నాటక రంగ విజ్ఞానకోవిదుడు, ప్రసిద్ధ నాటక ప్రయోక్త దేశీరాజు హనుమంతరావు 'బకాసుర' నాటక రచనకు తారకరామారావును ప్రోత్సాహించారు. 'బకాసుర' నాటకంలో బకాసురుడెక్కడా కన్పించడు. కథలో పాత్రే గాని 'స్టేజి' మీదికి రానేరాడు. తారక రామారావు 'బకాసుర' నాటకంలో దీన్నొక విశేషంగా తలచవచ్చు. బకాసురుణ్ణి గురించి పూర్తిగా తెలుస్తుంది. గాని అతనెక్కడా కన్పించడు, విన్పించడు. మహాభారత కథలోలాగా బకాసుర నాటకంలో గూడ బకాసురుడు రాక్షసుడే. మహాభారతంలో బకాసురుడు బలవంతుడు, క్రూరుడు. కాని కొడవటిగంటి కథలో ముసలివాడు, బలహీనుడు. బకాసురుడు 'ప్రాణం మీద రాసిన కుక్కలాగుంటాడు. మొహం అంతా ముడతలు. ముఖాన కళాకాంతులు లేవు. ఏడుపు మొహం'. అలాగే ఇందులో జనమే జయం, యాజ్ఞసేని ఆత్మకథ నాటకాలు కలవు.

© 2017,www.logili.com All Rights Reserved.