యవ్వనంలో అడుగుపెడుతున్న బాలబాలికల విషయంలో కౌమార దశ అతి ప్రధానమైనది. కౌమార వయస్సునే ప్యూబర్టీ అంటారు. ఈ ప్యూబర్టీ అనేది చైల్డ్ హుడ్ కి, అడల్ హుడ్ కి వారధిగా చెప్పుకోవచ్చు. లేదా బాల్యావస్థ నుంచి యవ్వనావస్థ మధ్యవుండే సంధికాలంగా పేర్కొనవచ్చు.
కౌమార దశగా పేర్కొనబడే ప్యూబర్టీలో అనేక ముఖ్యమైన పరిణామాలు సంభవిస్తాయి. ఇందులో యవ్వనానికి సంబంధించిన సెకండరీ సెక్సువల్ కేరక్టర్స్ (ఉపలైంగిక లక్షణాలు) పెంపొందుతాయి.
ఇంతేకాకుండా శారీరక ఎదుగుదల, శారీరక రూపురేఖల్లో మార్పులు, సైకలాజికల్ గా పెంపొందే భావోద్వేగాలు ఒక ప్రత్యేక మూర్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కలిగిస్తాయి.
- డా. జి. సమరం