"సినిమా అన్నది కళ. అంటే సినిమా అన్నదాంట్లో కళ వున్నది. అయితే అది వ్యాపారం. వ్యాపార లక్షణాలు గల కళ. అసలు సినిమాల్లో కళ లేదని చాలామంది అంటారు. కాని సినిమాల్లో కళ లేకపోవడమేమి? ఉన్నదంతా కళాసమన్వయమే. సంగీతం, నటన, శిల్పకళ, నృత్యాలు, ఛాయాగ్రహణం, శబ్దగ్రహణం వంటివి కళలే."
- ఆదుర్తి సుబ్బారావు
ఆదుర్తికి దర్శకులందరికి వుండవలసిన ఒక గొప్ప అర్హత వుంది. రసికత. చిత్రం కధ, మాటలు, నృత్యాలు ఆయా కళాకారులు తాయారుచేసే వేళ దర్శకుడు కూడా వాటిని ప్రేక్షకుల ప్రతినిధిగా రసికుడుగా ఆస్వాదించి ఆనందించాలి. ఆ శక్తి ఆయనలో అపారం. ఆయనలో కవి, సంగీతకుడు, నర్తకుడు, ఛాయాగ్రాహకుడు అందరూ వున్నారు. రసాస్వాదన తరువాత ఆయా శక్తులతో అన్నిటిని తనకు కావలసిన రూపులో దిద్దుకుంటాడు. ప్రతి పాటకు అందులో విషయం ఏదో ఒకటి అర్ధవంతంగా ఏర్పరచి రాయించుకుంటాడు. సంగీతానికి కొలతలు చూపిస్తాడు. నృత్యదర్శకుడితో తాళం వేస్తాడు. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలిలో ఈ అన్నిటితోపాటు అద్భుతమైనది మరొకటి వుంది. మంచిమనసు. ఆయన గడించిన గౌరవానికి, అందరి ప్రేమను జోడించి అద్వితీయున్ని చేసింది. ఆయన పరిధిలోకి వచ్చేవారంతా డబ్బు కన్న మిన్నగా ఆయన ప్రతిభ మీద భక్తీ గౌరవాలతో ఆయన ప్రేమాదరాల ఆనందంతో దాసులై పనిచేస్తారు. అయినా ఆయన ఎవరిచేతా పనిచేయించడు. వారితో కలిసి చేస్తాడు. అందరం కలిసి చేస్తున్నామన్న భావం కలిగిస్తాడు. అదే ఆదుర్తి విజయరహస్యం. అది సుబ్బారావుకు తెలుసు. అయితే అతనికి వినయంలా వుంది.
ఒక్క మనిషిలో యిన్ని మంచి లక్షణాలుండడం చాలా అరుదు. ఉన్నా అవి అందరిపట్లా అన్ని కాలాల్లోనూ వుండవు కాని, అందరి పట్ల అన్ని సమయాల్లోను సమానంగా వుండే అరుదైన వ్యక్తీ ఆదుర్తి సుబ్బారావు.
- టి. కృష్ణ
ప్రతిభ లేనిదే ఏ కళాకారుడూ రాణించడు. కాని అది ఒక్కటే వుంటే చాలదు. ప్రతిభను చూపగల అవకాశం రావాలి. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలగాలి. అప్పుడు లభించే కీర్తిప్రతిష్టలు నిలబెట్టుకోగలిగే నిండుతనం కావాలి. ఇవన్నీ కలిసివచ్చేటట్టు చేసుకోగలిగిన ప్రతిభాశాలి ఆదుర్తి సుబ్బారావుగారు!
