మన శరీరం గొప్ప కంప్యూటర్. కంప్యూటర్ లోని వివిధ భాగాల సమ్మేళనంతో అద్భుతమైన అవుట్ పుట్ వచ్చినట్లే మన శరీరంలోనీ వివిధ అవయవాల సమ్మేళనంతో చక్కని జీవితం వెలుగొందుతుంది. కంప్యూటర్ లో ఒక్కొక్క పార్టు ఒక్కొక్క పని చేసినట్లే మన శరీరంలోని మెదడు, కన్ను, చెవి, ముక్కు, గొంతు, నోరు, మెడ, ఊపిరితిత్తులు, గుండె, జీర్ణకోశం, కాలేయం, మూత్రపిండాలు, కీళ్ళు, చర్మం ఇలా ప్రతి ఒక్క అవయవం దేనికదే ప్రత్యేకతని సంతరించుకొంటూ శరీరాన్ని అద్భుతంగా నడిపిస్తాయి. అందుకనే మన శరీరంలోని వివిధ అవయవాల ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలి. ఏ అవయవానికి ఎటువంటి బాధ వస్తుందో తెలిసుంటే ఆ బాధని ముందే గుర్తించి నివారించుకోవచ్చు. సుఖంగా ఉండవచ్చు.
చాలా మందికి వాళ్ళ శరీరాల్లో ఉండే ముఖ్య అవయవాల అవగాహనే లేదు. అవి ఎలా పనిచేస్తాయో, ఎందుకు వ్యాధిగ్రస్తమవుతాయో, వ్యాధి గ్రస్తమయితే కలిగే అనర్ధాలు ఏమిటో తెలియదు. దాంతో ఎన్నో అవయవాల వ్యాధులు రోగుల అజ్ఞానం వల్ల ప్రమాదాలకీ దారి తీస్తాయి. కొందరికి కొంత తెలుసున్నా వారిలోని నిర్లక్ష్యం ప్రాణాపాయాన్ని కూడా కలిగిస్తుంది. అందుకనే మన శరీర అవయవాల విజ్ఞానం అవసరం. అందుకోసమే ఈ పుస్తకం. నా మిగిలిన రచనలులాగానే ఆధునిక వైద్యవిజ్ఞానానికి సంబంధించిన "మానవ శరీర నిర్మాణము - ముఖ్య అవయవముల పాత్ర" గ్రంధాన్ని కూడా ఆదరించగలరని, ఆరోగ్యాన్ని రక్షించుకోగలరని ఆశిస్తున్నాను.
- డా.జి.సమరం
© 2017,www.logili.com All Rights Reserved.