నేటి మానవుడు పరమాణువులను చేధించాడు. అంతరిక్షయానానికి ఆయుత్తమౌతున్నాడు. వ్యక్తీకి సమాజానికి గల వైరుధ్యాలను పరిష్కరించే సోషలిస్టు యుగంలో నేడు మనం జీవిస్తున్నాం.
వికసిస్తున్న జ్ఞానాని కనుగుణ్యంగా తన ఆలోచనలను మార్చుకోవటం మానవ స్వభావం. ఈ దృష్ట్యా జరిగినపుడు గతితార్కిక భౌతికవాద జ్ఞానసిద్దాంతం - అత్యంత శాస్త్రీయమైన దృష్టి అని బోధపడగలదు. ఆ సిద్ధాంతాన్ని వివరించటమే ఈ గ్రంధ లక్ష్యం.
మారిస్ కారన్ ఫోర్త్ అను ప్రఖ్యాత బ్రిటిష్ రచయిత వ్రాసిన గ్రంధానికిది అనుసరణ. వీలైన సందర్భాలన్నిటా భారతీయ తత్వశాస్త్రం నుండి ఉదాహరణ లివ్వటంద్వారా గ్రంధాన్ని సులభగ్రాహ్యం చేయటానికి కృషి జరిగింది.
గతితార్కిక భౌతికవాద దృష్టి ఆంధ్రలో గణనీయమైన స్థానాన్ని సంపాదించుకున్నది. మేధావులు, విద్యావంతులు, ప్రగతిశీలురు మరింతగా ఈ దృష్టివైపు ఆకర్షింపబడుతున్నారు. ఇదొక సహజమైన, వాంఛనీయమైన, అవసరమైన సాంస్కృతిక పరిణామం. ఈ పరిణామానికి శక్తికొలది దోహదం చేయాలనే ఆకాంక్షే మా ఈ ప్రయత్నానికి కారణం.
నేటి మానవుడు పరమాణువులను చేధించాడు. అంతరిక్షయానానికి ఆయుత్తమౌతున్నాడు. వ్యక్తీకి సమాజానికి గల వైరుధ్యాలను పరిష్కరించే సోషలిస్టు యుగంలో నేడు మనం జీవిస్తున్నాం. వికసిస్తున్న జ్ఞానాని కనుగుణ్యంగా తన ఆలోచనలను మార్చుకోవటం మానవ స్వభావం. ఈ దృష్ట్యా జరిగినపుడు గతితార్కిక భౌతికవాద జ్ఞానసిద్దాంతం - అత్యంత శాస్త్రీయమైన దృష్టి అని బోధపడగలదు. ఆ సిద్ధాంతాన్ని వివరించటమే ఈ గ్రంధ లక్ష్యం. మారిస్ కారన్ ఫోర్త్ అను ప్రఖ్యాత బ్రిటిష్ రచయిత వ్రాసిన గ్రంధానికిది అనుసరణ. వీలైన సందర్భాలన్నిటా భారతీయ తత్వశాస్త్రం నుండి ఉదాహరణ లివ్వటంద్వారా గ్రంధాన్ని సులభగ్రాహ్యం చేయటానికి కృషి జరిగింది. గతితార్కిక భౌతికవాద దృష్టి ఆంధ్రలో గణనీయమైన స్థానాన్ని సంపాదించుకున్నది. మేధావులు, విద్యావంతులు, ప్రగతిశీలురు మరింతగా ఈ దృష్టివైపు ఆకర్షింపబడుతున్నారు. ఇదొక సహజమైన, వాంఛనీయమైన, అవసరమైన సాంస్కృతిక పరిణామం. ఈ పరిణామానికి శక్తికొలది దోహదం చేయాలనే ఆకాంక్షే మా ఈ ప్రయత్నానికి కారణం.
© 2017,www.logili.com All Rights Reserved.