అనంత వైజ్ఞానిక ప్రపంచంలో అనునిత్యం వివిధ శాస్త్రాలలో ఎన్నెన్నో పరిశోధనలు జరుగుతూన్నాయి. కొత్తగా కనుగొన్న విషయాలు డిగ్రీస్థాయి: పి.జి. స్థాయి పుస్తకగ్రంధాలలో చేరుతూన్నా చాలా పరిశోధనలు 'ఆ పుస్తకాంశాలు' గా చోటు చేసుకోవడం లేదు. కొన్ని అంశాలు... ఉదాహరణకు 'బయోటెక్నాలజీ' వంటివి పైస్థాయి పాఠకగ్రంధాలకు ఎక్కుతూన్నా, అవి ఇతర వైజ్ఞానిక అంశాలతో ముడిపడి ఉండడంతో అవన్నీ విద్యార్ధులకు చేరుతూన్నాయా? అనేది తేలని ప్రశ్న.
ఇలా నూతన ఆవిష్కరణలు పైస్థాయిలో కొంతవరకు స్థానం సంపాయించడంతో, ఇంతకాలం డిగ్రీస్థాయి బోధనాంశాలుగా ఉన్న కొన్ని పాఠాలు ఇంటర్మీడియట్ లోనికి - ఇంటర్ పాఠాలు టెన్త్ క్లాసులోనికి బదిలీ అవుతూన్నాయి. ఎనిమిది - తొమ్మిది - పది తరగుతల విద్యార్ధులకు ఇవి అదనపు భారంగా పరిణమిస్తున్నాయి. కానీ, తప్పనిసరి పరిస్థితి ఇది. ఎందుకంటే - ఈ పోటి ప్రపంచంలో 'సైన్స్ లో కరెంట్ అఫైర్స్' సమాచార పత్రికల ద్వారా అందుబాటులోకీ వస్తూండడంతో విద్యార్ధికి అవి తెలుసుకోక తప్పని పరిస్థితి ఎదురవుతున్నది. ఈ నేపధ్యంలో పోటి పరిక్షలకు ఆధునిక సమాచారం సైన్సుకు సంబంధించి ఎంతో కొంత కోడికరించాలన్న చిరుసంకల్పమే ఈ పుస్తకానికి ప్రేరణ.
పోటి పరిక్షలలో జనరల్ సైన్స్ విభాగంలో వృక్ష, జంతుశాస్త్రాలతో పాటు వైద్యశాస్త్రం, వ్యవసాయశాస్త్రం గురించి కూడా అడుగుతుంటారు. ప్రశ్నలు తెలివితేటల కంటే అవగాహనను పరీక్షించేవిగా ఉంటాయి. సరళంగా, ప్రాధమిక స్థాయిలో ఉంటాయి. విషయాల సూక్ష్మస్థాయి పరిశీలనకు ప్రాధాన్యం ఇచ్చారు. అందువల్ల ముఖ్యమైన అంశాలపై సంపూర్ణ అవగాహన ఏర్పరుచుకోవడానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపకరిస్తుంది.
- మధురా శివపుత్ర
అనంత వైజ్ఞానిక ప్రపంచంలో అనునిత్యం వివిధ శాస్త్రాలలో ఎన్నెన్నో పరిశోధనలు జరుగుతూన్నాయి. కొత్తగా కనుగొన్న విషయాలు డిగ్రీస్థాయి: పి.జి. స్థాయి పుస్తకగ్రంధాలలో చేరుతూన్నా చాలా పరిశోధనలు 'ఆ పుస్తకాంశాలు' గా చోటు చేసుకోవడం లేదు. కొన్ని అంశాలు... ఉదాహరణకు 'బయోటెక్నాలజీ' వంటివి పైస్థాయి పాఠకగ్రంధాలకు ఎక్కుతూన్నా, అవి ఇతర వైజ్ఞానిక అంశాలతో ముడిపడి ఉండడంతో అవన్నీ విద్యార్ధులకు చేరుతూన్నాయా? అనేది తేలని ప్రశ్న. ఇలా నూతన ఆవిష్కరణలు పైస్థాయిలో కొంతవరకు స్థానం సంపాయించడంతో, ఇంతకాలం డిగ్రీస్థాయి బోధనాంశాలుగా ఉన్న కొన్ని పాఠాలు ఇంటర్మీడియట్ లోనికి - ఇంటర్ పాఠాలు టెన్త్ క్లాసులోనికి బదిలీ అవుతూన్నాయి. ఎనిమిది - తొమ్మిది - పది తరగుతల విద్యార్ధులకు ఇవి అదనపు భారంగా పరిణమిస్తున్నాయి. కానీ, తప్పనిసరి పరిస్థితి ఇది. ఎందుకంటే - ఈ పోటి ప్రపంచంలో 'సైన్స్ లో కరెంట్ అఫైర్స్' సమాచార పత్రికల ద్వారా అందుబాటులోకీ వస్తూండడంతో విద్యార్ధికి అవి తెలుసుకోక తప్పని పరిస్థితి ఎదురవుతున్నది. ఈ నేపధ్యంలో పోటి పరిక్షలకు ఆధునిక సమాచారం సైన్సుకు సంబంధించి ఎంతో కొంత కోడికరించాలన్న చిరుసంకల్పమే ఈ పుస్తకానికి ప్రేరణ. పోటి పరిక్షలలో జనరల్ సైన్స్ విభాగంలో వృక్ష, జంతుశాస్త్రాలతో పాటు వైద్యశాస్త్రం, వ్యవసాయశాస్త్రం గురించి కూడా అడుగుతుంటారు. ప్రశ్నలు తెలివితేటల కంటే అవగాహనను పరీక్షించేవిగా ఉంటాయి. సరళంగా, ప్రాధమిక స్థాయిలో ఉంటాయి. విషయాల సూక్ష్మస్థాయి పరిశీలనకు ప్రాధాన్యం ఇచ్చారు. అందువల్ల ముఖ్యమైన అంశాలపై సంపూర్ణ అవగాహన ఏర్పరుచుకోవడానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపకరిస్తుంది. - మధురా శివపుత్ర
© 2017,www.logili.com All Rights Reserved.