ఉప, ని అనే విసర్గంతో కూడి ఉపనిషద్ అనే శబ్దం ఏర్పడుతుంది. పరమతత్త్వమునకు సమీపమున చేరికూర్చొనునట్టి జ్ఞానమును సమకూర్చునది ఉపనిషత్తు. ఉపనిషత్తులే వేదాంతంగా పిలువబడుతున్నాయి. ఉపనిషత్తులు వేదభాగాలే. భారతీయసంస్కృతీ సంప్రదాయాలకు, ధార్మిక సిద్ధాంతాలకు భారతీయ తత్త్వజ్ఞానములకు మూలము ఉపనిషద్విజ్ఞానము. ప్రస్థాన త్రయంలో మొదటివి ఉపనిషత్తులే. వందలకొలది ఉన్న ఉపనిషత్తులలో
ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండ, మాండూక్య, తిత్తిరి, ఐతరేయం, చ, ఛాందోగ్యం, బృహదారణ్యం, దశ అనేవి ప్రసిద్ధమైన పది ఉపనిషత్తులు.
మాండూక్యోపనిషత్తు కేవలం 12వాక్యాలలోనే ఉన్న పరిమాణంలో చిన్నదైన ఉపనిషత్తు అయినా ఇది అతి ప్రాచీనమైన ఉపనిషత్తులలో ఒకటి. నాలుగు పాదాలుగా విభజించబడి ఉండే మాండూక్యోపనిషత్తు ఓంకారపరంగా బ్రహ్మతత్త్వాన్ని ఉపదేశిస్తుంది. శంకరాచార్యుని అద్వైత వేదాంతానికి ఇది మూలమని ప్రసిద్ధి.
మాండూక్యోపనిషత్తు మానవ జీవితంలో అనుభవానికి వచ్చే తాపము(Tension)లు అయిన ఆధిభౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మికల, నివారణలను సూచించడమే గాక, అర్వాచీన విదేశ శాస్త్రవేత్త ఫ్రాయిడ్ సిద్ధాంతంలో గల మనసు నాలుగు విధాలైన అవస్థలను పొందుతుందనే సిద్దాంత మౌలిక సూత్రం ఈ ఉపనిషత్తులో ఉన్నది.
ఆదిశంకరుల గురువైన గౌడపాదాచార్యుల వ్యాఖ్యాన వెలుగులో కూర్చబడి, ఆస్తికులందరికి విజ్ఞానదాయకం. పరతత్త్వ అన్వేషకులకు కరదీపిక అయినది ఈ గ్రంథం. దీనిని అందరూ ఆదరించాలని మా అభిలాష.
- ఆకెళ్ళ పార్వతి
ఉప, ని అనే విసర్గంతో కూడి ఉపనిషద్ అనే శబ్దం ఏర్పడుతుంది. పరమతత్త్వమునకు సమీపమున చేరికూర్చొనునట్టి జ్ఞానమును సమకూర్చునది ఉపనిషత్తు. ఉపనిషత్తులే వేదాంతంగా పిలువబడుతున్నాయి. ఉపనిషత్తులు వేదభాగాలే. భారతీయసంస్కృతీ సంప్రదాయాలకు, ధార్మిక సిద్ధాంతాలకు భారతీయ తత్త్వజ్ఞానములకు మూలము ఉపనిషద్విజ్ఞానము. ప్రస్థాన త్రయంలో మొదటివి ఉపనిషత్తులే. వందలకొలది ఉన్న ఉపనిషత్తులలో ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండ, మాండూక్య, తిత్తిరి, ఐతరేయం, చ, ఛాందోగ్యం, బృహదారణ్యం, దశ అనేవి ప్రసిద్ధమైన పది ఉపనిషత్తులు. మాండూక్యోపనిషత్తు కేవలం 12వాక్యాలలోనే ఉన్న పరిమాణంలో చిన్నదైన ఉపనిషత్తు అయినా ఇది అతి ప్రాచీనమైన ఉపనిషత్తులలో ఒకటి. నాలుగు పాదాలుగా విభజించబడి ఉండే మాండూక్యోపనిషత్తు ఓంకారపరంగా బ్రహ్మతత్త్వాన్ని ఉపదేశిస్తుంది. శంకరాచార్యుని అద్వైత వేదాంతానికి ఇది మూలమని ప్రసిద్ధి. మాండూక్యోపనిషత్తు మానవ జీవితంలో అనుభవానికి వచ్చే తాపము(Tension)లు అయిన ఆధిభౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మికల, నివారణలను సూచించడమే గాక, అర్వాచీన విదేశ శాస్త్రవేత్త ఫ్రాయిడ్ సిద్ధాంతంలో గల మనసు నాలుగు విధాలైన అవస్థలను పొందుతుందనే సిద్దాంత మౌలిక సూత్రం ఈ ఉపనిషత్తులో ఉన్నది. ఆదిశంకరుల గురువైన గౌడపాదాచార్యుల వ్యాఖ్యాన వెలుగులో కూర్చబడి, ఆస్తికులందరికి విజ్ఞానదాయకం. పరతత్త్వ అన్వేషకులకు కరదీపిక అయినది ఈ గ్రంథం. దీనిని అందరూ ఆదరించాలని మా అభిలాష. - ఆకెళ్ళ పార్వతి
© 2017,www.logili.com All Rights Reserved.