రాయలసీమ గ్రామీణ జీవితంలో కటోర వాస్తవికతను ప్రతిఫలిస్తూ సడ్లపల్లె చిదంబర రెడ్డి రాసిన కధలివి. తెలుగు పటకాలోకానికి తనదయిన పద్దతి లో సీమ మాండలికంలోని సొగసుల్ని పరిచయం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో వున్న పలుకుబడిని, నుడికారాన్ని జవజీవాలతో కధల్లోకి తీసుకురావడంలో రచయిత సఫలమయ్యారు. సీమలో బతుకు ఎంత కనాకష్టమో ఈ కధల్లో దృశ్యమానం చేసారు. చదివిన పాటకుల హృదయాలు ఆర్ద్రమవుతాయి. సహనుభుతితో స్పందిస్తారు. నగరాలకీ , పట్టణాలకీ , పల్లెలకీ మద్య పెరుగుతున్న అంతరాల్ని చర్చకు పెడతాయి ఈ కధలు. నేలను నమ్ముకున్న రైతులు, కూలీలు దినదినగండంగా బతకాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడిందో ఆలోచించాలన్న భావాన్ని వ్యక్తం చేస్తాయి. భూమిని నమ్ముకోవడమే తప్పయిపోయిందనే దుస్థితిలోకి వ్యవసాయదారుల్ని నెట్టివేసిన గ్లోబలైజేషన్ పర్యవసానాల దుర్మార్గాన్ని చెప్పకనే చెప్పడం ఈ కధల ప్రత్యేకత. కధకధనంలో, వ్యక్తీకరణలో,శైలీ శిల్పాల్లో చిడంబరరెడ్డిది విలక్షణ స్వరం. ఆ స్వరం నుంచి వచ్చిన ఈ కధలు చదవడం ఉద్వేగపూరిత అనుభవం.
...... గుడిపాటి
రాయలసీమ గ్రామీణ జీవితంలో కటోర వాస్తవికతను ప్రతిఫలిస్తూ సడ్లపల్లె చిదంబర రెడ్డి రాసిన కధలివి. తెలుగు పటకాలోకానికి తనదయిన పద్దతి లో సీమ మాండలికంలోని సొగసుల్ని పరిచయం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో వున్న పలుకుబడిని, నుడికారాన్ని జవజీవాలతో కధల్లోకి తీసుకురావడంలో రచయిత సఫలమయ్యారు. సీమలో బతుకు ఎంత కనాకష్టమో ఈ కధల్లో దృశ్యమానం చేసారు. చదివిన పాటకుల హృదయాలు ఆర్ద్రమవుతాయి. సహనుభుతితో స్పందిస్తారు. నగరాలకీ , పట్టణాలకీ , పల్లెలకీ మద్య పెరుగుతున్న అంతరాల్ని చర్చకు పెడతాయి ఈ కధలు. నేలను నమ్ముకున్న రైతులు, కూలీలు దినదినగండంగా బతకాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడిందో ఆలోచించాలన్న భావాన్ని వ్యక్తం చేస్తాయి. భూమిని నమ్ముకోవడమే తప్పయిపోయిందనే దుస్థితిలోకి వ్యవసాయదారుల్ని నెట్టివేసిన గ్లోబలైజేషన్ పర్యవసానాల దుర్మార్గాన్ని చెప్పకనే చెప్పడం ఈ కధల ప్రత్యేకత. కధకధనంలో, వ్యక్తీకరణలో,శైలీ శిల్పాల్లో చిడంబరరెడ్డిది విలక్షణ స్వరం. ఆ స్వరం నుంచి వచ్చిన ఈ కధలు చదవడం ఉద్వేగపూరిత అనుభవం. ...... గుడిపాటి© 2017,www.logili.com All Rights Reserved.