అమరుల "త్యాగాన్ని సీరాగా చేసి" రాయబట్టే ఈ కవిత్వంలో కవి తెలంగాణ ఉద్యమం ఆత్మను ఆవిష్కరించగలిగాడు. తెలంగాణ ప్రజల ఆశలను, ఆశయాలను, ఆవేశాలను కవి అద్దం పట్టి చూపిండు. "నేను భావగర్భితుణ్ణి / నేను ప్రస్తుతాన్ని" అని కాళోజీ గారంటరు. తెలంగాణ వర్తమానం తెలిస్తేనే ప్రజలు ఎటువంటి భవిష్యత్తుని కోరుకుంటున్నరో అర్ధమవుతుంది. ఆ భవిష్యత్తుని చూడదలుచుకున్న వారు మశాల్ చదువవలసిందే.
- యం. కోదండరామ్
బహుజన దృక్కోణంతో తెలంగాణ ఉద్యమాన్ని కవిత్వీకరించిన మొట్టమొదటి పుస్తకమిది. ఇందులో వాడిన ప్రతీకలు గానీ, సాంస్కృతిక చిహ్నాలు గానీ, పోరాట వీరులు, జాతరులు, ఉర్సులు, వాయిద్యాలు, ఆయుధాలు, చివరికి భాష సైతం బహుజనులు వాడేదే! మర్సిపోయిన 'పబ్బతి' పట్టిండు. 'హర్రాజు' వేసిండు. 'కారం రొట్టెల సద్దిగట్టిండు'. 'కొట్టేల' చూపెట్టిండు. 'కూలిపోయిన మిద్దెలకు ఆసరైన మొగుర మయ్యిండు.
- సంగిశెట్టి శ్రీనివాస్
"నాగరికతకు నారుపోసి, చరిత్రకు పురుడు పోసిన ఉద్యమాలకు వాళ్లు ప్రాణవాయువులు ఉద్యమంలో సగం" అంటూ స్త్రీల హోదాలో ప్రగతిశీలమైన మార్పులకు నాంది పల్కటం ఈ కవిత అంతర్లీనంగా సాధించిన లక్ష్యం. సుబ్బన్న చెప్పినట్టు అస్తిత్వ పోరాటానికి బిడ్డల్నే విరాళమిచ్చిన తల్లులున్న తెలంగాణ మనది.
- కె.విమల
అమరుల "త్యాగాన్ని సీరాగా చేసి" రాయబట్టే ఈ కవిత్వంలో కవి తెలంగాణ ఉద్యమం ఆత్మను ఆవిష్కరించగలిగాడు. తెలంగాణ ప్రజల ఆశలను, ఆశయాలను, ఆవేశాలను కవి అద్దం పట్టి చూపిండు. "నేను భావగర్భితుణ్ణి / నేను ప్రస్తుతాన్ని" అని కాళోజీ గారంటరు. తెలంగాణ వర్తమానం తెలిస్తేనే ప్రజలు ఎటువంటి భవిష్యత్తుని కోరుకుంటున్నరో అర్ధమవుతుంది. ఆ భవిష్యత్తుని చూడదలుచుకున్న వారు మశాల్ చదువవలసిందే. - యం. కోదండరామ్ బహుజన దృక్కోణంతో తెలంగాణ ఉద్యమాన్ని కవిత్వీకరించిన మొట్టమొదటి పుస్తకమిది. ఇందులో వాడిన ప్రతీకలు గానీ, సాంస్కృతిక చిహ్నాలు గానీ, పోరాట వీరులు, జాతరులు, ఉర్సులు, వాయిద్యాలు, ఆయుధాలు, చివరికి భాష సైతం బహుజనులు వాడేదే! మర్సిపోయిన 'పబ్బతి' పట్టిండు. 'హర్రాజు' వేసిండు. 'కారం రొట్టెల సద్దిగట్టిండు'. 'కొట్టేల' చూపెట్టిండు. 'కూలిపోయిన మిద్దెలకు ఆసరైన మొగుర మయ్యిండు. - సంగిశెట్టి శ్రీనివాస్ "నాగరికతకు నారుపోసి, చరిత్రకు పురుడు పోసిన ఉద్యమాలకు వాళ్లు ప్రాణవాయువులు ఉద్యమంలో సగం" అంటూ స్త్రీల హోదాలో ప్రగతిశీలమైన మార్పులకు నాంది పల్కటం ఈ కవిత అంతర్లీనంగా సాధించిన లక్ష్యం. సుబ్బన్న చెప్పినట్టు అస్తిత్వ పోరాటానికి బిడ్డల్నే విరాళమిచ్చిన తల్లులున్న తెలంగాణ మనది. - కె.విమల© 2017,www.logili.com All Rights Reserved.