'సునిశితమైన దృష్టి, విజ్ఞానమూ అంటే లోపాన్ని చూడగలగడం. ఔన్నత్యాన్ని చూచి. అంగీకరించి ఆదరించడమన్నమాట'. - చలం
నేడు వివిధభాషలలో కధాసాహిత్యాన్ని గురించి విమర్శలు వెలువడుతున్నాయి. కారణమేమంటే ఇది కధానిక యుగం.
ఒకానొక కధకుని కధలు చదివిన తర్వాత పాఠకునకు ఆ కధకునియందు ఆదరము ఏర్పడుతుంది. తర్వాత ఆ కధకుని చరిత్ర తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతుంది.
రచయిత ప్రతిబింబమే రచన. సాధారణంగా ఏ జీవి ఆత్మకధ ఆ జీవి రచనలో అంతర్భూతమై వుంటుంది.
అందుచేతనే మనవారు ఉత్తములే కావ్యరచన చేయాలి అన్నారు.
ఆంధ్రలోకంలో ప్రసిద్ధులైన కధకులు ఎందరో ఉన్నారు. వారందరిని గురించి వ్రాయుట నావంటివానికి అలవికాని పని.
అందుచేత అందులో నాకు అందుబాటులో ఉన్నంతవరకు కొందరిని గురించి నేను చేసిన కృషి ప్రస్తుతం ప్రకటింపదలచాను.
ఇవి కధకుల చరిత్రకాదు, కధాసాహిత్యాన్ని విమర్శింపవలసిన వచ్చేటప్పుడు వారి చరిత్ర తెలుసుకొనుట అవసరము. కృతికర్తను ఎరిగిన కృతిని ఎరుగట సుకరం.
ఒక రచయితను విమర్శించేటప్పుడు ఆయనయందు గౌరవంలేకపోయినా కనీసం సానుభుతైనా ఉండాలి. సానుభూతి లేకపోతే ఆయనను అర్ధం చేసుకొనుట. తెలుపుట, దుస్తరము.
- గొర్రెపాటి వెంకటసుబ్బయ్య
'సునిశితమైన దృష్టి, విజ్ఞానమూ అంటే లోపాన్ని చూడగలగడం. ఔన్నత్యాన్ని చూచి. అంగీకరించి ఆదరించడమన్నమాట'. - చలం నేడు వివిధభాషలలో కధాసాహిత్యాన్ని గురించి విమర్శలు వెలువడుతున్నాయి. కారణమేమంటే ఇది కధానిక యుగం. ఒకానొక కధకుని కధలు చదివిన తర్వాత పాఠకునకు ఆ కధకునియందు ఆదరము ఏర్పడుతుంది. తర్వాత ఆ కధకుని చరిత్ర తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతుంది. రచయిత ప్రతిబింబమే రచన. సాధారణంగా ఏ జీవి ఆత్మకధ ఆ జీవి రచనలో అంతర్భూతమై వుంటుంది. అందుచేతనే మనవారు ఉత్తములే కావ్యరచన చేయాలి అన్నారు. ఆంధ్రలోకంలో ప్రసిద్ధులైన కధకులు ఎందరో ఉన్నారు. వారందరిని గురించి వ్రాయుట నావంటివానికి అలవికాని పని. అందుచేత అందులో నాకు అందుబాటులో ఉన్నంతవరకు కొందరిని గురించి నేను చేసిన కృషి ప్రస్తుతం ప్రకటింపదలచాను. ఇవి కధకుల చరిత్రకాదు, కధాసాహిత్యాన్ని విమర్శింపవలసిన వచ్చేటప్పుడు వారి చరిత్ర తెలుసుకొనుట అవసరము. కృతికర్తను ఎరిగిన కృతిని ఎరుగట సుకరం. ఒక రచయితను విమర్శించేటప్పుడు ఆయనయందు గౌరవంలేకపోయినా కనీసం సానుభుతైనా ఉండాలి. సానుభూతి లేకపోతే ఆయనను అర్ధం చేసుకొనుట. తెలుపుట, దుస్తరము. - గొర్రెపాటి వెంకటసుబ్బయ్య© 2017,www.logili.com All Rights Reserved.