- దుక్కిపాటి మధుసూదనరావు
ఆదుర్తి సుబ్బారావు ప్రతి విషయాన్నీ తేలిగ్గా తీసుకునే వ్యక్తీనీ, దర్శకుడిగా బాగా రాణిస్తాడనీ, దృశ్యాల్ని బాగా పండించగలడనీ "తోడికోడళ్ళు" నిర్మాణంలో నాకు కలిగిన అనుభవం. హాస్యం, కరుణ, శృంగారం - అన్ని రసాలూ చక్కగా పండించే నైపుణ్యంగల వ్యక్తీ - ఆయన. ఎంత సీరియస్ దృశ్యాన్ని తీస్తున్నా, తన చలాకీతనాన్ని విడిచిపెట్టేవారు కాదు. చాలా తెలివైన దర్శకుడు. ఆయన టెక్నిక్ వేరుగా వుండేది. కధ చర్చించే విధానం దగ్గర్నుంచి, టేకింగ్ వరకూ ఆయన ఆలోచనంతా వేరుగా వుండేది. నవ్యత కోసం ఆలోచించేవారు ఆదుర్తి. ఆయనతో మా అన్నపూర్ణ సంస్థ "తోడికోడళ్ళు", "మాంగల్యబలం", "వెలుగునీడలు", "ఇద్దరు మిత్రులు", "చదువుకున్న అమ్మాయిలు", డాక్టర్ చక్రవర్తి", "పూలరంగడు", "విచిత్రబంధం", "బంగారు కలలు", తీసింది. ఇంకా పలు సినిమాలు తీశారు. ఆయనతో నాకు యిన్ని చిత్రాల అనుభవం, యిన్ని చిత్రాల సాంగత్యం. ఆయన దర్శకత్వంలో నటిస్తూంటే కొత్త ఉత్సాహం, కొత్త ఆనందం. ఈ భావం నాకే కాదు - పనిచేసే ప్రతివారికి వుండేది. టేకింగ్ లో ఆదుర్తి విధానమే వేరు.
నేనంటే ఆయనకీ గౌరవం; ఆయనంటే నాకు గౌరవం. పరస్పరం గౌరవించుకుంటూ, ఒకే భావాలతో పలు పాత్రలను మలుచుకున్నాం. కలకాలం నిలబడే పాత్రలు, చిత్రాలు ఆయన తీశారు. మా చిత్రాలు ఆయన డైరెక్టు చేసినట్టుగానే, ఆయన సొంతచిత్రలూ కొన్ని నాతో తీశారు. ఒక గొప్ప దర్శకుడికి నిర్వచనం ఆయనే అని నా ఉద్దేశం. అలాంటి డైరెక్టర్ని మళ్ళీ చూడలేదు - యిప్పట్లో చూడగలనన్న ఆశా లేదు.
- అక్కినేని నాగేశ్వరరావు
నాకు తెలిసి నా అనుభవంలో ఆదుర్తివంటి దర్శకులు ఇప్పటిదాకా పరిశ్రమలో నాకు కనిపించలేదు. ఆయన దర్శకత్వంలో నేను "పూలరంగడు" సినిమాలో నటించాను. ఆయన సినిమా షూటింగ్ అంటేనే మేం ఉత్సాహంతో సిద్ధపడేవాళ్లం. జాలీగా ఉంటూ షూటింగ్ అంతా పిక్ నిక్ స్పాట్ లా వుండేది. నేనన్నా, కృష్ణగారన్నా వారు చూపే పితృప్రేమ మాటల్లో చెప్పలేనిది. మేం ఏ కొత్త సినిమా చేసినా విజయం కావాలి. మేం వృద్ధిలోకి రావాలని మనసారా కోరుకునేవారు. ఆ తరువాత మేం చేసిన "మొనగాళ్లకు మొనగాడు" సినిమాకు తోలిక్లాప్ ఇచ్చి ఆశీర్వదించారు. చాలా గొప్ప హృదయమున్న మనిషి. వారు ఎంత గొప్ప మనసుతో నన్ను ఆశీర్వదించారో ఏమో గాని నాకు దర్శకురాలిగా ఆ తర్వాత చాలా మంచిపేరు వచ్చింది. అదంతా ఆయన ఆశీర్వాద బలమే. అలాంటి గొప్ప దర్శకుడినీ మళ్లీ చూడలేం.
