స్టాక్ మార్కేట్ లో మీకు అనుభవం లేదు. ఎలాంటి షేర్లు కొనాలో తెలియదు. ఎంతడబ్బు పెట్టాలో పరిజ్ఞానం లేదు. అలా అని స్టాక్ మార్కేట్ పెరుగుతూ వుంటుంటే చూస్తూ ఊరుకోలేరు. మరి ఆ మార్కేట్ లో ఎలా డబ్బు సంపాదించాలో తెలియక సతమతమవుతుంటారు. ఈ నేపధ్యంలో స్టాక్ మార్కేట్ లో ఏ మాత్రం పరిజ్ఞానంలేని ఇన్వెస్టర్లకు ఓ ఆశాకిరణం వెలువడింది. ఆ ఆశాకిరణం పేరే మ్యూచువల్ ఫండ్స్.
ప్రస్తుతం భారత ఆర్ధిక వ్యవస్థ ఎన్నడూలేనంతగా అద్భుత ప్రగతితో అలరారుతోంది. ఫలితంగా పారిశ్రామిక వ్యవస్థకు పట్టుకొమ్ము అయిన స్టాక్ మార్కేట్, మనీ మార్కేట్ లు ఎన్నడూ లేనంతగా కళకళలాడుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రతివారూ ఆ పారిశ్రామిక వ్యవస్థకు మరో రూపమైన స్టాక్ మార్కేట్ లో భాగస్వాములు కావాలనుకుంటున్నారు. అయితే వారికి అనుభవం లేదు. అలంటి వారి కలలను సాకారం చేసుకునే సాధనమే ఈ మ్యూచువల్ ఫండ్స్.
ప్రస్తుతం బ్యాంకు వడ్డీరేట్లు దిగువస్థాయికి పడిపోయాయి. చిట్ ఫండ్ కంపెనీలు దివాళా తిసున్నాయి. పిఎఫ్ లు మీద రాబడులు కనిష్టస్థాయి (8.5%) లో వున్నాయి. బంగారం ధర ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతోందో తెలియదు. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి కావాలంటే పెద్ద మొత్తం కావలి. ఈ నేపధ్యంలో అంధకారంలో కాంతిరేకుల్లా తళుక్కున మెరిసే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు శ్రీరామరక్ష లాంటిది.
పోస్టాఫిసుల్లో, బ్యాంకుల్లో నెల నెలా కొంత మొత్తం ముదపు చేసే మాదిరిగానే, ఈ మ్యూచువల్ ఫండ్స్ లో సైతం అలాంటి ముదపు అవకాశం వుంది. ఈ అవకశం పేరే Systematic Investment Plan (SIP). మీ రిస్క్ నీ తగ్గించే అద్భుత సాధనమే ఈ Systematic Investment Plan (SIP).
ఒకప్పుడు ఎల్.ఐ.సీ., పి.ఎఫ్. లో పెట్టుబడి పెట్టె ప్రజలు నేడు ఈ మ్యూచువల్ ఫండ్స్ కేసి మొగ్గు చూపిస్తున్నారు. ఒకప్పుడు ఫిక్సెడ్ డిపాజిట్లు, బంగారంలో పెట్టుబడి పెట్టె ఇన్వెస్టర్లు నేడు మ్యూచువల్ ఫండ్స్ కై పరుగులు తీస్తున్నారు. అంతేకాక తమ రిటైర్ మెంట్ తర్వాత, తమ పిల్లల భవిష్యత్ నిధి కోసం ప్రత్యేకంగా వెలిసిన మ్యూచువల్ ఫండ్స్ కేసి నిధులు తరలివస్తున్నారు. మన జీవన స్రవంతిలో ఒక పెట్టుబడి అవకాశంగా మారిన మ్యూచువల్ ఫండ్స్ కోసం ప్రత్యేకంగా వెలువడిన ఈ పుస్తకం ఇన్వెస్టర్లకు ఉపయోగకరం కాగలదని ఆశిస్తున్నాం.
