'మృత్యులోయ 'నవల 1971-74 మధ్యలో 'బొమ్మరిల్లు 'మాసపత్రికలో ధారావాహికంగా వచ్చింది.పుట్టిన ప్రతి మనిషికీ మృత్యువు లలాటలిఖితం. మృత్యువు మకుటమైన ఈ కథ లలాట దేశంలో ఆరంభమౌతుంది.రాజు యశోవతుండు,రాజు కొడుకు యశపాలుడు.మంత్రి జయవర్మ,మంత్రి కొడుకు జయకేతుడు.యుద్ధవిద్యలలో ఆరితేరిన 'ఆ యిద్ధరు యువకులూ తమ తండ్రులు పొరుగు రాజ్యాల మీదికి యుద్ధానికి పోతే ఎంత బావుండును -అని కలలు కనేవాళ్లూ.అందాకా అడవికి వెళ్లి ఆ తమకాన్ని వేటలో తీర్చుకునేవారు.అలా వెళ్లి ఓసారి ప్రమాదానికి గురై మృత్యులోయలో పడ్డారు.అక్కడ భయంకర పక్షులు,జంతువులు,సర్పాలు తటస్థపడ్డాయి.రాక్షసులు,మాంత్రికులు ఎదురయ్యారు.వివిధ తెగల మనుషులు, వారితో పోటీపడే నరవానరాలు,ఇంకా నరవ్యాఘ్రం వంటి విచిత్ర జీవాలతో-వ్యవహరించాల్సి వచ్చింది.ఇద్దరు ముగ్గురికి మినహా ఆ లోయలో మరెవ్వరికీ వేరే ప్రపంచం తెలియకపోవడంవల్ల -ఆ మృత్యులోయ యశ,జయలకి మరో ప్రపంచం.నవల చదువుతున్నతసేపూ పాఠకులూ ఆ మరో ప్రపంచంలో విహరిస్తారు. యశ,జయులు అడుగడుగునా ప్రమాదాలను ఎదుర్కుంటూ-దుష్టశిక్షణ,శిష్టరక్షణ చేయడం కథాంశం.
'మృత్యులోయ 'నవల 1971-74 మధ్యలో 'బొమ్మరిల్లు 'మాసపత్రికలో ధారావాహికంగా వచ్చింది.పుట్టిన ప్రతి మనిషికీ మృత్యువు లలాటలిఖితం. మృత్యువు మకుటమైన ఈ కథ లలాట దేశంలో ఆరంభమౌతుంది.రాజు యశోవతుండు,రాజు కొడుకు యశపాలుడు.మంత్రి జయవర్మ,మంత్రి కొడుకు జయకేతుడు.యుద్ధవిద్యలలో ఆరితేరిన 'ఆ యిద్ధరు యువకులూ తమ తండ్రులు పొరుగు రాజ్యాల మీదికి యుద్ధానికి పోతే ఎంత బావుండును -అని కలలు కనేవాళ్లూ.అందాకా అడవికి వెళ్లి ఆ తమకాన్ని వేటలో తీర్చుకునేవారు.అలా వెళ్లి ఓసారి ప్రమాదానికి గురై మృత్యులోయలో పడ్డారు.అక్కడ భయంకర పక్షులు,జంతువులు,సర్పాలు తటస్థపడ్డాయి.రాక్షసులు,మాంత్రికులు ఎదురయ్యారు.వివిధ తెగల మనుషులు, వారితో పోటీపడే నరవానరాలు,ఇంకా నరవ్యాఘ్రం వంటి విచిత్ర జీవాలతో-వ్యవహరించాల్సి వచ్చింది.ఇద్దరు ముగ్గురికి మినహా ఆ లోయలో మరెవ్వరికీ వేరే ప్రపంచం తెలియకపోవడంవల్ల -ఆ మృత్యులోయ యశ,జయలకి మరో ప్రపంచం.నవల చదువుతున్నతసేపూ పాఠకులూ ఆ మరో ప్రపంచంలో విహరిస్తారు. యశ,జయులు అడుగడుగునా ప్రమాదాలను ఎదుర్కుంటూ-దుష్టశిక్షణ,శిష్టరక్షణ చేయడం కథాంశం.© 2017,www.logili.com All Rights Reserved.