మనం వార్తల చదువుతాం. వింటాం. చూస్తాం. చర్చిస్తాం. విశ్లేషిస్తాం. విశ్వసిస్తాం. అనుమానిస్తాం. తిరస్కరిస్తాం. ఆశ్చర్యపోతాం. నివ్వేరపోతాం. సంతోషిస్తాం. బాధపడతాం. దుఖిస్తాం. కానీ వార్తా నిర్మాణం ఎట్లా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయం. ఫలానాది బాగోలేదనీ అనుకుంటాం. అందుకు గల కారణాలు ఏమిటో తెలుసుకోడానికి ప్రయత్నించం. వార్తలను ఎట్లా సేకరిస్తారో, ఎట్లా రాస్తారో, ఎట్లా ప్రచురిస్తారో, వార్తాంశాల సేకరణలో సాధకభాధకాలు ఏమిటో తెలుసుకునే అవకాశం పాఠకులకు లేదు. ప్రతి వార్త వెనుకా ఒక కధ ఉంటుంది. ప్రతి కధ వెనుకా ఒక విలేఖరి ఉంటాడు. ఆ విలేఖరి ఆ సమాచారం ఎలా అందింది? ఎలా స్పందించారు? ఎలా శోధించారు? ఎలా రాశారు? ఆ వార్త పర్యవసానాలు ఏమిటి? నిజాం మృతి, ప్రజాస్వామ్య సంక్షోభం, కొండపల్లి సీతారామయ్య తొలి ఇంటర్వ్యూ, బాబ్రీ మసీదు కూల్చీవేత, రాజీవ్ గాంధీ హత్య, అలిపిరి మందుపాతర, సింగరేణి అశాంతి, కరెంటు కాల్పులు, మన్యం జ్వరాలు, భూకుంభకోణాలు అవినీతి భాగోతాలు, రాజకీయ వివాదాలు, సామాజిక సమస్యలు..... ఆయా సందర్భాల్లో జర్నలిస్టుల అనుభవం ఏమిటి? నలభై అయిదు మంది జర్నలిస్టుల అనుభవాల సంకలనమే ఈ "వార్తల వెనుక కధ"!
- కె.రామచంద్రమూర్తి
మనం వార్తల చదువుతాం. వింటాం. చూస్తాం. చర్చిస్తాం. విశ్లేషిస్తాం. విశ్వసిస్తాం. అనుమానిస్తాం. తిరస్కరిస్తాం. ఆశ్చర్యపోతాం. నివ్వేరపోతాం. సంతోషిస్తాం. బాధపడతాం. దుఖిస్తాం. కానీ వార్తా నిర్మాణం ఎట్లా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయం. ఫలానాది బాగోలేదనీ అనుకుంటాం. అందుకు గల కారణాలు ఏమిటో తెలుసుకోడానికి ప్రయత్నించం. వార్తలను ఎట్లా సేకరిస్తారో, ఎట్లా రాస్తారో, ఎట్లా ప్రచురిస్తారో, వార్తాంశాల సేకరణలో సాధకభాధకాలు ఏమిటో తెలుసుకునే అవకాశం పాఠకులకు లేదు. ప్రతి వార్త వెనుకా ఒక కధ ఉంటుంది. ప్రతి కధ వెనుకా ఒక విలేఖరి ఉంటాడు. ఆ విలేఖరి ఆ సమాచారం ఎలా అందింది? ఎలా స్పందించారు? ఎలా శోధించారు? ఎలా రాశారు? ఆ వార్త పర్యవసానాలు ఏమిటి? నిజాం మృతి, ప్రజాస్వామ్య సంక్షోభం, కొండపల్లి సీతారామయ్య తొలి ఇంటర్వ్యూ, బాబ్రీ మసీదు కూల్చీవేత, రాజీవ్ గాంధీ హత్య, అలిపిరి మందుపాతర, సింగరేణి అశాంతి, కరెంటు కాల్పులు, మన్యం జ్వరాలు, భూకుంభకోణాలు అవినీతి భాగోతాలు, రాజకీయ వివాదాలు, సామాజిక సమస్యలు..... ఆయా సందర్భాల్లో జర్నలిస్టుల అనుభవం ఏమిటి? నలభై అయిదు మంది జర్నలిస్టుల అనుభవాల సంకలనమే ఈ "వార్తల వెనుక కధ"! - కె.రామచంద్రమూర్తి© 2017,www.logili.com All Rights Reserved.