'దక్షిణ భారత దేశపు స్వర్గం' గా పేరొందిన కేరళలో పర్యటించాలనుకేవారికీ, ఆ రాష్ట్రంలోని సుందరమైన పర్యాటక ప్రదేశాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలనుకునేవారికీ ఈ పుస్తకం ఒక అద్భుతమైన కరదీపిక. అక్కడి పర్వతాలు, జలపాతాలు, సరస్సులు, సముద్రతీరాలు, జంతు, పక్షి అభయారణ్యాలు, చెట్టుచేమలు - ఇలా ఒకటేమిటి? అరుదైన జీవ వైవిధ్యంతో కూడిన అక్కడి ప్రకృతి సౌందర్యం మొత్తాన్నీ మీ కాళ్ళముందు నిలుపుతోందీ పుస్తకం. ఇది చదివితే అక్కడి చారిత్రిక ప్రదేశాలు, ప్రార్థనా మందిరాలు, రాజప్రాసాదాలు, మ్యూజియంలు మొదలైనవన్నీ మీరే స్వయంగా తిరిగి చూసిన అనుభూతిని పొందుతారు.
మలయాళీల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలూ, ఆహారాలు, కులమతాలు, పండుగలు, కేరళాకే ప్రత్యేకమైన 'కథకళి' మొదలైన సంప్రదాయ నృత్యరీతులు, 'కళరి పయట్టు' వంటి యుద్ధ విద్యలు మొదలైన వాటిని లోతుగా పరిశీలించాలనుకునే వారికి ఇదో విలువైన ఆధార గ్రంథం. 'తెనాలి రామకృష్ణ కవి', 'శ్రమవీరులు', 'ఇలియడ్', 'కూరగాథలు', 'ఇంటింటి వైద్యం', 'దేవుడున్నాడా?' వంటి తన విశ్లేషణాత్మక రచనలతో పాఠకులను మెప్పించిన రచయితా ప్రతిభకు ఈ పుస్తకం తాజా సాక్ష్యం.
'దక్షిణ భారత దేశపు స్వర్గం' గా పేరొందిన కేరళలో పర్యటించాలనుకేవారికీ, ఆ రాష్ట్రంలోని సుందరమైన పర్యాటక ప్రదేశాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలనుకునేవారికీ ఈ పుస్తకం ఒక అద్భుతమైన కరదీపిక. అక్కడి పర్వతాలు, జలపాతాలు, సరస్సులు, సముద్రతీరాలు, జంతు, పక్షి అభయారణ్యాలు, చెట్టుచేమలు - ఇలా ఒకటేమిటి? అరుదైన జీవ వైవిధ్యంతో కూడిన అక్కడి ప్రకృతి సౌందర్యం మొత్తాన్నీ మీ కాళ్ళముందు నిలుపుతోందీ పుస్తకం. ఇది చదివితే అక్కడి చారిత్రిక ప్రదేశాలు, ప్రార్థనా మందిరాలు, రాజప్రాసాదాలు, మ్యూజియంలు మొదలైనవన్నీ మీరే స్వయంగా తిరిగి చూసిన అనుభూతిని పొందుతారు. మలయాళీల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలూ, ఆహారాలు, కులమతాలు, పండుగలు, కేరళాకే ప్రత్యేకమైన 'కథకళి' మొదలైన సంప్రదాయ నృత్యరీతులు, 'కళరి పయట్టు' వంటి యుద్ధ విద్యలు మొదలైన వాటిని లోతుగా పరిశీలించాలనుకునే వారికి ఇదో విలువైన ఆధార గ్రంథం. 'తెనాలి రామకృష్ణ కవి', 'శ్రమవీరులు', 'ఇలియడ్', 'కూరగాథలు', 'ఇంటింటి వైద్యం', 'దేవుడున్నాడా?' వంటి తన విశ్లేషణాత్మక రచనలతో పాఠకులను మెప్పించిన రచయితా ప్రతిభకు ఈ పుస్తకం తాజా సాక్ష్యం.© 2017,www.logili.com All Rights Reserved.