ఆధునిక కధకి అద్యులనదగినవారిలో మొపాస ఒకరు. మొపాస పందొమ్మిదవ శతాబ్దపు ఫ్రెంచ్ రచయిత. రష్యన్ మహా రచయిత తలుస్తోయ్(టాల్ స్టాయి) మొపాస శైలి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. జర్మన్ తత్వవేత్త నీషే మోపాసాని గొప్ప రచయితగా శ్లాఘించాడు. సోమర్సెట్ మామ్, ఓ హెన్రీ ఇద్దరూ - మోపాసాని అనుసరించారు. ఎమిలీ జోలానీ మొపాస ఇష్టపడ్డాడు. బాల్జాక్ ని అభిమానించాడు. ప్లౌబర్డ్ దీవెనలు అందుకున్నాడు.
చిన్నప్పటి నుంచీ మొపాసాకి మతమంటే మంట. అయన యుద్దవ్యతిరేకి. ఈ సంపుటిలోని శృంగార కధల్లో శృంగార వర్ణనలేమి ఉండవు కాని శృంగార నేపధ్యం ఉంటుంది.
వ్యర్ధ పదాలు, వ్యర్ధ వర్ణనలు, వ్యర్ధ వాక్యాలు లేకుండా సునాయాసంగా, సాదాగా, సూటిగా ఉంటాయి అయన కధలన్నీ.
19 చక్కటి కధలు ఉన్న ఈ పుస్తకం మహీధర జగన్మోహన రావు గారు చక్కటి తెలుగు లోకి అనువదించారు.
ఆధునిక కధకి అద్యులనదగినవారిలో మొపాస ఒకరు. మొపాస పందొమ్మిదవ శతాబ్దపు ఫ్రెంచ్ రచయిత. రష్యన్ మహా రచయిత తలుస్తోయ్(టాల్ స్టాయి) మొపాస శైలి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. జర్మన్ తత్వవేత్త నీషే మోపాసాని గొప్ప రచయితగా శ్లాఘించాడు. సోమర్సెట్ మామ్, ఓ హెన్రీ ఇద్దరూ - మోపాసాని అనుసరించారు. ఎమిలీ జోలానీ మొపాస ఇష్టపడ్డాడు. బాల్జాక్ ని అభిమానించాడు. ప్లౌబర్డ్ దీవెనలు అందుకున్నాడు. చిన్నప్పటి నుంచీ మొపాసాకి మతమంటే మంట. అయన యుద్దవ్యతిరేకి. ఈ సంపుటిలోని శృంగార కధల్లో శృంగార వర్ణనలేమి ఉండవు కాని శృంగార నేపధ్యం ఉంటుంది. వ్యర్ధ పదాలు, వ్యర్ధ వర్ణనలు, వ్యర్ధ వాక్యాలు లేకుండా సునాయాసంగా, సాదాగా, సూటిగా ఉంటాయి అయన కధలన్నీ. 19 చక్కటి కధలు ఉన్న ఈ పుస్తకం మహీధర జగన్మోహన రావు గారు చక్కటి తెలుగు లోకి అనువదించారు.© 2017,www.logili.com All Rights Reserved.