శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్ర మాధుర్యం యావదాంధ్రలోకాన్నీ ఆనంద డోలికల్లో ఓలలాడించింది. వేంకటేశ్వరరావు గారి గానసుధా మాధుర్యాన్ని “కర్ణపుటంబులారగ్రోలిన" అశేషాంద్రజనానీకంలో ఒకణ్నిగా నా హృదయానందాన్ని వారి కళావైదుష్యానికి నివాళిగా సమర్పిస్తున్నాను.
-శ్రీశ్రీ
అతడు కోట్ల తెలుగుల ఎద
అంచుల ఊగిన ఉయాల
తీయని గాంధర్వ హేల
గాయకమణి ఘంటసాల
- డాక్టర్ సి. నారాయణ రెడ్డి
ఘంటసాలవారి కమనీయ కంఠాన
పలుకనట్టి రాగ భావమేది!
ఘంటసాలవారి గాన ధారలలోన
తడియనట్టి తెలుగు టెడద యేది!
- దాశరధి
చలన చిత్ర శ్రీ విశాల ఫాలమ్ముపై
తళతళ మెరయు గంధర్వతార
తమిళ కర్ణాట కేరాళాంధ్రముల యందు
వేలకొలది గీతమ్ముల నాలపించి
ఖ్యాతి గన్నాడు చాల! సంగీతలక్ష్మి
కంఠకర్తారమాల! మా “ఘంటసాల!"
- కరుణశ్రీ
శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్ర మాధుర్యం యావదాంధ్రలోకాన్నీ ఆనంద డోలికల్లో ఓలలాడించింది. వేంకటేశ్వరరావు గారి గానసుధా మాధుర్యాన్ని “కర్ణపుటంబులారగ్రోలిన" అశేషాంద్రజనానీకంలో ఒకణ్నిగా నా హృదయానందాన్ని వారి కళావైదుష్యానికి నివాళిగా సమర్పిస్తున్నాను. -శ్రీశ్రీ అతడు కోట్ల తెలుగుల ఎద అంచుల ఊగిన ఉయాల తీయని గాంధర్వ హేల గాయకమణి ఘంటసాల - డాక్టర్ సి. నారాయణ రెడ్డి ఘంటసాలవారి కమనీయ కంఠాన పలుకనట్టి రాగ భావమేది! ఘంటసాలవారి గాన ధారలలోన తడియనట్టి తెలుగు టెడద యేది! - దాశరధి చలన చిత్ర శ్రీ విశాల ఫాలమ్ముపై తళతళ మెరయు గంధర్వతార తమిళ కర్ణాట కేరాళాంధ్రముల యందు వేలకొలది గీతమ్ముల నాలపించి ఖ్యాతి గన్నాడు చాల! సంగీతలక్ష్మి కంఠకర్తారమాల! మా “ఘంటసాల!" - కరుణశ్రీ© 2017,www.logili.com All Rights Reserved.