ఉన్నవాళ్ళకి గర్భం రావచ్చా, క్షయజబ్బు ఉంటే బిడ్డ కూడా క్షయ జబ్బుతోనే పుడుతుందా? మధుమేహం ఉన్న తల్లికి గర్భం వస్తే ఏమవుతుంది? ఒంటికి నీరు వస్తే గుర్రపువాతమేనా? ఇలా అనుమానాలు భయాలు ఎన్నో కలుగుతాయి.
ఒక పక్క గర్భిని ఇటువంటి గందరగోళస్థితిలో ఉండగా, మరొక పక్క సంతానం కలుగలేదని సంతానస్తంభాలని కౌగిలించుకునే వాళ్ళు మరికొందరు. బాబాగారిచ్చిన వీభూదిని నుదుట అద్దుకుని కడుపు పండటానికి ఆశతో నిరీక్షించే దంపతులు ఇంకెందరో ఉన్నారు. గర్భం రాకపోవడానికి కారణాలు ఏమిటో తెలిస్తే మూఢనమ్మకాలతో గొడ్రాళ్ళుగా మిగిలిపోరు. శాస్త్రీయ పద్ధతులతో చికిత్స చేయించుకొని మాతృత్వం మధురిమలని స్వంతం చేసుకుంటారు. ఈ దృష్టితోనే "గర్భధారణ - సుఖప్రసవం" పుస్తకం రచించడమైనది. ప్రతి ఇంటికి ఈ గ్రంథం చేరాలని ప్రతి వివాహిత స్త్రీ ఈ గ్రంథం చదవాలనీ నా ఆకాంక్ష.
- సమరం
మాతృత్వం ఒక తీయని అనుభూతి. ఆ అనుభూతితో ఎన్నో తీయని ఊహలు. ఆ ఊహలతో పాటు ఎన్నో భయాలు, భయాలకి తోడు బాధలు తోడైతే... ఆ స్త్రీ ఆవేదన అంతా ఇంతా కాదు. ఎన్నో అనుమానాలు, ఎన్నో అపోహాలు. గర్భవతికి జ్వరం వస్తే ఏం అవుతుందో, మందు వేసుకోవచ్చో వేసుకోకూడదో అన్న సందేహం దగ్గర నుంచి గుండెజబ్బు ఉన్నవాళ్ళకి గర్భం రావచ్చా, క్షయజబ్బు ఉంటే బిడ్డ కూడా క్షయ జబ్బుతోనే పుడుతుందా? మధుమేహం ఉన్న తల్లికి గర్భం వస్తే ఏమవుతుంది? ఒంటికి నీరు వస్తే గుర్రపువాతమేనా? ఇలా అనుమానాలు భయాలు ఎన్నో కలుగుతాయి. ఒక పక్క గర్భిని ఇటువంటి గందరగోళస్థితిలో ఉండగా, మరొక పక్క సంతానం కలుగలేదని సంతానస్తంభాలని కౌగిలించుకునే వాళ్ళు మరికొందరు. బాబాగారిచ్చిన వీభూదిని నుదుట అద్దుకుని కడుపు పండటానికి ఆశతో నిరీక్షించే దంపతులు ఇంకెందరో ఉన్నారు. గర్భం రాకపోవడానికి కారణాలు ఏమిటో తెలిస్తే మూఢనమ్మకాలతో గొడ్రాళ్ళుగా మిగిలిపోరు. శాస్త్రీయ పద్ధతులతో చికిత్స చేయించుకొని మాతృత్వం మధురిమలని స్వంతం చేసుకుంటారు. ఈ దృష్టితోనే "గర్భధారణ - సుఖప్రసవం" పుస్తకం రచించడమైనది. ప్రతి ఇంటికి ఈ గ్రంథం చేరాలని ప్రతి వివాహిత స్త్రీ ఈ గ్రంథం చదవాలనీ నా ఆకాంక్ష. - సమరంNaku e book kavali
© 2017,www.logili.com All Rights Reserved.