జ్యోతిశ్శాస్త్రము త్రిస్కంధాత్మకమైయున్నది. సిద్ధాంత, సంహిత, హోరా నామక స్కంద త్రయములందు జ్యోతిశ్శాస్త్ర సంబంధిత సర్వవిషయములు నిక్షిప్తమైయున్నవి. జ్యోతిశ్శాస్త్ర సంబంధిత సర్వవిషయములలో ఏదైనా ఒక విషయము స్కందత్రయము లలో ఏదైనా ఒకస్కందముతో మాత్రమే ప్రత్యేక సంబంధము కలిగి యుండునుగాని ప్రశ్నశాస్త్రము అట్లుగాక సిద్ధాంత, సంహిత, మరియు హోరాయను మూడు స్కందములతో కూడా సంక్లిష్టమై అనగా సంబంధము కలిగియున్నది. అందువలన జ్యోతిశ్శాస్త్రము యొక్క ఆవిర్భావమే ప్రశ్నలకు సమాధానాత్మకమై యున్నదని భావించవలసి యున్నది. పృచ్ఛకులయొక్క ప్రశ్నలకు వివరణాత్మక వ్యాఖ్యానముతో కూడిన సమాధానమును స్పష్టముగా నిచ్చుకారణముచే జ్యోతిష్యునికి సమాజములో ఎల్లప్పుడూ గౌరవాదరణలతో కూడిన సముచిత స్థానము లభించుచున్నది. జ్యోతిశ్శాస్త్రము కాత్రయములనెడి భూత భవిష్యద్వర్తమాన కాలములయొక్క మహావిజ్ఞానమునకు తన గర్భమందు ఆశ్రయమిచ్చి యుగయుగముల నుండి మానవ సమాజమందు గల సమస్తవర్గముల వారికి మార్గదర్శకమై మరియు కళ్యాణకారకమై అలరారుచున్నది.
తపోబల సంపన్నులైన దైవజ్ఞుల ద్వారా తమయొక్క భవిష్యత్తును సంపూర్ణ రూపములో తెలియవలెనను కోరిక - త్యాగమయ జీవనము గడుపువారు, అపరి గ్రాహులు, సాధువులు, సన్యాసులయొక్క మనస్సులందే బలీయముగా నుండే సందర్భ ములో ఇక సామాన్య గృహస్థులగూర్చి చెప్పవలసిన దేమున్నది? కావుననే యీ విధముగా చెప్పియున్నారు.
శ్లో॥ ఏకాసనస్థా జలవాయుభక్షా ముముక్షవస్త్యక్త పరిగ్రహాశ్చ।
పృచ్ఛన్తితే ప్యమ్బరచారిచారం దైవజ్ఞ మన్యేకిముతార్థచిన్తాః ॥ జ్యోతిషశాస్త్రము అత్యంత కఠినము మరియు అతి దురవగాహము గలదగుటయేకాక పలుచోట్ల యిది అస్పష్టముగానూయున్నది. వీటన్నింటినీ స్పష్టముగా సరిచేయుట కొరకు యీ శాస్త్రమునకు సంబంధించిన ప్రాచీన పాండులిపులను అన్వేషణచేసి వానిని సమగ్రముగా పరిశీలించిన పిదప స్పష్టమైన టీకా తాత్పర్యములతో ప్రాంతీయ భాషలందు ప్రచురించి విస్తృత లోకవ్యాప్తి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా గలదు. కాని ఎప్పుడైతే మూల పాఠము (మూలగ్రంథము) శుద్ధమైయుండునో అప్పుడే ఆయా గ్రంథము యొక్క టీకా తాత్పర్య సహిత వ్యాఖ్యానము కూడా ప్రామాణికమై యుండును.
మూల గ్రంథము యొక్క శుద్ధత్వము కొరకు ఆయా గ్రంథ సంబంధిత అనేకానేక | పాండులిపులు అత్యంతావశ్యకమై యుండును. అట్లే ఉత్త విషయ సంబంధితమై...............................
