సందేశాత్మక ప్రయోగశీల సాంఘిక నాటకాల రచన ద్వారా అగ్రేసర స్థాయినందుకున్న నాటక రచయిత శ్రీ డి. విజయ భాస్కర్, ఈ ' మహాశున్యం' కావ్యం ద్వారా డా. దీర్ఘాశి విజయ భాస్కర్ గా కవితారంగం లోకి కదం మోపుతున్నాడు.
కావ్యం పేరు 'మహాశున్యం'. దీన్ని 'అనుభావ కావ్యం' అన్నారు డి.విజయ భాస్కర్. అనుభావమనేది అలంకారిక పదం. లాక్షణికులు విభావనుభవ సాత్త్విక వ్యభిచారిభావ సముచ్చయాన్ని పేర్కొన్నారు. ఈ కావ్యంలో ఎన్నెన్నో సాత్విక భావాలను కవితాత్మకంగా మలచి చూపాడు. మహాశున్యమంటే ఏమిటో చెబుతూ సృష్టికి
"ముకులితస్థితి
వికసిత గతి
రెండు బొమ్మబోరుసులు " అంటూ అగాధమైన విషయాన్ని మూడు పంక్తుల్లో ముడివేసి చెప్పారు ఈ రచయిత. ఈ సంపుటిలో కొన్ని పంక్తులు ఒక కావ్యం రాయడానికి కావలసిన కాల్పనికతను సంతరించుకున్నవి. మచ్చుకు -
"మట్టిలో మానవత్వముంది.
మనిషిలో మాత్రం
ఒట్టి మట్టి వుంది."
మరో కవితలో ఇలా అంటాడు విజయ భాస్కర్ -
"నీవు ధరించాల్సిన దుస్తులు
ఏ దిగంతాలకవతలో నేస్తున్నారు.
నగ్న అంతస్సుతో నడిచి వెళ్ళు".
వ్యాఖ్యానికి అంత సులభంగా అందని ప్రగాడతత్వనిహిత పంక్తులివి.
-డా.సి. నారాయణ రెడ్డి
సందేశాత్మక ప్రయోగశీల సాంఘిక నాటకాల రచన ద్వారా అగ్రేసర స్థాయినందుకున్న నాటక రచయిత శ్రీ డి. విజయ భాస్కర్, ఈ ' మహాశున్యం' కావ్యం ద్వారా డా. దీర్ఘాశి విజయ భాస్కర్ గా కవితారంగం లోకి కదం మోపుతున్నాడు. కావ్యం పేరు 'మహాశున్యం'. దీన్ని 'అనుభావ కావ్యం' అన్నారు డి.విజయ భాస్కర్. అనుభావమనేది అలంకారిక పదం. లాక్షణికులు విభావనుభవ సాత్త్విక వ్యభిచారిభావ సముచ్చయాన్ని పేర్కొన్నారు. ఈ కావ్యంలో ఎన్నెన్నో సాత్విక భావాలను కవితాత్మకంగా మలచి చూపాడు. మహాశున్యమంటే ఏమిటో చెబుతూ సృష్టికి "ముకులితస్థితి వికసిత గతి రెండు బొమ్మబోరుసులు " అంటూ అగాధమైన విషయాన్ని మూడు పంక్తుల్లో ముడివేసి చెప్పారు ఈ రచయిత. ఈ సంపుటిలో కొన్ని పంక్తులు ఒక కావ్యం రాయడానికి కావలసిన కాల్పనికతను సంతరించుకున్నవి. మచ్చుకు - "మట్టిలో మానవత్వముంది. మనిషిలో మాత్రం ఒట్టి మట్టి వుంది." మరో కవితలో ఇలా అంటాడు విజయ భాస్కర్ - "నీవు ధరించాల్సిన దుస్తులు ఏ దిగంతాలకవతలో నేస్తున్నారు. నగ్న అంతస్సుతో నడిచి వెళ్ళు". వ్యాఖ్యానికి అంత సులభంగా అందని ప్రగాడతత్వనిహిత పంక్తులివి. -డా.సి. నారాయణ రెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.