"మనసేమో పచ్చలమడి
మాటేమో రవ్వలసడి
మారని సౌజన్యానికి
మరోపేరు మా గుమ్మడి"
ఏనాడో నేను రాసిన అభినందన కవితలోని పంక్తులివి. గుమ్మడి గారి మనసుకు నిత్యహరితం. దానికి వార్థక్యం అంటుకోలేదు. అలాగే ఆయన మాట. క్లుప్తతకూ స్వచ్ఛతకూ అది సంకేతం. ఈ ఉభయ లక్షణాలకు వన్నె కూర్చేది అయన అవ్యాజ సౌజన్య శీలం.
గుమ్మడి గారు రచించిన బహుముఖీన పాత్రలకు 'తిమ్మరుసు' గోపురశిఖరం లాంటిది. ఆ పైనా గణనీయమైనవి విభిన్న కోణాల నుంచి రూపొందించుకున్నవెన్నో. ఒక మహానటుడిగా రాణుకెక్కుతూనే తెలుగు భాషా సంస్కృతుల పట్ల అభిమానాన్ని పండించుకున్న గుమ్మడిగారి కవితా ప్రియత్వానికి గుర్తుగా 1959లో నేను రచించిన 'విశ్వనాధనాయకుడు' గేయకావ్యాన్ని అంకితం చేశాను.
ఆ తర్వాత గుమ్మడిగారికి జరిగిన అనేక గౌరవాల్లో నేను వైస్ ఛాన్సులర్ గా ఉన్నప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం అందించిన గౌరవ డాక్టరేట్ పట్టం ప్రముఖమైనది. కొన్నేళ్ళ క్రితం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం 'రఘుపతి వెంకయ్య' అవార్డుతో అతన్ని సత్కరించింది. గుమ్మడిగారి 88వ జయంతి సందర్భంగా కిన్నెర రఘురాం రచించిన 'తెలుగువారి గుండెల్లో గుమ్మడి' గ్రంథం ప్రేత్యేకంగా మీముందుకు రాబోతుంది.
- డా. సి. నారాయణ రెడ్డి
"మనసేమో పచ్చలమడి మాటేమో రవ్వలసడి మారని సౌజన్యానికి మరోపేరు మా గుమ్మడి" ఏనాడో నేను రాసిన అభినందన కవితలోని పంక్తులివి. గుమ్మడి గారి మనసుకు నిత్యహరితం. దానికి వార్థక్యం అంటుకోలేదు. అలాగే ఆయన మాట. క్లుప్తతకూ స్వచ్ఛతకూ అది సంకేతం. ఈ ఉభయ లక్షణాలకు వన్నె కూర్చేది అయన అవ్యాజ సౌజన్య శీలం. గుమ్మడి గారు రచించిన బహుముఖీన పాత్రలకు 'తిమ్మరుసు' గోపురశిఖరం లాంటిది. ఆ పైనా గణనీయమైనవి విభిన్న కోణాల నుంచి రూపొందించుకున్నవెన్నో. ఒక మహానటుడిగా రాణుకెక్కుతూనే తెలుగు భాషా సంస్కృతుల పట్ల అభిమానాన్ని పండించుకున్న గుమ్మడిగారి కవితా ప్రియత్వానికి గుర్తుగా 1959లో నేను రచించిన 'విశ్వనాధనాయకుడు' గేయకావ్యాన్ని అంకితం చేశాను. ఆ తర్వాత గుమ్మడిగారికి జరిగిన అనేక గౌరవాల్లో నేను వైస్ ఛాన్సులర్ గా ఉన్నప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం అందించిన గౌరవ డాక్టరేట్ పట్టం ప్రముఖమైనది. కొన్నేళ్ళ క్రితం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం 'రఘుపతి వెంకయ్య' అవార్డుతో అతన్ని సత్కరించింది. గుమ్మడిగారి 88వ జయంతి సందర్భంగా కిన్నెర రఘురాం రచించిన 'తెలుగువారి గుండెల్లో గుమ్మడి' గ్రంథం ప్రేత్యేకంగా మీముందుకు రాబోతుంది. - డా. సి. నారాయణ రెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.