'ఒకపైసా ఆదా చేసినా ఆ డబ్బుని సంపాదించినట్లే! అన్నారు జార్జి బెర్నార్డ్ షా. ఈ పుస్తకంలో నిత్యజీవితంలో ప్రతి కోణం నుండి డబ్బెలా ఆదా చేయాలో వివరిస్తున్నాం.
ఈ పుస్తకం రాస్తున్నప్పుడు నా కొలీగ్ ఒకతను వచ్చాడు. నేను రాస్తున్న పుస్తకం గురించి చెప్పగానే అపహాస్యంలా నవ్వాడు. ఆఖరికి మా చర్చలో తేలిందేమిటంటే - అతడు మొన్ననే ఎల్ఐసీ పాలసీ తీసుకున్నాడు. మొత్తం ప్రీమియం పదివేలు. నిజానికి చాలామంది ఎల్ఐసీ పాలసీ ఏజంట్లు తమ వ్యాపారాభివృద్ది కోసం మొదటి సంవత్సరం తమకోచ్చే కమిషన్ (దాదాపు 15శాతం నుండి 25శాతం)ని కష్టమర్ కి ఇచ్చేస్తారు. అయితే కొంతమంది కస్టమర్లకు ఆ విషయం తెలియదు కాబట్టి అడగరు. అలాంటి వారిలో మా కొలీగ్ కి ఒకరు. చర్చలో మా మధ్య ఈ విషయం రాగానే అతడు వెంటనే ఎల్ఐసీ ఏజంట్ కు ఫోన్ చేసి కమీషన్ విషయం అడిగాడు. మరో గంటలో ఆ ఎల్ఐసీ ఏజంట్ పరిగెత్తుకుంటూ వచ్చి రెండు వేలు నా కొలీగ్ కీ ఇచ్చాడు. అలా గంటలో రెండు వేలు చేతిలో పడడంతో నా కొలీగ్ కీ మతిపోయింది. వెంటనే జేబులోంచి డబ్బు తిసిస్తూ, ఈ పుస్తకం కోసం ఓ వంద కాపీలు ఆర్డర్ పెట్టాడు. తన బంధవులకు, స్నేహితులకు ఇలాంటి విషయాలు తెలియజేయడానికి తాను ఈ పుస్తకం కాపీలు వారికి పంచిపెడతానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే - మనలో చాలామందికి ఇలాంటి విషయాలు తెలియవు. నిజానికి పోదుపుని మించిన సుఖం లేదు. లక్షలు సంపాదించాలంటే ఎంతో స్ట్రగుల్, ఆరాటం,టెన్సన్... లాంటివి ఎన్నో ఎదుర్కోవాలి. అదే పొదుపు వల్ల అయితే అలాంటివేమి లేకుండానే జీవితం నందనవనం చేసుకోవచ్చు. డబ్బు సంపాదించడం అందరికీ చేతకాకపోవచ్చు. కాని డబ్బుని ఆదా చేయడం కొద్ది ప్రయత్నంలో అందరికీ సాధ్యమవుతుంది. కాబట్టి డబ్బు ఆదా చేయడం ద్వారా మీరు లక్షాధికారులు కావచ్చు.
ఈ పుస్తకంలో ఇచ్చిన ఆదా మార్గాలన్నీ నిత్యజీవితంలో డబ్బుతో ముడిపడినవే. ఈ పుస్తకం మీకు డబ్బు ఆదాలో సహకరిస్తుందని ఆశిస్తూ...
- డా.కె. కిరణ్ కుమార్
'ఒకపైసా ఆదా చేసినా ఆ డబ్బుని సంపాదించినట్లే! అన్నారు జార్జి బెర్నార్డ్ షా. ఈ పుస్తకంలో నిత్యజీవితంలో ప్రతి కోణం నుండి డబ్బెలా ఆదా చేయాలో వివరిస్తున్నాం. ఈ పుస్తకం రాస్తున్నప్పుడు నా కొలీగ్ ఒకతను వచ్చాడు. నేను రాస్తున్న పుస్తకం గురించి చెప్పగానే అపహాస్యంలా నవ్వాడు. ఆఖరికి మా చర్చలో తేలిందేమిటంటే - అతడు మొన్ననే ఎల్ఐసీ పాలసీ తీసుకున్నాడు. మొత్తం ప్రీమియం పదివేలు. నిజానికి చాలామంది ఎల్ఐసీ పాలసీ ఏజంట్లు తమ వ్యాపారాభివృద్ది కోసం మొదటి సంవత్సరం తమకోచ్చే కమిషన్ (దాదాపు 15శాతం నుండి 25శాతం)ని కష్టమర్ కి ఇచ్చేస్తారు. అయితే కొంతమంది కస్టమర్లకు ఆ విషయం తెలియదు కాబట్టి అడగరు. అలాంటి వారిలో మా కొలీగ్ కి ఒకరు. చర్చలో మా మధ్య ఈ విషయం రాగానే అతడు వెంటనే ఎల్ఐసీ ఏజంట్ కు ఫోన్ చేసి కమీషన్ విషయం అడిగాడు. మరో గంటలో ఆ ఎల్ఐసీ ఏజంట్ పరిగెత్తుకుంటూ వచ్చి రెండు వేలు నా కొలీగ్ కీ ఇచ్చాడు. అలా గంటలో రెండు వేలు చేతిలో పడడంతో నా కొలీగ్ కీ మతిపోయింది. వెంటనే జేబులోంచి డబ్బు తిసిస్తూ, ఈ పుస్తకం కోసం ఓ వంద కాపీలు ఆర్డర్ పెట్టాడు. తన బంధవులకు, స్నేహితులకు ఇలాంటి విషయాలు తెలియజేయడానికి తాను ఈ పుస్తకం కాపీలు వారికి పంచిపెడతానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే - మనలో చాలామందికి ఇలాంటి విషయాలు తెలియవు. నిజానికి పోదుపుని మించిన సుఖం లేదు. లక్షలు సంపాదించాలంటే ఎంతో స్ట్రగుల్, ఆరాటం,టెన్సన్... లాంటివి ఎన్నో ఎదుర్కోవాలి. అదే పొదుపు వల్ల అయితే అలాంటివేమి లేకుండానే జీవితం నందనవనం చేసుకోవచ్చు. డబ్బు సంపాదించడం అందరికీ చేతకాకపోవచ్చు. కాని డబ్బుని ఆదా చేయడం కొద్ది ప్రయత్నంలో అందరికీ సాధ్యమవుతుంది. కాబట్టి డబ్బు ఆదా చేయడం ద్వారా మీరు లక్షాధికారులు కావచ్చు. ఈ పుస్తకంలో ఇచ్చిన ఆదా మార్గాలన్నీ నిత్యజీవితంలో డబ్బుతో ముడిపడినవే. ఈ పుస్తకం మీకు డబ్బు ఆదాలో సహకరిస్తుందని ఆశిస్తూ... - డా.కె. కిరణ్ కుమార్
© 2017,www.logili.com All Rights Reserved.