ఫెంగ్ షూయ్ అనేది ఎవిరికి వారు తేలికగా చేసుకోగలిగే వాస్తు. ఫలితంగా అతి సామాన్యులు సైతం తమ ఇండ్లలో తగిన మార్పులు చేసుకొని సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వుండవచ్చు.
ఈ పుస్తకాన్ని ఫెంగ్ షూయ్ ప్రయోజనాలను అందరికీ అందుబాటులో తేవాలన్న ఆకాంక్షతో పిల్లవాడి దగ్గర నుండి వృద్ధుల దాకా అందరికీ అర్ధమయ్యే రీతిలో కిరణ్ కుమార్ గారు మనకు ఈ పుస్తకాన్ని అందించారు.
ఫెంగ్ షూయ్ అనేది ఒక అద్వితీయమైన శాస్త్రం. మన జీవితంలో అన్ని కోణాల్లో ఫెంగ్ షూయ్ ని అమలు చేసి అద్భుత ఫలితాలను పొందవచ్చు. ఆఖరికి మీ ఆఫీసు విజిటింగ్ కార్డు దగ్గర నుండి మీరు నడిపించే వాహనం వరకూ ఫెంగ్ షూయ్ నీ అమలు చేసి గణనీయమైన ఫలితాలు సాధించవచ్చు.
నిజానికి ఫెంగ్ షూయ్ నీ కేవలం గృహలకే అన్వయించవచ్చని చాలామందిలో ఒక అభిప్రాయం వుంది. కాని ఫెంగ్ షూయ్ నీ మనం పనిచేస్తున్న ఆఫీసుకీ, వ్యాపారస్తులకు సైతం అన్వయించి చక్కటి ఫలితాలను పొందవచ్చని చాలా మందికి తెలియదు. కేవలం ఉద్యోగస్తులకు, వ్యాపరస్తులకే కాకుండా క్రిడాకారులకు, సినిమా నటులకు, రాజకీయ నాయకులకు సైతం ఫెంగ్ షూయ్ ని అన్వయించవచ్చు.
మీరు చూసేవుంటారు చాలామంది మధ్యస్థాయి రాజకీయ నాయకులు, సంస్థలు చాలా కొద్ది రోజుల్లోనే మెరుపు వేగంతో పెద్ద నాయకులు లేదా పెద్ద సంస్థాల్లా రూపుదిద్దుకోవడం. హైదరాబాదులో కొన్ని సినిమాదియేటర్ లు అద్భుత కలెక్షన్ లతో వర్ధిల్లుతుండగా మరి కొన్ని మూతపడిపోయాయి గిడ్డంగి కేంద్రాలుగా రుపొందుకుంటున్నాయి. అలాగే కొన్ని బిజినెస్ లు కళకళలాడుతుండగా, మరికొన్ని కళావిహినమై కన్పిస్తాయి.
ప్రమోద్ మహాజన్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో అత్యంత కీలక పాత్రుడు. ఒకప్పుడు ఒక మధ్య తరగతి నాయకుడుగా ఉన్న ఆయన నేడు అనేక మంది సీనియర్ సభ్యులను తలదన్ని అత్యున్నత మంత్రి పదవిని పొందారు. ఆయన సమకాలికులు ఎవరూ నేడు అంత అత్యున్నత స్థాయికి చేరుకోలేకపోయారు.
శ్రీ ఎన్.టి.రామారావు కేవలం 9నెలల్లో ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్టించారు. ఎన్.టి.రామారావు అల్లుళ్ళలో దగ్గుపాటి ప్రస్తుతం రాజకీయాలలో దాదాపు కనుమరుగై పోగా శ్రీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు.
అలాగే క్రికెట్ రంగంలో సైతం కొంతమంది బాగా ఆడినా ఎక్కువ కాలం నిలదొక్కుకోలేక పోతున్నారు. కొంతమంది ఎంత పేలవంగా ఆడినా జట్టులో స్థానం పొందుతూనే ఉన్నారు.
పై తేడాలన్నీ ఆయా వ్యక్తుల లేక సంస్థల కెరీర్ దిక్కులలో జరిగిన ఫలితాలేనని ఫెంగ్ షూయ్ విశ్లేషకుల ఊవాచ. సరైన ఫెంగ్ షూయ్ ఆచరిస్తే అనిశ్చిత పరిస్థితిని సైతం పూర్తి సామర్థ్యంతో చక్కబెట్టవచ్చని ఫెంగ్ షూయ్ నిపుణుల పూర్తి నమ్మకం.
ఈ నేపధ్యంలో బిజినెస్ చేసేవారి కోసం, కళాకారులకు, స్వంత వృత్తి గలవారి కోసం ఈ పుస్తకం వెలువరించారు.
షెంగ్ షూయ్ టిప్ లు - టెక్నిక్ ల వల్ల మీరు ఫెంగ్ షూయ్ ఉత్పత్తి చక్రం - స్థానాలు లాంటి విషయాలు తెలుసుకోకుండానే డైరక్ట్ గా ఈ టిప్ లు టెక్నిక్ లను అన్వయించే పరిష్కారాలు పొందవచ్చు. అసలు ఎలాంటి ఫెంగ్ షూయ్ చరిత్ర తెలుసుకోకుండానే సామాన్యులు సైతం ఈ సులభ టిప్ లను పాటించవచ్చు. ఈ పుస్తకం మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని ఆశిస్తూ...
