రాధేయ క్రమశిక్షణ గల సాహితీ వేత్త. కవితా హృదయం గల విమర్శకుడు. వివేచనాశక్తి గల కవి. నిత్య సాహిత్యోపాసకుడు. అందుకు ఆయన ప్రతి రచన ఉదాహరణగా నిలుస్తుంది. కవిగా మూడు దశాబ్దాల క్రితం మొలకెత్తిన రాధేయ, విమర్శకుడుగా ఇటీవలనే చిగురించాడు. ఆధునిక కవిత్వంలోని పుస్తకాలు ఎంతో అమూల్యమైనవి. సామాజిక స్వప్నానికి, సంస్కారానికీ, సత్యానికి, చైతన్యానికి, ఊతమిచ్చిన సాహితీవేత్త రాధేయ.
డా రమేష్ నారాయణ గారు రాధేయలోని కవిని, కవితోపాటు మనిషిని, ఈ గ్రంథం ద్వారా మనకు ఎరుక పరిచారు. నిజంగా ఈ జీవిత చరిత్ర నాల్గు చరిత్రల కూడలి. ఒకటి రాధేయ వంశ చరిత్ర, రెండు రాధేయ చరిత్ర, మూడు సీమ సాహిత్య చరిత్ర, నాల్గు తెలుగు సాహిత్య చరిత్ర. ఈ నాల్గింటినీ మేళవించి డా రమేష్ నారాయణ గారు ఈ గ్రంథాన్ని రూపొందించారు. అందుకు వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెల్పుకుంటున్నాను.
- ఆచార్య మసన చెన్నప్ప
రాధేయ క్రమశిక్షణ గల సాహితీ వేత్త. కవితా హృదయం గల విమర్శకుడు. వివేచనాశక్తి గల కవి. నిత్య సాహిత్యోపాసకుడు. అందుకు ఆయన ప్రతి రచన ఉదాహరణగా నిలుస్తుంది. కవిగా మూడు దశాబ్దాల క్రితం మొలకెత్తిన రాధేయ, విమర్శకుడుగా ఇటీవలనే చిగురించాడు. ఆధునిక కవిత్వంలోని పుస్తకాలు ఎంతో అమూల్యమైనవి. సామాజిక స్వప్నానికి, సంస్కారానికీ, సత్యానికి, చైతన్యానికి, ఊతమిచ్చిన సాహితీవేత్త రాధేయ. డా రమేష్ నారాయణ గారు రాధేయలోని కవిని, కవితోపాటు మనిషిని, ఈ గ్రంథం ద్వారా మనకు ఎరుక పరిచారు. నిజంగా ఈ జీవిత చరిత్ర నాల్గు చరిత్రల కూడలి. ఒకటి రాధేయ వంశ చరిత్ర, రెండు రాధేయ చరిత్ర, మూడు సీమ సాహిత్య చరిత్ర, నాల్గు తెలుగు సాహిత్య చరిత్ర. ఈ నాల్గింటినీ మేళవించి డా రమేష్ నారాయణ గారు ఈ గ్రంథాన్ని రూపొందించారు. అందుకు వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెల్పుకుంటున్నాను. - ఆచార్య మసన చెన్నప్ప© 2017,www.logili.com All Rights Reserved.