- విజయనిర్మల
"సినిమా అన్నది కళ. అంటే సినిమా అన్నదాంట్లో కళ వున్నది. అయితే అది వ్యాపారం. వ్యాపార లక్షణాలు గల కళ. అసలు సినిమాల్లో కళ లేదని చాలామంది అంటారు. కాని సినిమాల్లో కళ లేకపోవడమేమి? ఉన్నదంతా కళాసమన్వయమే. సంగీతం, నటన, శిల్పకళ, నృత్యాలు, ఛాయాగ్రహణం, శబ్దగ్రహణం వంటివి కళలే." - ఆదుర్తి సుబ్బారావు ఆదుర్తికి దర్శకులందరికి వుండవలసిన ఒక గొప్ప అర్హత వుంది. రసికత. చిత్రం కధ, మాటలు, నృత్యాలు ఆయా కళాకారులు తాయారుచేసే వేళ దర్శకుడు కూడా వాటిని ప్రేక్షకుల ప్రతినిధిగా రసికుడుగా ఆస్వాదించి ఆనందించాలి. ఆ శక్తి ఆయనలో అపారం. ఆయనలో కవి, సంగీతకుడు, నర్తకుడు, ఛాయాగ్రాహకుడు అందరూ వున్నారు. రసాస్వాదన తరువాత ఆయా శక్తులతో అన్నిటిని తనకు కావలసిన రూపులో దిద్దుకుంటాడు. ప్రతి పాటకు అందులో విషయం ఏదో ఒకటి అర్ధవంతంగా ఏర్పరచి రాయించుకుంటాడు. సంగీతానికి కొలతలు చూపిస్తాడు. నృత్యదర్శకుడితో తాళం వేస్తాడు. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలిలో ఈ అన్నిటితోపాటు అద్భుతమైనది మరొకటి వుంది. మంచిమనసు. ఆయన గడించిన గౌరవానికి, అందరి ప్రేమను జోడించి అద్వితీయున్ని చేసింది. ఆయన పరిధిలోకి వచ్చేవారంతా డబ్బు కన్న మిన్నగా ఆయన ప్రతిభ మీద భక్తీ గౌరవాలతో ఆయన ప్రేమాదరాల ఆనందంతో దాసులై పనిచేస్తారు. అయినా ఆయన ఎవరిచేతా పనిచేయించడు. వారితో కలిసి చేస్తాడు. అందరం కలిసి చేస్తున్నామన్న భావం కలిగిస్తాడు. అదే ఆదుర్తి విజయరహస్యం. అది సుబ్బారావుకు తెలుసు. అయితే అతనికి వినయంలా వుంది. ఒక్క మనిషిలో యిన్ని మంచి లక్షణాలుండడం చాలా అరుదు. ఉన్నా అవి అందరిపట్లా అన్ని కాలాల్లోనూ వుండవు కాని, అందరి పట్ల అన్ని సమయాల్లోను సమానంగా వుండే అరుదైన వ్యక్తీ ఆదుర్తి సుబ్బారావు. - టి. కృష్ణ ప్రతిభ లేనిదే ఏ కళాకారుడూ రాణించడు. కాని అది ఒక్కటే వుంటే చాలదు. ప్రతిభను చూపగల అవకాశం రావాలి. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలగాలి. అప్పుడు లభించే కీర్తిప్రతిష్టలు నిలబెట్టుకోగలిగే నిండుతనం కావాలి. ఇవన్నీ కలిసివచ్చేటట్టు చేసుకోగలిగిన ప్రతిభాశాలి ఆదుర్తి సుబ్బారావుగారు! - దుక్కిపాటి మధుసూదనరావు ఆదుర్తి సుబ్బారావు ప్రతి విషయాన్నీ తేలిగ్గా తీసుకునే వ్యక్తీనీ, దర్శకుడిగా బాగా రాణిస్తాడనీ, దృశ్యాల్ని