అవును! పల్లెటూరి పడుచు మునివేళ్ళతో నాటుతున్న వారి మొక్క ఇంటి వెనుక పెరట్లో పాదూ చేసి అపురూపంగా పెంచుతున్న బీరతీగ నా కవిత్వం తవ్వుకుని పారతో మర్లేసుకుని నా రెండు కాళ్ళతో తోక్కుకుని తిరిగే 'సారె' పై వంకు రుమాలు కుమ్మరి బాలనర్సు చేతుల పునితంతో వివిధ ఆకృతులుగా నన్ను నేను మలుచుకున్న మట్టిముద్దను.
అవునవును పొంగిన నా నెత్తురు చివర మొలిచిన చెమట బిందువు నడి ఎండల్లో కూలీలను అక్కున చేర్చుకునే చిగురాకుల భూమిలోంచి విరజిమ్మిన పరిమళ ద్రవ్యాలే నా కవిత్వం అర్థాలు పరమార్థాలు. సమాజానికి నాకు మధ్య నా కవిత్వం ఒక యానకం. (కవిత్వం-1)
రండి!
ఇండియా తమకు శిరస్సు వంచి స్వాగతం పలుకుతుంది.
రైతు వెన్నేముకల్ని ఏర్చికూర్చి
విమానం దిగుతున్న మెట్లు లాగా తిర్చిదిద్దాం (కవిత్వం-2)
ఇది ద్రోహ కాలం
నవ్వుకుంటనే ఇండ్లు ముంచుతరు
ఇది విద్రోహ కాలం
ఏడ్చుకుంటనే ఊర్లకు ఊళ్ళు అగ్గిపెడతరు (కవిత్వం-3)
ఈ గ్రంథం మూడు సంపుటాల కవిత్వం.
-జూకంటి. జగన్నాథం.
అవును! పల్లెటూరి పడుచు మునివేళ్ళతో నాటుతున్న వారి మొక్క ఇంటి వెనుక పెరట్లో పాదూ చేసి అపురూపంగా పెంచుతున్న బీరతీగ నా కవిత్వం తవ్వుకుని పారతో మర్లేసుకుని నా రెండు కాళ్ళతో తోక్కుకుని తిరిగే 'సారె' పై వంకు రుమాలు కుమ్మరి బాలనర్సు చేతుల పునితంతో వివిధ ఆకృతులుగా నన్ను నేను మలుచుకున్న మట్టిముద్దను. అవునవును పొంగిన నా నెత్తురు చివర మొలిచిన చెమట బిందువు నడి ఎండల్లో కూలీలను అక్కున చేర్చుకునే చిగురాకుల భూమిలోంచి విరజిమ్మిన పరిమళ ద్రవ్యాలే నా కవిత్వం అర్థాలు పరమార్థాలు. సమాజానికి నాకు మధ్య నా కవిత్వం ఒక యానకం. (కవిత్వం-1) రండి! ఇండియా తమకు శిరస్సు వంచి స్వాగతం పలుకుతుంది. రైతు వెన్నేముకల్ని ఏర్చికూర్చి విమానం దిగుతున్న మెట్లు లాగా తిర్చిదిద్దాం (కవిత్వం-2) ఇది ద్రోహ కాలం నవ్వుకుంటనే ఇండ్లు ముంచుతరు ఇది విద్రోహ కాలం ఏడ్చుకుంటనే ఊర్లకు ఊళ్ళు అగ్గిపెడతరు (కవిత్వం-3) ఈ గ్రంథం మూడు సంపుటాల కవిత్వం. -జూకంటి. జగన్నాథం.
© 2017,www.logili.com All Rights Reserved.