సహజ ఎరువులతో చేనుకు చేవ :
రసాయనిక ఎరువులు పంట దిగుబడిని పెంచుతాయి. కాని అదే సమయంలో అవి మట్టి రేణువుల నిర్మాణాన్ని దెబ్బతీస్తాయి. దాంతో దీర్ఘకాలంలో నేల నిస్సారంగా మారుతుంది. హరిత విప్లవం అమలిన ప్రాంతాల్లో ఈ వాస్తవం కళ్ళకు కట్టినట్లు కనబడుతోంది. కొన్ని చోట్ల ఎంతో సారవంతమైన భూమి సైతం పంటలకు పనికి రాకుండా పోయింది. మరోవంక రసాయనిక ఎరువులు ధరలు కూడా చుక్కలంటుతూ పంట వ్యయం పెంచేశాయి. ఈ పరిస్థితుల్లో సహజ సిద్ధమైన ఎరువులు వాడటం రైతుకు రెండందాలా మేలు. అటు ఖర్చు తగ్గించుకోవచ్చు. ఈ సహజ ఎరువులు, హరిత ఎరువులు భూమికి అత్యంత ఉపయుక్తంగా ఉండేట్లు ఎలా తయారు చేసుకోవచ్చో ఈ పుస్తకం వివరిస్తుంది.
క్రిమి సంహారకాలు కాలకూట విషాలు :
తెగళ్ళ నుంచి చిడపిడల నుంచి పంటలను కాపాడుకోవాలంటే క్రిమిసంహారక మందులు వాడక తప్పదు. ఇవి వ్యవసాయంతో ఎంతగానో ముడిపడి పోయాయి. వాస్తవానికి పురుగు మందులు కాలకూట విషాల కంటె కూడా ప్రమాదకరమైనవంటే అతిశయోక్తి కాబోదు. వీటిలో కొన్నింటి ప్రభావం వెంటనే కనిపించదు. కాని దీర్ఘకాలంలో రకరకాలుగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అకాల మరణాలకు సైతం దారితీస్తాయి. వీటి నుంచి మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుని తప్పించుకోవచ్చు. ఆ జాగ్రత్తలు ఏమిటో, వాటిని ఎలా తీసుకోవాలో ఈ పుస్తకం వివరిస్తుంది.
పురుగు మందులు వాడే సరైన పద్ధతులు :
వ్యవసాయాన్ని కూడా ఒక ప్రణాళిక ప్రకారం చేయాలి. గుడ్డెద్దు చేలో పడినచందంగా ఉండకూడదు. తను వాడే ఎరువుల గురించి, పురుగుమందుల గురించి రైతుకు ముందస్తు అవగాహన ఉండాలి. ఈ దిశగా రైతుకు ఉపయోగపడేదే ఈ పుస్తకం. పొలానికి క్రిమిసంహారక విషయంలో చాలా జాగ్రత్తలు, అవసరమైన మందుల ఎంపిక ఎలానో రైతుకు తెలియజేస్తుంది ఈ పుస్తకం. పంటకు మేలు చేసే విధంగా పురుగుమందులను వాడటం ఎలాగో ఇది వివరిస్తుంది. మేలు చేసే ప్రాణులకు, పర్యావరణానికి హాని కలిగించని మందులను ఎలా గుర్తించాలో తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది. అంతేకాకుండా పురుగు మందుల వాడకాన్ని, వ్యయాన్ని, ఫలితాలను శాస్త్రీయంగా నమోదు చేయడం ఎలాగో ఈ పుస్తకం తెలియజేస్తుంది.
వ్యవసాయానికి సంబంధించిన 3బుక్స్ సెట్.
- కోయ వెంకటేశ్వర రావు
సహజ ఎరువులతో చేనుకు చేవ : రసాయనిక ఎరువులు పంట దిగుబడిని పెంచుతాయి. కాని అదే సమయంలో అవి మట్టి రేణువుల నిర్మాణాన్ని దెబ్బతీస్తాయి. దాంతో దీర్ఘకాలంలో నేల నిస్సారంగా మారుతుంది. హరిత విప్లవం అమలిన ప్రాంతాల్లో ఈ వాస్తవం కళ్ళకు కట్టినట్లు కనబడుతోంది. కొన్ని చోట్ల ఎంతో సారవంతమైన భూమి సైతం పంటలకు పనికి రాకుండా పోయింది. మరోవంక రసాయనిక ఎరువులు ధరలు కూడా చుక్కలంటుతూ పంట వ్యయం పెంచేశాయి. ఈ పరిస్థితుల్లో సహజ సిద్ధమైన ఎరువులు వాడటం రైతుకు రెండందాలా మేలు. అటు ఖర్చు తగ్గించుకోవచ్చు. ఈ సహజ ఎరువులు, హరిత ఎరువులు భూమికి అత్యంత ఉపయుక్తంగా ఉండేట్లు ఎలా తయారు చేసుకోవచ్చో ఈ పుస్తకం వివరిస్తుంది. క్రిమి సంహారకాలు కాలకూట విషాలు : తెగళ్ళ నుంచి చిడపిడల నుంచి పంటలను కాపాడుకోవాలంటే క్రిమిసంహారక మందులు వాడక తప్పదు. ఇవి వ్యవసాయంతో ఎంతగానో ముడిపడి పోయాయి. వాస్తవానికి పురుగు మందులు కాలకూట విషాల కంటె కూడా ప్రమాదకరమైనవంటే అతిశయోక్తి కాబోదు. వీటిలో కొన్నింటి ప్రభావం వెంటనే కనిపించదు. కాని దీర్ఘకాలంలో రకరకాలుగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అకాల మరణాలకు సైతం దారితీస్తాయి. వీటి నుంచి మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుని తప్పించుకోవచ్చు. ఆ జాగ్రత్తలు ఏమిటో, వాటిని ఎలా తీసుకోవాలో ఈ పుస్తకం వివరిస్తుంది. పురుగు మందులు వాడే సరైన పద్ధతులు : వ్యవసాయాన్ని కూడా ఒక ప్రణాళిక ప్రకారం చేయాలి. గుడ్డెద్దు చేలో పడినచందంగా ఉండకూడదు. తను వాడే ఎరువుల గురించి, పురుగుమందుల గురించి రైతుకు ముందస్తు అవగాహన ఉండాలి. ఈ దిశగా రైతుకు ఉపయోగపడేదే ఈ పుస్తకం. పొలానికి క్రిమిసంహారక విషయంలో చాలా జాగ్రత్తలు, అవసరమైన మందుల ఎంపిక ఎలానో రైతుకు తెలియజేస్తుంది ఈ పుస్తకం. పంటకు మేలు చేసే విధంగా పురుగుమందులను వాడటం ఎలాగో ఇది వివరిస్తుంది. మేలు చేసే ప్రాణులకు, పర్యావరణానికి హాని కలిగించని మందులను ఎలా గుర్తించాలో తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది. అంతేకాకుండా పురుగు మందుల వాడకాన్ని, వ్యయాన్ని, ఫలితాలను శాస్త్రీయంగా నమోదు చేయడం ఎలాగో ఈ పుస్తకం తెలియజేస్తుంది. వ్యవసాయానికి సంబంధించిన 3బుక్స్ సెట్. - కోయ వెంకటేశ్వర రావు
© 2017,www.logili.com All Rights Reserved.