- కె కిరణ్ కుమార్
ఫెంగ్ షూయ్ అనేది ఎవిరికి వారు తేలికగా చేసుకోగలిగే వాస్తు. ఫలితంగా అతి సామాన్యులు సైతం తమ ఇండ్లలో తగిన మార్పులు చేసుకొని సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వుండవచ్చు. ఈ పుస్తకాన్ని ఫెంగ్ షూయ్ ప్రయోజనాలను అందరికీ అందుబాటులో తేవాలన్న ఆకాంక్షతో పిల్లవాడి దగ్గర నుండి వృద్ధుల దాకా అందరికీ అర్ధమయ్యే రీతిలో కిరణ్ కుమార్ గారు మనకు ఈ పుస్తకాన్ని అందించారు. ఫెంగ్ షూయ్ అనేది ఒక అద్వితీయమైన శాస్త్రం. మన జీవితంలో అన్ని కోణాల్లో ఫెంగ్ షూయ్ ని అమలు చేసి అద్భుత ఫలితాలను పొందవచ్చు. ఆఖరికి మీ ఆఫీసు విజిటింగ్ కార్డు దగ్గర నుండి మీరు నడిపించే వాహనం వరకూ ఫెంగ్ షూయ్ నీ అమలు చేసి గణనీయమైన ఫలితాలు సాధించవచ్చు. నిజానికి ఫెంగ్ షూయ్ నీ కేవలం గృహలకే అన్వయించవచ్చని చాలామందిలో ఒక అభిప్రాయం వుంది. కాని ఫెంగ్ షూయ్ నీ మనం పనిచేస్తున్న ఆఫీసుకీ, వ్యాపారస్తులకు సైతం అన్వయించి చక్కటి ఫలితాలను పొందవచ్చని చాలా మందికి తెలియదు. కేవలం ఉద్యోగస్తులకు, వ్యాపరస్తులకే కాకుండా క్రిడాకారులకు, సినిమా నటులకు, రాజకీయ నాయకులకు సైతం ఫెంగ్ షూయ్ ని అన్వయించవచ్చు. మీరు చూసేవుంటారు చాలామంది మధ్యస్థాయి రాజకీయ నాయకులు, సంస్థలు చాలా కొద్ది రోజుల్లోనే మెరుపు వేగంతో పెద్ద నాయకులు లేదా పెద్ద సంస్థాల్లా రూపుదిద్దుకోవడం. హైదరాబాదులో కొన్ని సినిమాదియేటర్ లు అద్భుత కలెక్షన్ లతో వర్ధిల్లుతుండగా మరి కొన్ని మూతపడిపోయాయి గిడ్డంగి కేంద్రాలుగా రుపొందుకుంటున్నాయి. అలాగే కొన్ని బిజినెస్ లు కళకళలాడుతుండగా, మరికొన్ని కళావిహినమై కన్పిస్తాయి. ప్రమోద్ మహాజన్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో అత్యంత కీలక పాత్రుడు. ఒకప్పుడు ఒక మధ్య తరగతి నాయకుడుగా ఉన్న ఆయన నేడు అనేక మంది సీనియర్ సభ్యులను తలదన్ని అత్యున్నత మంత్రి పదవిని పొందారు. ఆయన సమకాలికులు ఎవరూ నేడు అంత అత్యున్నత స్థాయికి చేరుకోలేకపోయారు. శ్రీ ఎన్.టి.రామారావు కేవలం 9నెలల్లో ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్టించారు. ఎన్.టి.రామారావు అల్లుళ్ళలో దగ్గుపాటి ప్రస్తుతం రాజకీయాలలో దాదాపు కనుమరుగై పోగా శ్రీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే క్రికెట్ రంగంలో సైతం కొంతమంది బాగా ఆడినా ఎక్కువ కాలం నిలదొక్కుకోలేక పోతున్నారు. కొంతమంది ఎంత పేలవంగా ఆడినా జట్టులో స్థానం పొందుతూనే ఉన్నారు. పై తేడాలన్నీ ఆయా వ్యక్తుల లేక సంస్థల కెరీర్ దిక్కులలో జరిగిన ఫలితాలేనని ఫెంగ్ షూయ్ విశ్లేషకుల ఊవాచ. సరైన ఫెంగ్ షూయ్ ఆచరిస్తే అనిశ్చిత పరిస్థితిని సైతం పూర్తి సామర్థ్యంతో చక్కబెట్టవచ్చని ఫెంగ్ షూయ్ నిపుణుల పూర్తి నమ్మకం. ఈ నేపధ్యంలో బిజినెస్ చేసేవారి కోసం, కళాకారులకు, స్వంత వృత్తి గలవారి కోసం ఈ పుస్తకం వెలువరించారు. షెంగ్ షూయ్ టిప్ లు - టెక్నిక్ ల వల్ల మీరు ఫెంగ్ షూయ్ ఉత్పత్తి చక్రం - స్థానాలు లాంటి విషయాలు తెలుసుకోకుండానే డైరక్ట్ గా ఈ టిప్ లు టెక్నిక్ లను అన్వయించే పరిష్కారాలు పొందవచ్చు. అసలు ఎలాంటి ఫెంగ్ షూయ్ చరిత్ర తెలుసుకోకుండానే సామాన్యులు సైతం ఈ సులభ టిప్ లను పాటించవచ్చు. ఈ పుస్తకం మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని ఆశిస్తూ... - కె కిరణ్ కుమార్
© 2017,www.logili.com All Rights Reserved.