ప్రశ్నజ్ఞాన ప్రదీపః భూమిక జ్యోతిశ్శాస్త్రము త్రిస్కంధాత్మకమైయున్నది. సిద్ధాంత, సంహిత, హోరా నామక స్కంద త్రయములందు జ్యోతిశ్శాస్త్ర సంబంధిత సర్వవిషయములు నిక్షిప్తమైయున్నవి. జ్యోతిశ్శాస్త్ర సంబంధిత సర్వవిషయములలో ఏదైనా ఒక విషయము స్కందత్రయము లలో ఏదైనా ఒకస్కందముతో మాత్రమే ప్రత్యేక సంబంధము కలిగి యుండునుగాని ప్రశ్నశాస్త్రము అట్లుగాక సిద్ధాంత, సంహిత, మరియు హోరాయను మూడు స్కందములతో కూడా సంక్లిష్టమై అనగా సంబంధము కలిగియున్నది. అందువలన జ్యోతిశ్శాస్త్రము యొక్క ఆవిర్భావమే ప్రశ్నలకు సమాధానాత్మకమై యున్నదని భావించవలసి యున్నది. పృచ్ఛకులయొక్క ప్రశ్నలకు వివరణాత్మక వ్యాఖ్యానముతో కూడిన సమాధానమును స్పష్టముగా నిచ్చుకారణముచే జ్యోతిష్యునికి సమాజములో ఎల్లప్పుడూ గౌరవాదరణలతో కూడిన సముచిత స్థానము లభించుచున్నది. జ్యోతిశ్శాస్త్రము కాత్రయములనెడి భూత భవిష్యద్వర్తమాన కాలములయొక్క మహావిజ్ఞానమునకు తన గర్భమందు ఆశ్రయమిచ్చి యుగయుగముల నుండి మానవ సమాజమందు గల సమస్తవర్గముల వారికి మార్గదర్శకమై మరియు కళ్యాణకారకమై అలరారుచున్నది. తపోబల సంపన్నులైన దైవజ్ఞుల ద్వారా తమయొక్క భవిష్యత్తును సంపూర్ణ రూపములో తెలియవలెనను కోరిక - త్యాగమయ జీవనము గడుపువారు, అపరి గ్రాహులు, సాధువులు, సన్యాసులయొక్క మనస్సులందే బలీయముగా నుండే సందర్భ ములో ఇక సామాన్య గృహస్థులగూర్చి చెప్పవలసిన దేమున్నది? కావుననే యీ విధముగా చెప్పియున్నారు. శ్లో॥ ఏకాసనస్థా జలవాయుభక్షా ముముక్షవస్త్యక్త పరిగ్రహాశ్చ। పృచ్ఛన్తితే ప్యమ్బరచారిచారం దైవజ్ఞ మన్యేకిముతార్థచిన్తాః ॥ జ్యోతిషశాస్త్రము అత్యంత కఠినము మరియు అతి దురవగాహము గలదగుటయేకాక పలుచోట్ల యిది అస్పష్టముగానూయున్నది. వీటన్నింటినీ స్పష్టముగా సరిచేయుట కొరకు యీ శాస్త్రమునకు సంబంధించిన ప్రాచీన పాండులిపులను అన్వేషణచేసి వానిని సమగ్రముగా పరిశీలించిన పిదప స్పష్టమైన టీకా తాత్పర్యములతో ప్రాంతీయ భాషలందు ప్రచురించి విస్తృత లోకవ్యాప్తి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా గలదు. కాని ఎప్పుడైతే మూల పాఠము (మూలగ్రంథము) శుద్ధమైయుండునో అప్పుడే ఆయా గ్రంథము యొక్క టీకా తాత్పర్య సహిత వ్యాఖ్యానము కూడా ప్రామాణికమై యుండును. మూల గ్రంథము యొక్క శుద్ధత్వము కొరకు ఆయా గ్రంథ సంబంధిత అనేకానేక | పాండులిపులు అత్యంతావశ్యకమై యుండును. అట్లే ఉత్త విషయ సంబంధితమై...............................© 2017,www.logili.com All Rights Reserved.