'జయం' ఒక ఇతిహాసం. చరిత్ర. నిజంగా జరిగి ఉంటుందని ఎక్కువమంది చరిత్రకారులు విశ్వశిస్తున్నారు. నేనూ నమ్ముతున్నాను. వ్యాసుడి కాలంలో జీవించిన పాండవులు, కౌరవుల మధ్య జరిగిన ఘర్షణ - పర్యవసానంగా మొదలయిన యుద్ధం జయేతిహాసంలో ఇతివృత్తం. తనవల్ల కొనసాగిన కురువంశం తన కళ్ళముందే సర్వనాశనం కావడం వ్యాసుడి మనసును క్షోభ పెట్టింది. వంశనాశనానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూ 'జయం' పేరుతో కావ్యరూపం కల్పించాడు వ్యాసుడు.
కురువంశం అంతరించకుండా ఆదుకొన్న వ్యాసుడు తన కళ్ళముందే బిడ్డలబిడ్డలు యుద్ధానికి తలపడడం చూసి సహించలేకపోయాడు. జరిగిన చరిత్రకు కావ్యరూపం కల్పించాడు. ఫలితంగా పుట్టిన కావ్యం 'జయేతిహాసం' కాలక్రమంలో 'జయం' 24 వేల శ్లోకాల 'భారతం' అయింది. లక్ష శ్లోకాలకు మించిన 'మహాభారతం' అయింది. మూలకథ. 'జయం' లో ఏం జరిగి ఉంటుంది? ఇలా జరిగి ఉండొచ్చనే ఊహలతో మలచిన నవల 'జయం'.
'జయం' ఒక ఇతిహాసం. చరిత్ర. నిజంగా జరిగి ఉంటుందని ఎక్కువమంది చరిత్రకారులు విశ్వశిస్తున్నారు. నేనూ నమ్ముతున్నాను. వ్యాసుడి కాలంలో జీవించిన పాండవులు, కౌరవుల మధ్య జరిగిన ఘర్షణ - పర్యవసానంగా మొదలయిన యుద్ధం జయేతిహాసంలో ఇతివృత్తం. తనవల్ల కొనసాగిన కురువంశం తన కళ్ళముందే సర్వనాశనం కావడం వ్యాసుడి మనసును క్షోభ పెట్టింది. వంశనాశనానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూ 'జయం' పేరుతో కావ్యరూపం కల్పించాడు వ్యాసుడు. కురువంశం అంతరించకుండా ఆదుకొన్న వ్యాసుడు తన కళ్ళముందే బిడ్డలబిడ్డలు యుద్ధానికి తలపడడం చూసి సహించలేకపోయాడు. జరిగిన చరిత్రకు కావ్యరూపం కల్పించాడు. ఫలితంగా పుట్టిన కావ్యం 'జయేతిహాసం' కాలక్రమంలో 'జయం' 24 వేల శ్లోకాల 'భారతం' అయింది. లక్ష శ్లోకాలకు మించిన 'మహాభారతం' అయింది. మూలకథ. 'జయం' లో ఏం జరిగి ఉంటుంది? ఇలా జరిగి ఉండొచ్చనే ఊహలతో మలచిన నవల 'జయం'.© 2017,www.logili.com All Rights Reserved.