ఆనాడు శ్రీసిద్ధ నాగార్జున తస్రమను గ్రంథము గురు పాదులచే మదీయ హస్తాంజలి యందు ప్రకాశింప దత్తం బొనర్పబడెను. అది దేవ భాషా శోభితమగు సంస్కృతము.
భగవంతుడున్నాడా ! అనే సందేహం కల్గిన కాలచక్రంలో మంచికి పోతే కీడు జరుగు యన్న మహాదుర్దశా కాలంలో దర్శనం చేద్దామన్నా దొరకని మా గురువుగారైన స్వర్గీయ పూజ్య పాదశ్రీ రాయప్రోలు నృసింహ శాస్త్రిగారు అనబడె యోగి నరసింహయ్య గారు రావడం, మంత్రోపదేశం చేయడం, మంత్రాన్ని నా చెవు లతో నేను వినేటట్లు చేయడం దైవసాక్షాత్కారాన్ని పొందించడం జరిగింది. ఇంతలో శపధం చేసి దేవుడున్నాడు అని నిరూపించి మంత్ర సత్తాను చూపిన నా గురువు గారు నీ అంతవాడు వేరే ఉండరు - నీ ధాటికి ఎవ్వరూ నిలువలేరు ఈ మహావిద్యలో అని ఆశీర్వదంచి మంత్ర కీలక భావముల నెరింగించిరి.
ఈనాడు దైవ గురుదత్తంబగు ఆ గ్రంథ ప్రసూనమును వికసింప జేసి సుమధురశైలిన, మర్మరహితంబుగా నేర్చినదెల్ల తేట తెల్లంబుగా నుడివి చిత్ర శోభితంబగు ఈ సారస్వత విజ్ఞాన సుగంధ విపులీకృత సుమ పద్మంబును మీ కరకమలము లందిడుటకై సుశోభితం బొనగూర్ప రచించితిని, దీనిని పాఠకులు క్షీరనీర న్యాయపాలనంబున రాజహంసలై, పరమహంసా గుణ వర్థనులగుదురని అభిలషింతును. ఇది మాన(వ) భాషా విరచిత మగు సంస్కృతితము.
ఆనాడు శ్రీసిద్ధ నాగార్జున తస్రమను గ్రంథము గురు పాదులచే మదీయ హస్తాంజలి యందు ప్రకాశింప దత్తం బొనర్పబడెను. అది దేవ భాషా శోభితమగు సంస్కృతము. భగవంతుడున్నాడా ! అనే సందేహం కల్గిన కాలచక్రంలో మంచికి పోతే కీడు జరుగు యన్న మహాదుర్దశా కాలంలో దర్శనం చేద్దామన్నా దొరకని మా గురువుగారైన స్వర్గీయ పూజ్య పాదశ్రీ రాయప్రోలు నృసింహ శాస్త్రిగారు అనబడె యోగి నరసింహయ్య గారు రావడం, మంత్రోపదేశం చేయడం, మంత్రాన్ని నా చెవు లతో నేను వినేటట్లు చేయడం దైవసాక్షాత్కారాన్ని పొందించడం జరిగింది. ఇంతలో శపధం చేసి దేవుడున్నాడు అని నిరూపించి మంత్ర సత్తాను చూపిన నా గురువు గారు నీ అంతవాడు వేరే ఉండరు - నీ ధాటికి ఎవ్వరూ నిలువలేరు ఈ మహావిద్యలో అని ఆశీర్వదంచి మంత్ర కీలక భావముల నెరింగించిరి. ఈనాడు దైవ గురుదత్తంబగు ఆ గ్రంథ ప్రసూనమును వికసింప జేసి సుమధురశైలిన, మర్మరహితంబుగా నేర్చినదెల్ల తేట తెల్లంబుగా నుడివి చిత్ర శోభితంబగు ఈ సారస్వత విజ్ఞాన సుగంధ విపులీకృత సుమ పద్మంబును మీ కరకమలము లందిడుటకై సుశోభితం బొనగూర్ప రచించితిని, దీనిని పాఠకులు క్షీరనీర న్యాయపాలనంబున రాజహంసలై, పరమహంసా గుణ వర్థనులగుదురని అభిలషింతును. ఇది మాన(వ) భాషా విరచిత మగు సంస్కృతితము.© 2017,www.logili.com All Rights Reserved.