- డా.కె. కిరణ్ కుమార్
స్టాక్ మార్కేట్ లో మీకు అనుభవం లేదు. ఎలాంటి షేర్లు కొనాలో తెలియదు. ఎంతడబ్బు పెట్టాలో పరిజ్ఞానం లేదు. అలా అని స్టాక్ మార్కేట్ పెరుగుతూ వుంటుంటే చూస్తూ ఊరుకోలేరు. మరి ఆ మార్కేట్ లో ఎలా డబ్బు సంపాదించాలో తెలియక సతమతమవుతుంటారు. ఈ నేపధ్యంలో స్టాక్ మార్కేట్ లో ఏ మాత్రం పరిజ్ఞానంలేని ఇన్వెస్టర్లకు ఓ ఆశాకిరణం వెలువడింది. ఆ ఆశాకిరణం పేరే మ్యూచువల్ ఫండ్స్. ప్రస్తుతం భారత ఆర్ధిక వ్యవస్థ ఎన్నడూలేనంతగా అద్భుత ప్రగతితో అలరారుతోంది. ఫలితంగా పారిశ్రామిక వ్యవస్థకు పట్టుకొమ్ము అయిన స్టాక్ మార్కేట్, మనీ మార్కేట్ లు ఎన్నడూ లేనంతగా కళకళలాడుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రతివారూ ఆ పారిశ్రామిక వ్యవస్థకు మరో రూపమైన స్టాక్ మార్కేట్ లో భాగస్వాములు కావాలనుకుంటున్నారు. అయితే వారికి అనుభవం లేదు. అలంటి వారి కలలను సాకారం చేసుకునే సాధనమే ఈ మ్యూచువల్ ఫండ్స్. ప్రస్తుతం బ్యాంకు వడ్డీరేట్లు దిగువస్థాయికి పడిపోయాయి. చిట్ ఫండ్ కంపెనీలు దివాళా తిసున్నాయి. పిఎఫ్ లు మీద రాబడులు కనిష్టస్థాయి (8.5%) లో వున్నాయి. బంగారం ధర ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతోందో తెలియదు. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి కావాలంటే పెద్ద మొత్తం కావలి. ఈ నేపధ్యంలో అంధకారంలో కాంతిరేకుల్లా తళుక్కున మెరిసే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు శ్రీరామరక్ష లాంటిది. పోస్టాఫిసుల్లో, బ్యాంకుల్లో నెల నెలా కొంత మొత్తం ముదపు చేసే మాదిరిగానే, ఈ మ్యూచువల్ ఫండ్స్ లో సైతం అలాంటి ముదపు అవకాశం వుంది. ఈ అవకశం పేరే Systematic Investment Plan (SIP). మీ రిస్క్ నీ తగ్గించే అద్భుత సాధనమే ఈ Systematic Investment Plan (SIP). ఒకప్పుడు ఎల్.ఐ.సీ., పి.ఎఫ్. లో పెట్టుబడి పెట్టె ప్రజలు నేడు ఈ మ్యూచువల్ ఫండ్స్ కేసి మొగ్గు చూపిస్తున్నారు. ఒకప్పుడు ఫిక్సెడ్ డిపాజిట్లు, బంగారంలో పెట్టుబడి పెట్టె ఇన్వెస్టర్లు నేడు మ్యూచువల్ ఫండ్స్ కై పరుగులు తీస్తున్నారు. అంతేకాక తమ రిటైర్ మెంట్ తర్వాత, తమ పిల్లల భవిష్యత్ నిధి కోసం ప్రత్యేకంగా వెలిసిన మ్యూచువల్ ఫండ్స్ కేసి నిధులు తరలివస్తున్నారు. మన జీవన స్రవంతిలో ఒక పెట్టుబడి అవకాశంగా మారిన మ్యూచువల్ ఫండ్స్ కోసం ప్రత్యేకంగా వెలువడిన ఈ పుస్తకం ఇన్వెస్టర్లకు ఉపయోగకరం కాగలదని ఆశిస్తున్నాం. - డా.కె. కిరణ్ కుమార్© 2017,www.logili.com All Rights Reserved.