యాత్ర అనగానే సుదూర గతంలో, మనదేశంలో ఎన్నో ప్రదేశాలు పర్యటించి, నాటి సాంఘిక సాంస్కృతిక రాజకీయార్థిక సంగతులతో అమూల్యమైన విశేషాలెన్నో మనకందించిన విదేశీయులు మొదలు, మనవాడు ఏనుగుల వీరాస్వామయ్య కాశీ యాత్ర వరకూ ఎన్నో మనసులో మెదలుతాయి.
...
దేవులపల్లి కృష్ణమూర్తి 'మా యాత్ర' వీటికి భిన్నమైనది. విశేషమైనది, గుర్తింపదగినది.
...
దేవులపల్లి వారి యాత్ర పుస్తక రూపంలో వున్నా, మనల్ని తనలోకి తీసుకుంటుంది. తద్వారా మనం కూడా సహయాత్రీకులమవుతాం.
అదెట్లనగా-
నకిరేకల్ నుంచి ఒక మినీ టూరిస్టు బస్సు ఉత్తర భారతదేశ యాత్రకై ఒక ఉదయాన బయల్దేరింది. ఇందులో ఇరవై నలుగురు యాత్రీకులున్నారు. ఇరవై రోజుల్లో ముప్ఫయి ప్రదేశాలు దర్శించడం వుద్దేశం. ...
ఆ మినీ బస్సులో దేవులపల్లి వారి పక్కన ఒక వూహాజనిత సీటు వుంటుంది. దానిమీద యీ పుస్తకాన్ని చదువుతున్న పాఠకుడు కూర్చుని వుంటాడు. ఆమె అయితే ఆమె వుంటుంది. కృష్ణమూర్తిగారే అతన్ని/ఆమెను లోపలికి తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టాడు.
...
పాఠకుడు దారిపొడుగునా పరిసరాలను గమనిస్తూ పరవశించడమే గాక, ఆయా దర్శనీయ స్థలాల సౌందర్యం చారిత్రక ప్రాముఖ్యం శిల్పవైభవం, కృష్ణమూర్తిగారి మాటల్లో వినడమేగాక, యితర యాత్రీకులు చెబుతున్న తమ బతుకుల్లోని సాధక బాధకాలు, అ ల్లకల్లోలాలు దృశ్యమానంగా వింటూ వుంటాడు.
ఇలా ఒకవైపు ఆయా స్థలాల అద్భుత రమణీయం, రెండూ సమాంతరంగా కొనసాగిపోతూ వుంటాయి.
దేవులపల్లి వారు ''ఊరు వాడ బతుకు''లో పూర్తిగా జానపద జనపథకుడిగా కనిపిస్తాడు. యాత్రలో ఆధునిక కవితాంచలాలు అందుకున్న కవననవ్య తాత్వికుడిగా అగుపిస్తాడు.
(ముందుమాట 'నక్రేకల్ నజరానా' నుంచి)
© 2017,www.logili.com All Rights Reserved.