మొండెపు ప్రసాద్ పూర్తి పేరు M.S.V.M.Prasad:IRS. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కి చెందిన ప్రసాద్ ప్రస్తుతం అడిషనల్ కమీషనర్ ఆఫ్ ఇన్ కంటాక్స్ గా ఉద్యోగం చేస్తున్నారు. 'మొండెపు ప్రసాద్' అనే కలం పేరుతో సామాజిక వాస్తవికత ఆధారంగా, సామాజిక ప్రయోజనం ధ్యేయంగా రచనలు చేస్తారు. ప్రసాద్ రచించిన మొదటి నవల "ఎనిమిదో అడుగు" స్వాతి వార పత్రికలో సీరియల్ గా ప్రచురించబడింది. రెండవ నవల "అత్యాచారాలపై అక్షరపోరాటం" స్వాతి మాస పత్రికలో ప్రచురించబడింది. "అమ్మ(కధలు, వ్యాసాలు, సామెతలు, సూక్తులు)" పుస్తకంలో అమ్మదనంలోని కమ్మదనాన్ని, అమ్మ ప్రేమలోని వివిధ పార్శ్వాలను ఆర్ద్రంగా తెలియచేశారు.
ప్రసాద్ రాసిన కధలు ఆంధ్రభూమి వార పత్రిక, ఆంధ్రభూమి మాస పత్రిక, నవ్య వార పత్రిక, విపుల, ఈనాడు ఆదివారం అనుబంధం, జాగ్రతిలలో ప్రచురించబడ్డాయి. అలా వివిధ పత్రికలలో ప్రచురించబడిన పద్నాలుగు కధల సంకలనం "ఆలోచింపచేసే కధలు" గా ప్రచురించబడింది. ఈ కధలలో స్వాతి మాస పత్రిక అనిల్ అవార్డ్ 2011పొందిన "అమ్మాయి పెళ్లి" కూడా వుంది.
- మొండెపు ప్రసాద్
"శతకాలలో స్త్రీలపట్ల వివక్ష" అనే ఈ పుస్తకంలో నీతిశతకాలుగా అత్యంత ప్రజాదరణ పొందిన భాస్కరశతకం, కుమారీశతకం, సుమతీశతకం, వేమనశతకం వంటి శతకాలలో నాటి సామాజిక సమస్యలను, దురాచారాలను ఖండిస్తూ వ్రాసిన పద్యాలు మాత్రమే కాక, స్త్రీల స్వేచ్ఛను నియంత్రిస్తూ, స్త్రీల ప్రవర్తనపై అనేక ఆంక్షలు విధిస్తూ వ్రాసిన పద్యాలు కూడా వున్నాయని వివరించడం జరిగింది.స్త్రీల గురించి ఈ శతకాలలో వ్రాసిన పద్యాలను నిశితంగా పరిశీలిస్తే స్త్రీల విషయంలో పురాణాలలో, రామాయణంలో, మహాభారతంలో, మనుస్మృతిలో కౌటిల్యుని అర్ధశాస్త్రంలో చెప్పబడి, అప్పటికే సమాజంలో బలంగా నాటుకొనివున్న భావాలనే (ఆ భావాలు మంచివైనా, చెడ్డవైనా) సమర్ధిస్తూ పద్యాలను రాసారని రచయిత ప్రసాద్ ఉదాహరణలతో వివరించారు.
- మొండెపు ప్రసాద్
మొండెపు ప్రసాద్ పూర్తి పేరు M.S.V.M.Prasad:IRS. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కి చెందిన ప్రసాద్ ప్రస్తుతం అడిషనల్ కమీషనర్ ఆఫ్ ఇన్ కంటాక్స్ గా ఉద్యోగం చేస్తున్నారు. 'మొండెపు ప్రసాద్' అనే కలం పేరుతో సామాజిక వాస్తవికత ఆధారంగా, సామాజిక ప్రయోజనం ధ్యేయంగా రచనలు చేస్తారు. ప్రసాద్ రచించిన మొదటి నవల "ఎనిమిదో అడుగు" స్వాతి వార పత్రికలో సీరియల్ గా ప్రచురించబడింది. రెండవ నవల "అత్యాచారాలపై అక్షరపోరాటం" స్వాతి మాస పత్రికలో ప్రచురించబడింది. "అమ్మ(కధలు, వ్యాసాలు, సామెతలు, సూక్తులు)" పుస్తకంలో అమ్మదనంలోని కమ్మదనాన్ని, అమ్మ ప్రేమలోని వివిధ పార్శ్వాలను ఆర్ద్రంగా తెలియచేశారు. ప్రసాద్ రాసిన కధలు ఆంధ్రభూమి వార పత్రిక, ఆంధ్రభూమి మాస పత్రిక, నవ్య వార పత్రిక, విపుల, ఈనాడు ఆదివారం అనుబంధం, జాగ్రతిలలో ప్రచురించబడ్డాయి. అలా వివిధ పత్రికలలో ప్రచురించబడిన పద్నాలుగు కధల సంకలనం "ఆలోచింపచేసే కధలు" గా ప్రచురించబడింది. ఈ కధలలో స్వాతి మాస పత్రిక అనిల్ అవార్డ్ 2011పొందిన "అమ్మాయి పెళ్లి" కూడా వుంది. - మొండెపు ప్రసాద్ "శతకాలలో స్త్రీలపట్ల వివక్ష" అనే ఈ పుస్తకంలో నీతిశతకాలుగా అత్యంత ప్రజాదరణ పొందిన భాస్కరశతకం, కుమారీశతకం, సుమతీశతకం, వేమనశతకం వంటి శతకాలలో నాటి సామాజిక సమస్యలను, దురాచారాలను ఖండిస్తూ వ్రాసిన పద్యాలు మాత్రమే కాక, స్త్రీల స్వేచ్ఛను నియంత్రిస్తూ, స్త్రీల ప్రవర్తనపై అనేక ఆంక్షలు విధిస్తూ వ్రాసిన పద్యాలు కూడా వున్నాయని వివరించడం జరిగింది.స్త్రీల గురించి ఈ శతకాలలో వ్రాసిన పద్యాలను నిశితంగా పరిశీలిస్తే స్త్రీల విషయంలో పురాణాలలో, రామాయణంలో, మహాభారతంలో, మనుస్మృతిలో కౌటిల్యుని అర్ధశాస్త్రంలో చెప్పబడి, అప్పటికే సమాజంలో బలంగా నాటుకొనివున్న భావాలనే (ఆ భావాలు మంచివైనా, చెడ్డవైనా) సమర్ధిస్తూ పద్యాలను రాసారని రచయిత ప్రసాద్ ఉదాహరణలతో వివరించారు. - మొండెపు ప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.