శాస్త్రీయ విజ్ఞానపరంగానూ, ఉత్సుకతను, సృజన సామర్థ్యాన్ని, అమాయకమైన నమ్మకం పరంగాను శిశుప్రవృత్తిని ఏ విధంగా ఆకట్టుకోగలిగేట్లు చేయవచ్చు మొదటి కథలో దీక్షితులు గారు ప్రతిపాదించారు. ఈ పరిశీలన ఎంతో హృద్యంగా ఉంది. 'విశ్వాసోధర్మ మూలంహి, ప్రీతి పరమసాధనం' అని బ్రహ్మ సమాజికులు ప్రార్థన చేస్తారట. ఈ రెండూ లేకపోతే ఈ జీవితంలో చవీ సారమూ ఏముంటాయి? 'రంగపూజ' అనే రెండో కథలో ఉత్కంఠ పరిపోషకమైన దైవమహిమ, మానవీయ ప్రవృత్తుల మానవీయతను అత్యంత ప్రతిభావంతంగా చిత్రించారు. సుందరాతి సుందరమైన కథనం ఇందులో చోటుచేసుకుంది.
దీక్షితులుగారి కథలలో భారతీయత, చిరంతన సంప్రదాయం పూలమాలలో దారంవంటివి. 'నా తిరుమల విలాస యాత్ర' అనే కథ ఒక గొప్ప భావుక ప్రహేళిక. అందమైన దృశ్యకావ్యం. అన్నమయ్య సంగీత కచేరి. ఇది ఉత్తమ పురుష కథనం. అందమైన, ఆకర్షణీయమైన ఒక స్వప్నంలా ఈ కథను చదవాలి. మానవ మనస్తత్వంలోని ఒక సున్నితమైన, సుతారమైన ప్రవృత్తిని ఈ కథలో అత్యద్భుతంగా విన్యసింపచేశారు ఈ రచయిత. అత్యంత సరళ హృదయుడు, పరమ విధేయుడు అయిన సున్నితమనస్కుడికి తండ్రితో పేచీ వస్తే దానిని ఎట్లా ప్రకటిస్తాడో ఈ కథ చెపుతుంది.
శాస్త్రీయ విజ్ఞానపరంగానూ, ఉత్సుకతను, సృజన సామర్థ్యాన్ని, అమాయకమైన నమ్మకం పరంగాను శిశుప్రవృత్తిని ఏ విధంగా ఆకట్టుకోగలిగేట్లు చేయవచ్చు మొదటి కథలో దీక్షితులు గారు ప్రతిపాదించారు. ఈ పరిశీలన ఎంతో హృద్యంగా ఉంది. 'విశ్వాసోధర్మ మూలంహి, ప్రీతి పరమసాధనం' అని బ్రహ్మ సమాజికులు ప్రార్థన చేస్తారట. ఈ రెండూ లేకపోతే ఈ జీవితంలో చవీ సారమూ ఏముంటాయి? 'రంగపూజ' అనే రెండో కథలో ఉత్కంఠ పరిపోషకమైన దైవమహిమ, మానవీయ ప్రవృత్తుల మానవీయతను అత్యంత ప్రతిభావంతంగా చిత్రించారు. సుందరాతి సుందరమైన కథనం ఇందులో చోటుచేసుకుంది. దీక్షితులుగారి కథలలో భారతీయత, చిరంతన సంప్రదాయం పూలమాలలో దారంవంటివి. 'నా తిరుమల విలాస యాత్ర' అనే కథ ఒక గొప్ప భావుక ప్రహేళిక. అందమైన దృశ్యకావ్యం. అన్నమయ్య సంగీత కచేరి. ఇది ఉత్తమ పురుష కథనం. అందమైన, ఆకర్షణీయమైన ఒక స్వప్నంలా ఈ కథను చదవాలి. మానవ మనస్తత్వంలోని ఒక సున్నితమైన, సుతారమైన ప్రవృత్తిని ఈ కథలో అత్యద్భుతంగా విన్యసింపచేశారు ఈ రచయిత. అత్యంత సరళ హృదయుడు, పరమ విధేయుడు అయిన సున్నితమనస్కుడికి తండ్రితో పేచీ వస్తే దానిని ఎట్లా ప్రకటిస్తాడో ఈ కథ చెపుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.