వేగంగా మారుతున్న ప్రపంచ పరిణామా క్రమంలో సంఖ్యాశాస్త్రానికి ఎంతో ప్రాధాన్యం వచ్చింది. నిరంతర ప్రయత్నశీలి అయిన మానవుని "ఎంతో కష్టపడుతున్న నాకు ఈ ఫలం వస్తుందా? రాదా?" అన్న నిరంతర చింతన అనివార్యం. అందునా మానవుని జీవనంలో మహావేగం చోటు చేసుకున్నది. ఇటువంటి సమయంలోనే సంఖ్యాశాస్త్రం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
శ్రీ ముదిగొండ గోపికృష్ణ ఈ సంఖ్యాశాస్త్రంలో ఒక శాస్త్రీయమైన - విలక్షణమైన - బహుజనోపకారకమైన మార్గాన్ని అవలంబిస్తూ ఎంతో అనుభవాన్ని సాధించారు. భారత్ భూషణ్ బిరుదాంచితులైన వీరు ఎన్నో టి.వి. చానెళ్ళలో ప్రసిద్ధులు.
- మాడుగుల నాగఫణిశర్మ
భారత సంఖ్యాశాస్త్రం అనే ఈ పుస్తకం ప్రజల అవగాహన కోసం వ్రాయబడినది. ఇందులో నా "999" మాస పత్రికలో అత్యంత ప్రజాదరణ పొందిన అనేక వ్యాసాలు సంకలనం చేసి ప్రచురించాను... ఇవి సామాన్యులందరికి అంటే సంఖ్యాశాస్త్రంలోని లెక్కల పేజీలు, అంకెల గొడవలు నచ్చని వారికీ సైతం, ఈ వ్యాసాలు నచ్చుతాయి! దీని వలన ప్రజలు సంఖ్యాశాస్త్రం అంటే నేమ్ కరెక్షన్ పేరిట పేరు మార్చుకునే వికృతపధ్ధతి అవలంబిస్తున్నారు. ఇలాంటి వికృత చర్యల వలన ఎందరో వేలకు వేలు ఫీజు రూపేణా చెల్లించి పేరు మార్చుకొని అనేక ఇబ్బందులు పడే అమాయకులతో పాటు మేధావులూ కూడా ఉండడం విచారం! కాబట్టి అటు శాస్త్రాన్ని ఇటు దీనిపైనే ఆధారపడి నిజాయితీగా ఉంటున్న సంఖ్యాశాస్త్రజ్ఞుల్ని కాపాడే ప్రయత్నమే ఈ పుస్తకం.
ఈ పుస్తకంలో ఉన్న లక్కి టైం టేబుల్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొంది మంచి ఫలితాన్ని అందిస్తోంది. దానిని పాఠకుల ఉపయోగం కోసం ఇవ్వడం జరిగింది. ఆ లక్కి టైం టేబుల్ ని అనుసరిస్తే మీకు అన్ని చోట్లా విజయం కలుగుతుంది
- ముదిగొండ గోపీకృష్ణ
వేగంగా మారుతున్న ప్రపంచ పరిణామా క్రమంలో సంఖ్యాశాస్త్రానికి ఎంతో ప్రాధాన్యం వచ్చింది. నిరంతర ప్రయత్నశీలి అయిన మానవుని "ఎంతో కష్టపడుతున్న నాకు ఈ ఫలం వస్తుందా? రాదా?" అన్న నిరంతర చింతన అనివార్యం. అందునా మానవుని జీవనంలో మహావేగం చోటు చేసుకున్నది. ఇటువంటి సమయంలోనే సంఖ్యాశాస్త్రం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. శ్రీ ముదిగొండ గోపికృష్ణ ఈ సంఖ్యాశాస్త్రంలో ఒక శాస్త్రీయమైన - విలక్షణమైన - బహుజనోపకారకమైన మార్గాన్ని అవలంబిస్తూ ఎంతో అనుభవాన్ని సాధించారు. భారత్ భూషణ్ బిరుదాంచితులైన వీరు ఎన్నో టి.వి. చానెళ్ళలో ప్రసిద్ధులు. - మాడుగుల నాగఫణిశర్మ భారత సంఖ్యాశాస్త్రం అనే ఈ పుస్తకం ప్రజల అవగాహన కోసం వ్రాయబడినది. ఇందులో నా "999" మాస పత్రికలో అత్యంత ప్రజాదరణ పొందిన అనేక వ్యాసాలు సంకలనం చేసి ప్రచురించాను... ఇవి సామాన్యులందరికి అంటే సంఖ్యాశాస్త్రంలోని లెక్కల పేజీలు, అంకెల గొడవలు నచ్చని వారికీ సైతం, ఈ వ్యాసాలు నచ్చుతాయి! దీని వలన ప్రజలు సంఖ్యాశాస్త్రం అంటే నేమ్ కరెక్షన్ పేరిట పేరు మార్చుకునే వికృతపధ్ధతి అవలంబిస్తున్నారు. ఇలాంటి వికృత చర్యల వలన ఎందరో వేలకు వేలు ఫీజు రూపేణా చెల్లించి పేరు మార్చుకొని అనేక ఇబ్బందులు పడే అమాయకులతో పాటు మేధావులూ కూడా ఉండడం విచారం! కాబట్టి అటు శాస్త్రాన్ని ఇటు దీనిపైనే ఆధారపడి నిజాయితీగా ఉంటున్న సంఖ్యాశాస్త్రజ్ఞుల్ని కాపాడే ప్రయత్నమే ఈ పుస్తకం. ఈ పుస్తకంలో ఉన్న లక్కి టైం టేబుల్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొంది మంచి ఫలితాన్ని అందిస్తోంది. దానిని పాఠకుల ఉపయోగం కోసం ఇవ్వడం జరిగింది. ఆ లక్కి టైం టేబుల్ ని అనుసరిస్తే మీకు అన్ని చోట్లా విజయం కలుగుతుంది - ముదిగొండ గోపీకృష్ణ© 2017,www.logili.com All Rights Reserved.