బాగా పండించగలడనీ "తోడికోడళ్ళు" నిర్మాణంలో నాకు కలిగిన అనుభవం. హాస్యం, కరుణ, శృంగారం - అన్ని రసాలూ చక్కగా పండించే నైపుణ్యంగల వ్యక్తీ - ఆయన. ఎంత సీరియస్ దృశ్యాన్ని తీస్తున్నా, తన చలాకీతనాన్ని విడిచిపెట్టేవారు కాదు. చాలా తెలివైన దర్శకుడు. ఆయన టెక్నిక్ వేరుగా వుండేది. కధ చర్చించే విధానం దగ్గర్నుంచి, టేకింగ్ వరకూ ఆయన ఆలోచనంతా వేరుగా వుండేది. నవ్యత కోసం ఆలోచించేవారు ఆదుర్తి. ఆయనతో మా అన్నపూర్ణ సంస్థ "తోడికోడళ్ళు", "మాంగల్యబలం", "వెలుగునీడలు", "ఇద్దరు మిత్రులు", "చదువుకున్న అమ్మాయిలు", డాక్టర్ చక్రవర్తి", "పూలరంగడు", "విచిత్రబంధం", "బంగారు కలలు", తీసింది. ఇంకా పలు సినిమాలు తీశారు. ఆయనతో నాకు యిన్ని చిత్రాల అనుభవం, యిన్ని చిత్రాల సాంగత్యం. ఆయన దర్శకత్వంలో నటిస్తూంటే కొత్త ఉత్సాహం, కొత్త ఆనందం. ఈ భావం నాకే కాదు - పనిచేసే ప్రతివారికి వుండేది. టేకింగ్ లో ఆదుర్తి విధానమే వేరు. నేనంటే ఆయనకీ గౌరవం; ఆయనంటే నాకు గౌరవం. పరస్పరం గౌరవించుకుంటూ, ఒకే భావాలతో పలు పాత్రలను మలుచుకున్నాం. కలకాలం నిలబడే పాత్రలు, చిత్రాలు ఆయన తీశారు. మా చిత్రాలు ఆయన డైరెక్టు చేసినట్టుగానే, ఆయన సొంతచిత్రలూ కొన్ని నాతో తీశారు. ఒక గొప్ప దర్శకుడికి నిర్వచనం ఆయనే అని నా ఉద్దేశం. అలాంటి డైరెక్టర్ని మళ్ళీ చూడలేదు - యిప్పట్లో చూడగలనన్న ఆశా లేదు. - అక్కినేని నాగేశ్వరరావు నాకు తెలిసి నా అనుభవంలో ఆదుర్తివంటి దర్శకులు ఇప్పటిదాకా పరిశ్రమలో నాకు కనిపించలేదు. ఆయన దర్శకత్వంలో నేను "పూలరంగడు" సినిమాలో నటించాను. ఆయన సినిమా షూటింగ్ అంటేనే మేం ఉత్సాహంతో సిద్ధపడేవాళ్లం. జాలీగా ఉంటూ షూటింగ్ అంతా పిక్ నిక్ స్పాట్ లా వుండేది. నేనన్నా, కృష్ణగారన్నా వారు చూపే పితృప్రేమ మాటల్లో చెప్పలేనిది. మేం ఏ కొత్త సినిమా చేసినా విజయం కావాలి. మేం వృద్ధిలోకి రావాలని మనసారా కోరుకునేవారు. ఆ తరువాత మేం చేసిన "మొనగాళ్లకు మొనగాడు" సినిమాకు తోలిక్లాప్ ఇచ్చి ఆశీర్వదించారు. చాలా గొప్ప హృదయమున్న మనిషి. వారు ఎంత గొప్ప మనసుతో నన్ను ఆశీర్వదించారో ఏమో గాని నాకు దర్శకురాలిగా ఆ తర్వాత చాలా మంచిపేరు వచ్చింది. అదంతా ఆయన ఆశీర్వాద బలమే. అలాంటి గొప్ప దర్శకుడినీ మళ్లీ చూడలేం. - విజయనిర్మల
© 2017,www.logili.com All Rights Reserved.