ఆధునిక యుగంలో తెలుగుజాతిని వివిధ రంగాలలో ప్రభావితం చేసిన 67 మంది 'తెలుగు ప్రముఖులు' గురించి శ్రీ మద్దాళీ రఘురామ్ రేఖా మాత్రంగా పరిచయం చేసి, ప్రసిద్ద చిత్రకారుడు శ్రీ చంద్ర రేఖ చిత్రాలతో ప్రచురించడం అభినందనీయం.
శ్రీ మద్దాళీ రఘురామ్ 'కిన్నెర' సంస్థను స్థాపించి, తెలుగు భాష సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషి చేస్తున్నారు. అంతే కాకుండా ఇప్పుడు వారి కలం నుండి వెలువడుతున్న 'తెలుగు ప్రముఖులు' తెలుగువారికి సదా స్పూర్తినందిస్తుంది. "కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. మహా పురుషులవుతారు తర తరాలకి తరగని వెలగవుతారు." అన్నట్లు తెలుగు ప్రముఖులందరూ స్వయం కృషితో వివిధ రంగాలలో ప్రముఖులుగా రూపొంది తెలుగు జాతి ఔన్నత్యాన్ని పెంచారు. యువతరం వారి జీవితాల నుంచి స్పూర్తి పొంది భవిష్యత్ లో తెలుగు జాతి చరిత్ర నిర్మాతలుగా రూపొందాలన్నదే ఈ రచన ప్రధానోద్దేశo తెలుగు మహానియులను జాతి మరిచిపోకూడదనే భావనతో కిన్నెర సంస్థ పక్షాన అనేకమంది పెద్దల శతజయంతులు నిర్వహించారు. వారి జీవిత చరిత్రలను మన ముందుంచుతున్నారు. 'ఎమర్సన్' అన్నట్లు "నిజానికి చరిత్ర అన్నది లేదు. అన్ని జీవిత చరిత్రలే." తెలుగు ప్రముఖుల జీవిత చరిత్రల సమాహారమే తెలుగు జాతి చరిత్ర.
-మండలి బుద్ధప్రసాద్.
ఆధునిక యుగంలో తెలుగుజాతిని వివిధ రంగాలలో ప్రభావితం చేసిన 67 మంది 'తెలుగు ప్రముఖులు' గురించి శ్రీ మద్దాళీ రఘురామ్ రేఖా మాత్రంగా పరిచయం చేసి, ప్రసిద్ద చిత్రకారుడు శ్రీ చంద్ర రేఖ చిత్రాలతో ప్రచురించడం అభినందనీయం. శ్రీ మద్దాళీ రఘురామ్ 'కిన్నెర' సంస్థను స్థాపించి, తెలుగు భాష సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషి చేస్తున్నారు. అంతే కాకుండా ఇప్పుడు వారి కలం నుండి వెలువడుతున్న 'తెలుగు ప్రముఖులు' తెలుగువారికి సదా స్పూర్తినందిస్తుంది. "కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. మహా పురుషులవుతారు తర తరాలకి తరగని వెలగవుతారు." అన్నట్లు తెలుగు ప్రముఖులందరూ స్వయం కృషితో వివిధ రంగాలలో ప్రముఖులుగా రూపొంది తెలుగు జాతి ఔన్నత్యాన్ని పెంచారు. యువతరం వారి జీవితాల నుంచి స్పూర్తి పొంది భవిష్యత్ లో తెలుగు జాతి చరిత్ర నిర్మాతలుగా రూపొందాలన్నదే ఈ రచన ప్రధానోద్దేశo తెలుగు మహానియులను జాతి మరిచిపోకూడదనే భావనతో కిన్నెర సంస్థ పక్షాన అనేకమంది పెద్దల శతజయంతులు నిర్వహించారు. వారి జీవిత చరిత్రలను మన ముందుంచుతున్నారు. 'ఎమర్సన్' అన్నట్లు "నిజానికి చరిత్ర అన్నది లేదు. అన్ని జీవిత చరిత్రలే." తెలుగు ప్రముఖుల జీవిత చరిత్రల సమాహారమే తెలుగు జాతి చరిత్ర. -మండలి బుద్ధప్రసాద్.© 2017,www.logili.com All Rights Reserved.