ఎన్నో ప్రదర్శనలకు నోచుకోని రచయితను లబ్దప్రతిష్టుడ్ని చేసిన నాటకమిది. రక్తికట్టడానికి నాటక పాత్రదారులు అసలు నాటకానికి భిన్నంగా ఎన్నో ప్రక్షిప్తాలను జోడించి హాస్యం కురిపించి కొన్ని వర్గాలను కించపరచకపోలేదు. కానీ, అసలు కవి హృదయం కాదది. మూలనాటకంలోని సంస్కరణాభిలాష, సాంఘిక చైతన్యం ఈనాడు చదివితే రచయిత గొప్పదనం, నాటకం విశిష్టత తేటతెల్లమవుతుంది. అందుకే ఈ ప్రచురణ.
కాళ్ళకూరి నారాయణరావు(రచయిత గురించి) :
1871లో జన్మించిన వీరు కవిరాజు బిరుదాంకితులు. కొంతకాలం అధ్యాపక వృత్తినవలంభించారు. వీరి నాటకాలలో ప్రసిద్ధమైనవి చింతామణి, వరవిక్రయము, మధుసేవా. వీరిపై కందుకూరి, రఘుపతి వెంకటరత్నం నాయుడుగార్ల ప్రభావంపడి ఎన్నో నాటకాలు రచించారు. వీరు సంఘ సంస్కర్తే కాక తను ఒక శూద్ర స్త్రీని వివాహమాడిన ఆచరణ శీలి. 1927 జూన్ 2న పశ్చిమ గోదావరి సిద్ధాంతం గ్రామంలో పరమపదించారు.
- కాళ్ళకూరి నారాయణరావు
ఎన్నో ప్రదర్శనలకు నోచుకోని రచయితను లబ్దప్రతిష్టుడ్ని చేసిన నాటకమిది. రక్తికట్టడానికి నాటక పాత్రదారులు అసలు నాటకానికి భిన్నంగా ఎన్నో ప్రక్షిప్తాలను జోడించి హాస్యం కురిపించి కొన్ని వర్గాలను కించపరచకపోలేదు. కానీ, అసలు కవి హృదయం కాదది. మూలనాటకంలోని సంస్కరణాభిలాష, సాంఘిక చైతన్యం ఈనాడు చదివితే రచయిత గొప్పదనం, నాటకం విశిష్టత తేటతెల్లమవుతుంది. అందుకే ఈ ప్రచురణ. కాళ్ళకూరి నారాయణరావు(రచయిత గురించి) : 1871లో జన్మించిన వీరు కవిరాజు బిరుదాంకితులు. కొంతకాలం అధ్యాపక వృత్తినవలంభించారు. వీరి నాటకాలలో ప్రసిద్ధమైనవి చింతామణి, వరవిక్రయము, మధుసేవా. వీరిపై కందుకూరి, రఘుపతి వెంకటరత్నం నాయుడుగార్ల ప్రభావంపడి ఎన్నో నాటకాలు రచించారు. వీరు సంఘ సంస్కర్తే కాక తను ఒక శూద్ర స్త్రీని వివాహమాడిన ఆచరణ శీలి. 1927 జూన్ 2న పశ్చిమ గోదావరి సిద్ధాంతం గ్రామంలో పరమపదించారు. - కాళ్ళకూరి నారాయణరావు© 2017,www.logili.com All Rights Reserved.