2016 మే చివరి, జూన్ మొదటి వారాల్లో మేము చేసిన కాశ్మీర యాత్రలో అక్కడక్కడా కొన్ని అవాంతరాలు ఎదురైనా మా పర్యటన చివరికి సుఖాంతమే అయింది. ఆ యాత్రా విశేషాలను నేను గతంలో ముఖపుస్తకం (ఫేస్ బుక్) లో ఓ సచిత్ర ధారావాహికగా వెలువరించాను. దానికి చదువరులనుంచి విశేష స్పందన వచ్చింది. ఎందరో మిత్రులు ఈ ధారావాహికకు ఒక గ్రంథరూపం ఇవ్వమని కోరారు. వారందరి కోరిక మేరకు ఆ యాత్రా కథనానికి మరిన్ని చారిత్రిక, శాస్త్రీయ విశేషాలు జోడించి ఇప్పుడిలా 'మా కాశ్మీర యాత్ర' పేరుతో గ్రంథంగా వెలువరించాను. అక్కడి రమణీయ ప్రక్రుతి దృశ్యాలను, చారిత్రిక ప్రదేశాలను చూసి ఆస్వాదిస్తూ తాము పొందిన తియ్యటి అనుభూతులతోపాటు, కొన్ని తావులలో తమకెదురైన చెడు అనుభవాలనూ, ఉన్నవున్నట్లు మనతో పంచుకుంటారు రచయిత.
ఈ పుస్తకంలో కాశ్మీర్ చారిత్రక నేపథ్యం, నేటి కాశ్మీర్ సమస్య పూర్వాపరాలు లోతుగా చర్చించారాయన. అందుకే ఇది కేవలం కాశ్మీర్ పర్యాటకులకు ఓ సవివరమైన యాత్రా మార్గదర్శి మాత్రమే కాదు - కాశ్మీర్ గురించి సమగ్రంగా అధ్యయనం చేయగోరెవారికి ఉపకరించే ఓ రిఫరెన్స్ గ్రంథం కూడా, తెనాలి రామకృష్ణ కవి, స్రమవీరులు, ఇలియడ్, కూరగాథలు, ఇంటింటి వైద్యం, దేవుడున్నాడా?, మా కేరళ యాత్ర వంటి విశ్లేషణాత్మక రచనలతో పాఠకులను మెప్పించిన రచయిత ప్రతిభకు ఈ పుస్తకం మరో తాజా సాక్ష్యం.
- ప్రచురణ కర్తలు
2016 మే చివరి, జూన్ మొదటి వారాల్లో మేము చేసిన కాశ్మీర యాత్రలో అక్కడక్కడా కొన్ని అవాంతరాలు ఎదురైనా మా పర్యటన చివరికి సుఖాంతమే అయింది. ఆ యాత్రా విశేషాలను నేను గతంలో ముఖపుస్తకం (ఫేస్ బుక్) లో ఓ సచిత్ర ధారావాహికగా వెలువరించాను. దానికి చదువరులనుంచి విశేష స్పందన వచ్చింది. ఎందరో మిత్రులు ఈ ధారావాహికకు ఒక గ్రంథరూపం ఇవ్వమని కోరారు. వారందరి కోరిక మేరకు ఆ యాత్రా కథనానికి మరిన్ని చారిత్రిక, శాస్త్రీయ విశేషాలు జోడించి ఇప్పుడిలా 'మా కాశ్మీర యాత్ర' పేరుతో గ్రంథంగా వెలువరించాను. అక్కడి రమణీయ ప్రక్రుతి దృశ్యాలను, చారిత్రిక ప్రదేశాలను చూసి ఆస్వాదిస్తూ తాము పొందిన తియ్యటి అనుభూతులతోపాటు, కొన్ని తావులలో తమకెదురైన చెడు అనుభవాలనూ, ఉన్నవున్నట్లు మనతో పంచుకుంటారు రచయిత. ఈ పుస్తకంలో కాశ్మీర్ చారిత్రక నేపథ్యం, నేటి కాశ్మీర్ సమస్య పూర్వాపరాలు లోతుగా చర్చించారాయన. అందుకే ఇది కేవలం కాశ్మీర్ పర్యాటకులకు ఓ సవివరమైన యాత్రా మార్గదర్శి మాత్రమే కాదు - కాశ్మీర్ గురించి సమగ్రంగా అధ్యయనం చేయగోరెవారికి ఉపకరించే ఓ రిఫరెన్స్ గ్రంథం కూడా, తెనాలి రామకృష్ణ కవి, స్రమవీరులు, ఇలియడ్, కూరగాథలు, ఇంటింటి వైద్యం, దేవుడున్నాడా?, మా కేరళ యాత్ర వంటి విశ్లేషణాత్మక రచనలతో పాఠకులను మెప్పించిన రచయిత ప్రతిభకు ఈ పుస్తకం మరో తాజా సాక్ష్యం. - ప్రచురణ కర్తలు© 2017,www.logili.com All Rights Reserved.