కాళిదాసు కవితా ప్రజ్ఞకు - చదువుల సతి విద్యావతి ఉపజ్ఞకు సముచిత సారస్వత హారతి 'అభిజ్ఞ'.
ఇది "కవి కుల గురువు " మహాకవి కాళిదాసు కథ. కాళిగాడు కాళిదాసుగా పరివర్తన పొందిన తీరు హృధ్యంగా మలచబడింది. కాళిదాసువిగా పేర్కొనబడే అద్భుతమైన చమత్కార చాటు శ్లోకాలు ఈ ఆపాత రమణీయ రచనకు అదనపు సొబగులు అద్డాయి. తనను కామించి భంగపడ్డ రాజగురువూ, తన కొడుక్కి తనను చేసుకొని తద్వారా రాజ్యానికే ఎసరుపెట్టే యత్నంలో విఫలుడైన మహామంత్రి కుట్ర పన్ని విద్వాంసుణ్ణి వరించాలని ఆశపడ్డ తనకు విద్వాంసుడనే పేర ఒక మూర్ఖుణ్ణి కట్టబెట్టడం - ఆ రాతి ముక్కను తన శేముషీ విభవంతో రత్నంగా తీర్చిదిద్దుకొన్న విద్యావతి పాత్ర ఎంతో అద్భుతంగా మలచబడింది. తనను విద్వాంసుణ్ణి చేసి మహా కవిగా రూపొందేందుకు కృషి చేసిన ఆ రాకుమారి తన కండ్లకు జగన్మాత పరాశక్తిగా కనబడగా ఆమెను భార్యగా చూడ్డం ఇష్టంలేక భర్త దేశాంతర గతుడై భోజుడి ఆస్థానాన్ని అలంకరించి ఋతు సంహారం, కుమార సంభవం లాంటి మహా కావ్యాలు పుంఖాను పుంఖంగా వెలువరిస్తూ ఉంటే ఎలాగైనా భర్తను చేరుకునే నిమిత్తం పురుష వేషంలో ధారానగరం చేరి వ్యాపారిగా అవతారం ఎత్తి, అతడి దృష్టిలో పడి ఆకర్షించి చివరకు అతణ్ణి పదుగురి సమక్షంలో తన వాడిగా చేసుకొన్నా విద్యావతి శేముషీ వైభవం అపూర్వం.
చక్కని ఈ వచన కావ్యం కాళిదాసు కవితా ప్రజ్ఞకు, చదువుల తల్లి విద్యావతి ఉపజ్ఞకు ఎత్తిన సముచిత సారస్వత హారతి. చదువుతున్నంత సేపూ హాయిగా ఉన్నది. ఈ చక్కటి చిక్కటి రచన ప్రాశ౦సార్హం.
- కె.య౦.ఎల్.ఎన్. మూర్తి
కాళిదాసు కవితా ప్రజ్ఞకు - చదువుల సతి విద్యావతి ఉపజ్ఞకు సముచిత సారస్వత హారతి 'అభిజ్ఞ'. ఇది "కవి కుల గురువు " మహాకవి కాళిదాసు కథ. కాళిగాడు కాళిదాసుగా పరివర్తన పొందిన తీరు హృధ్యంగా మలచబడింది. కాళిదాసువిగా పేర్కొనబడే అద్భుతమైన చమత్కార చాటు శ్లోకాలు ఈ ఆపాత రమణీయ రచనకు అదనపు సొబగులు అద్డాయి. తనను కామించి భంగపడ్డ రాజగురువూ, తన కొడుక్కి తనను చేసుకొని తద్వారా రాజ్యానికే ఎసరుపెట్టే యత్నంలో విఫలుడైన మహామంత్రి కుట్ర పన్ని విద్వాంసుణ్ణి వరించాలని ఆశపడ్డ తనకు విద్వాంసుడనే పేర ఒక మూర్ఖుణ్ణి కట్టబెట్టడం - ఆ రాతి ముక్కను తన శేముషీ విభవంతో రత్నంగా తీర్చిదిద్దుకొన్న విద్యావతి పాత్ర ఎంతో అద్భుతంగా మలచబడింది. తనను విద్వాంసుణ్ణి చేసి మహా కవిగా రూపొందేందుకు కృషి చేసిన ఆ రాకుమారి తన కండ్లకు జగన్మాత పరాశక్తిగా కనబడగా ఆమెను భార్యగా చూడ్డం ఇష్టంలేక భర్త దేశాంతర గతుడై భోజుడి ఆస్థానాన్ని అలంకరించి ఋతు సంహారం, కుమార సంభవం లాంటి మహా కావ్యాలు పుంఖాను పుంఖంగా వెలువరిస్తూ ఉంటే ఎలాగైనా భర్తను చేరుకునే నిమిత్తం పురుష వేషంలో ధారానగరం చేరి వ్యాపారిగా అవతారం ఎత్తి, అతడి దృష్టిలో పడి ఆకర్షించి చివరకు అతణ్ణి పదుగురి సమక్షంలో తన వాడిగా చేసుకొన్నా విద్యావతి శేముషీ వైభవం అపూర్వం. చక్కని ఈ వచన కావ్యం కాళిదాసు కవితా ప్రజ్ఞకు, చదువుల తల్లి విద్యావతి ఉపజ్ఞకు ఎత్తిన సముచిత సారస్వత హారతి. చదువుతున్నంత సేపూ హాయిగా ఉన్నది. ఈ చక్కటి చిక్కటి రచన ప్రాశ౦సార్హం. - కె.య౦.ఎల్.ఎన్. మూర్తి© 2017,www.logili.com All Rights Reserved.