అసాధారణులలో ఒకడు
గాంధేయవాదులు ఆయనను కమ్యూనిస్టు అనుకునేవారు. కమ్యూనిస్టులు ఆయనను గాంధేయవాది అనుకునేవారు. ఆయన మాత్రం ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఇద్దరి వేదికలలోనూ పనిచేసేవాడు. మంచికోసం పనిచేసే ఏ వేదికలోనయినా ఇమిడేవాడు. ఇమిడి పనిచేసేవాడు. అట్లాగని తన అభిప్రాయాలు ఎక్కడా దాచుకునేవాడు కాడు. ఎవరి దగ్గర వారి అభిప్రాయాలు పలికేవాడు కాడు. పైగా ఎవరితో కలిసి పనిచేసినా వారి దృక్కోణానికి కనిపించని విషయాలు, తోచని ఆలోచనలు చర్చకు పెట్టేవాడు. గాంధేయవాదులను వర్గదోపిడీ సంగతేమిటని అడిగేవాడు. కమ్యూనిస్టులను ప్రజాస్వామ్యం గురించి, హింస గురించి ప్రశ్నించేవాడు. బయట ఉండి ఇటువంటి ప్రశ్నలు వేసిన వాళ్లు చాలా మందే ఉన్నారు. కాని నరేంద్రనాథ్ ఇద్దరితోనూ కలిసి పనిచేస్తూ ఇద్దరి వేదికలలోనూ పని చేస్తూ ఈ ప్రశ్నలు లేవదీసేవాడు.
ఇది నరేంద్రనాథ్ స్వభావం నుంచి వచ్చిందే తప్ప తెచ్చి పెట్టుకున్న ఎత్తుగడ కాదు. మంచి చేసే వారెవరినయినా మనస్ఫూర్తిగా ఇష్టపడేవాడు. గాంధేయవాదాన్ని విస్తృత ప్రజా ఉద్యమాలలో ఆచరించాలని ప్రయత్నిస్తున్న మేధాపాట్కర్ తోనూ కలిసి పనిచేశాడు. కమ్యూనిస్టు కొల్లా వెంకయ్య గారినీ చాలా అభిమానించి భూ సంస్కరణల అమలు కోసం ఆయనతోనూ కలిసి పనిచేసేవాడు. నరేంద్రనాథ్కు అభిప్రాయాలు లేక కాదు. కానీ పిడివాదం లేశమంత కూడ ఉండేది కాదు. ఉదాహరణకు హింస ఏ కారణంగా చేసినా ఎవరు చేసినా తప్పని నమ్మేవాడు. కానీ ఉద్యమాలూ ఉద్యమకారులూ చేసే హింసను ఖండించడానికి నిరాకరించే పౌర హక్కుల సంఘంలో బాధ్యతలు తీసుకొని మరీ పనిచేశాడు. మానవ హక్కుల వేదిక ఏర్పడిన తరువాత, ఉద్యమకారులు హింసను అన్యాయంగా ప్రయోగిస్తే ఖండిస్తామని అంటే 'హింసకు న్యాయం అన్యాయం ఏమిటి అసలు హింసే అన్యాయం' అంటూ అభ్యంతరం తెలిపాడు గానీ మళ్లీ బాధ్యతలు తీసుకొని మరీ పని చేశాడు.
పేదలకు పంచడానికి ఇంకా భూములెక్కడున్నాయి అని కమ్యూనిస్టులు సహితం అనుకుంటున్న దశలో తన స్వంత జిల్లా అయిన చిత్తూరులో పేదలకు పంచని, పంచినా అన్యాక్రాంతమైన సీలింగ్ భూముల్ని, భూస్వాములు బోగస్ సెటిల్ మెంట్ పట్టాలు పొందిన ఎస్టేట్ భూముల్ని ఎన్ని వేల ఎకరాలున్నాయో ఒక్కొక్కటిగా బయటకు తీసి భూ సంస్కరణల...............
