'పడగ్గది వైరాగ్యం' ఒక విలక్షణమైన రచన.
ఈ నవలలోని వస్తువు శృంగారం. కధనం కోసం ఎన్నుకున్నది హాస్య ధోరణి. రెండూ పోగరబోతు గిత్తలే! ఆదమరిస్తే శృంగారం అసభ్యశృంగారం గాను, హాస్యం వెకిలి హాస్యంగాను పరిణమించే ప్రమాదం అడుగడుగునా కద్దు! అలంటి ప్రమాదం ఏర్పడకుండా వీలయినంత వరకూ పగ్గాలు బిగబట్టి, ఏ మాత్రం తొట్రుపాటు గానీ లేకుండా, కత్తివాదర లాంటి ఇరుకైన బాటపైన బంతిని సురక్షితం నడిపి గమ్యస్థానం చేర్చినందుకు రచయితను మనసారా అభినందించి తీరాలి.
భార్యలు భర్తల్ని అదుపులో పెట్టడం గురించీ, భర్తలు భార్యల్ని లొంగదిసుకోవడం గురించీ పుస్తకాలోస్తున్నాయి. పురుషాధిక్య సమాజంలో తమకు రక్షణ లేదని స్త్రీలు వాపోతున్నారు. తమకున్న సదుపాయాలను స్త్రీలు తన్నుకు పోతున్నట్టు పురుషులు కలవరిపడి పోతున్నారు. ఇట్టి పరిస్థితిలో స్త్రీ పురుషుల అనుబంధాన్ని గురించి వింగడించి చెప్పడానికి సుబ్రహ్మణ్య దీక్షితులుగారు చేసిన ఒక సత్ప్రయత్నమే 'పడగ్గది వైరాగ్యం'
రచయిత అందించిన ఈ దాంపత్య గీతామృతం ప్రతి యింటా, ప్రతి జంటా తనివారా గ్రోలదగినదీ, గ్రోల వలసినది!
దాంపత్య జీవనయాత్రకు సిద్ధమయ్యే నవ వధూవరులకు పెండ్లి పందిరిలో చదివించదగిన మంచి కానుక ఈ పుస్తకం.
- గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు
'పడగ్గది వైరాగ్యం' ఒక విలక్షణమైన రచన. ఈ నవలలోని వస్తువు శృంగారం. కధనం కోసం ఎన్నుకున్నది హాస్య ధోరణి. రెండూ పోగరబోతు గిత్తలే! ఆదమరిస్తే శృంగారం అసభ్యశృంగారం గాను, హాస్యం వెకిలి హాస్యంగాను పరిణమించే ప్రమాదం అడుగడుగునా కద్దు! అలంటి ప్రమాదం ఏర్పడకుండా వీలయినంత వరకూ పగ్గాలు బిగబట్టి, ఏ మాత్రం తొట్రుపాటు గానీ లేకుండా, కత్తివాదర లాంటి ఇరుకైన బాటపైన బంతిని సురక్షితం నడిపి గమ్యస్థానం చేర్చినందుకు రచయితను మనసారా అభినందించి తీరాలి. భార్యలు భర్తల్ని అదుపులో పెట్టడం గురించీ, భర్తలు భార్యల్ని లొంగదిసుకోవడం గురించీ పుస్తకాలోస్తున్నాయి. పురుషాధిక్య సమాజంలో తమకు రక్షణ లేదని స్త్రీలు వాపోతున్నారు. తమకున్న సదుపాయాలను స్త్రీలు తన్నుకు పోతున్నట్టు పురుషులు కలవరిపడి పోతున్నారు. ఇట్టి పరిస్థితిలో స్త్రీ పురుషుల అనుబంధాన్ని గురించి వింగడించి చెప్పడానికి సుబ్రహ్మణ్య దీక్షితులుగారు చేసిన ఒక సత్ప్రయత్నమే 'పడగ్గది వైరాగ్యం' రచయిత అందించిన ఈ దాంపత్య గీతామృతం ప్రతి యింటా, ప్రతి జంటా తనివారా గ్రోలదగినదీ, గ్రోల వలసినది! దాంపత్య జీవనయాత్రకు సిద్ధమయ్యే నవ వధూవరులకు పెండ్లి పందిరిలో చదివించదగిన మంచి కానుక ఈ పుస్తకం. - గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు© 2017,www.logili.com All Rights Reserved.