ఈ నవలలో కథానాయకుడి భార్య ఒక రోడ్డు ప్రమాదంలో ఏడేళ్ళు కిందట మరణిస్తుంది. అప్పటికి అతని కూతురు ప్రియ వయస్సు అయిదేళ్ళు. ఈ నవల ఆరంభమయ్యే కాలానికి ఆమెకు పన్నెండేళ్ళు. ఆమె ఒక రోజు పుష్పవతి అవుతుంది. ఆ ఘట్టం తండ్రిని తీవ్రంగా వణికింప చేస్తుంది. అప్పటికే ప్రియ అచ్చు కావేరిలా ఉంటుంది. కావేరి చనిపోయాక అతను పెళ్లి చేసుకోడు. కావేరికి సంబంధించిన జ్ఞాపకాల్లో బతుకుతుంటాడు. కానీ మైథునవాంఛ మనిషిని నిమిషం నిలవనియదు. విశృంఖలమైన ఆలోచనలు వస్తుంటాయి. ప్రియలో కావేరి పోలికలు అతణ్ణి కలవరపెడతాయి. విస్మయపరుస్తాయి. తనకు తెలియకుండానే ఆమెపై వాంఛలు కలుగుతాయి. తన ఆలోచనల తీరుకు తానే విస్తుపోతాడు. చలించిపోతాడు. తననుంచి తన కూతుర్ని రక్షించుకోవాలనే తపన అతణ్ణి మేలి పెడుతుంది. తన జీవితానికి తోడు ఉంటేనే గాని ఈ ఆలోచనల్ని నిలువరించుకోలేననుకుంటాడు. చివరకు తాను లోలోపలే ఎప్పడ్నుంచో ప్రేమిస్తున్న ప్రియ టీచర్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆమె ఆమోదం కోసం ఫోన్ చేస్తే "ఇన్నేళ్ళు పట్టిందా మీకు ఆ విషయం చెప్పడానికి" అంటుందామె. ఈ విధంగా నవల సుఖాంతమవుతుంది.
ఈ నవలలో ఇతివృత్తం ఇదే అంటే మిగతా అనేకానేక అంశాలకు అన్యాయం చేసినట్టవుతుంది. ఇది ప్రధానంగా కనిపిచే అంశం అయినా వర్తమాన రాజకీయ, సాహిత్య, సామజిక జీవితం తాలూకు కోణాలెన్నో ఈ నవలలో విస్తృతంగా చిత్రితమయ్యాయి.
-కాశీభట్ల వేణుగోపాల్.
ఈ నవలలో కథానాయకుడి భార్య ఒక రోడ్డు ప్రమాదంలో ఏడేళ్ళు కిందట మరణిస్తుంది. అప్పటికి అతని కూతురు ప్రియ వయస్సు అయిదేళ్ళు. ఈ నవల ఆరంభమయ్యే కాలానికి ఆమెకు పన్నెండేళ్ళు. ఆమె ఒక రోజు పుష్పవతి అవుతుంది. ఆ ఘట్టం తండ్రిని తీవ్రంగా వణికింప చేస్తుంది. అప్పటికే ప్రియ అచ్చు కావేరిలా ఉంటుంది. కావేరి చనిపోయాక అతను పెళ్లి చేసుకోడు. కావేరికి సంబంధించిన జ్ఞాపకాల్లో బతుకుతుంటాడు. కానీ మైథునవాంఛ మనిషిని నిమిషం నిలవనియదు. విశృంఖలమైన ఆలోచనలు వస్తుంటాయి. ప్రియలో కావేరి పోలికలు అతణ్ణి కలవరపెడతాయి. విస్మయపరుస్తాయి. తనకు తెలియకుండానే ఆమెపై వాంఛలు కలుగుతాయి. తన ఆలోచనల తీరుకు తానే విస్తుపోతాడు. చలించిపోతాడు. తననుంచి తన కూతుర్ని రక్షించుకోవాలనే తపన అతణ్ణి మేలి పెడుతుంది. తన జీవితానికి తోడు ఉంటేనే గాని ఈ ఆలోచనల్ని నిలువరించుకోలేననుకుంటాడు. చివరకు తాను లోలోపలే ఎప్పడ్నుంచో ప్రేమిస్తున్న ప్రియ టీచర్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆమె ఆమోదం కోసం ఫోన్ చేస్తే "ఇన్నేళ్ళు పట్టిందా మీకు ఆ విషయం చెప్పడానికి" అంటుందామె. ఈ విధంగా నవల సుఖాంతమవుతుంది. ఈ నవలలో ఇతివృత్తం ఇదే అంటే మిగతా అనేకానేక అంశాలకు అన్యాయం చేసినట్టవుతుంది. ఇది ప్రధానంగా కనిపిచే అంశం అయినా వర్తమాన రాజకీయ, సాహిత్య, సామజిక జీవితం తాలూకు కోణాలెన్నో ఈ నవలలో విస్తృతంగా చిత్రితమయ్యాయి. -కాశీభట్ల వేణుగోపాల్.© 2017,www.logili.com All Rights Reserved.