అసాధారణులలో ఒకడు గాంధేయవాదులు ఆయనను కమ్యూనిస్టు అనుకునేవారు. కమ్యూనిస్టులు ఆయనను గాంధేయవాది అనుకునేవారు. ఆయన మాత్రం ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఇద్దరి వేదికలలోనూ పనిచేసేవాడు. మంచికోసం పనిచేసే ఏ వేదికలోనయినా ఇమిడేవాడు. ఇమిడి పనిచేసేవాడు. అట్లాగని తన అభిప్రాయాలు ఎక్కడా దాచుకునేవాడు కాడు. ఎవరి దగ్గర వారి అభిప్రాయాలు పలికేవాడు కాడు. పైగా ఎవరితో కలిసి పనిచేసినా వారి దృక్కోణానికి కనిపించని విషయాలు, తోచని ఆలోచనలు చర్చకు పెట్టేవాడు. గాంధేయవాదులను వర్గదోపిడీ సంగతేమిటని అడిగేవాడు. కమ్యూనిస్టులను ప్రజాస్వామ్యం గురించి, హింస గురించి ప్రశ్నించేవాడు. బయట ఉండి ఇటువంటి ప్రశ్నలు వేసిన వాళ్లు చాలా మందే ఉన్నారు. కాని నరేంద్రనాథ్ ఇద్దరితోనూ కలిసి పనిచేస్తూ ఇద్దరి వేదికలలోనూ పని చేస్తూ ఈ ప్రశ్నలు లేవదీసేవాడు. ఇది నరేంద్రనాథ్ స్వభావం నుంచి వచ్చిందే తప్ప తెచ్చి పెట్టుకున్న ఎత్తుగడ కాదు. మంచి చేసే వారెవరినయినా మనస్ఫూర్తిగా ఇష్టపడేవాడు. గాంధేయవాదాన్ని విస్తృత ప్రజా ఉద్యమాలలో ఆచరించాలని ప్రయత్నిస్తున్న మేధాపాట్కర్ తోనూ కలిసి పనిచేశాడు. కమ్యూనిస్టు కొల్లా వెంకయ్య గారినీ చాలా అభిమానించి భూ సంస్కరణల అమలు కోసం ఆయనతోనూ కలిసి పనిచేసేవాడు. నరేంద్రనాథ్కు అభిప్రాయాలు లేక కాదు. కానీ పిడివాదం లేశమంత కూడ ఉండేది కాదు. ఉదాహరణకు హింస ఏ కారణంగా చేసినా ఎవరు చేసినా తప్పని నమ్మేవాడు. కానీ ఉద్యమాలూ ఉద్యమకారులూ చేసే హింసను ఖండించడానికి నిరాకరించే పౌర హక్కుల సంఘంలో బాధ్యతలు తీసుకొని మరీ పనిచేశాడు. మానవ హక్కుల వేదిక ఏర్పడిన తరువాత, ఉద్యమకారులు హింసను అన్యాయంగా ప్రయోగిస్తే ఖండిస్తామని అంటే 'హింసకు న్యాయం అన్యాయం ఏమిటి అసలు హింసే అన్యాయం' అంటూ అభ్యంతరం తెలిపాడు గానీ మళ్లీ బాధ్యతలు తీసుకొని మరీ పని చేశాడు. పేదలకు పంచడానికి ఇంకా భూములెక్కడున్నాయి అని కమ్యూనిస్టులు సహితం అనుకుంటున్న దశలో తన స్వంత జిల్లా అయిన చిత్తూరులో పేదలకు పంచని, పంచినా అన్యాక్రాంతమైన సీలింగ్ భూముల్ని, భూస్వాములు బోగస్ సెటిల్ మెంట్ పట్టాలు పొందిన ఎస్టేట్ భూముల్ని ఎన్ని వేల ఎకరాలున్నాయో ఒక్కొక్కటిగా బయటకు తీసి భూ సంస్కరణల...............© 2017,www.logili.com All Rights Reserved.