చరిత్ర పాఠాలు కొత్తరకంగా...
19వ శతాబ్ద ప్రథమార్థ భాగంలో బ్రిటిష్ వారు మనదేశాన్ని పూర్తిగా వశపరుచుకొని, వారి రాజ్యాధికారాన్ని స్థాపించుకొన్నారు. అప్పటికే దేశంలోని ప్రధాన భాగాలు జిహదీ మూకల పాలనలో పీల్చి పిప్పికాబడి ఉన్నాయి. తాము భారతదేశాన్ని జయించటానికి “భారతీయుల చేతకానితనం, భారతీయుల మతంలోను, సంస్కృతిలోనూ గల లోపాలు ప్రధాన కారణం" అని ప్రచారం చేశారు. పాశ్చాత్య విజ్ఞానంతో సరిపోల్చి చూస్తే భారతీయులకు పరిగణించదగిన విజ్ఞానం అంటూ లేదని, భారతీయులు తరించాలంటే ఆంగ్లేయ భాషద్వారా పాశ్చాత్య విజ్ఞానాన్ని సంపాదించడమే ఉత్తమ సాధనమనీ బ్రిటిష్ పాలకులలో అనేకులు ప్రచారం చేశారు. మన సంస్కృతిని గురించిన జ్ఞానం వారికి లేకపోవటమే ఈ అసత్య ప్రచారానికి కారణం.
స్వరాజ్యం లభించిన 75 సంవత్సరాల తర్వాత కూడా ఇదే భావన కొందరు మేధావుల మస్తిష్కంలో స్థిరస్థానంలో నిలిచి ఉండటం దురదృష్టం, ఇందుకు కారణాలలో ఒకటి. 1947 నుంచి 17 సంవత్సరాల పాటు పాలించిన జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉండటం. పాశ్చాత్య విద్యలనే అభ్యసించిన ఈయన మన శాస్త్రాలు, విద్యల పట్ల విముఖుడై, మన జాతీయ గౌరవానికి, సంప్రదాయానికీ భంగం కలిగించే విధంగా ప్రవర్తించటం, తన వంటి వారినే 'విద్యా మంత్రులుగా' నియోగించుకోవటం వల్ల ఆ దుష్ప్రభావాలు ఇప్పటికీ విద్యాసంస్థల్లో పాతుకుపోయి ఉన్నాయి. మన సంస్కృతిని ఛిన్నాభిన్నం చేసే అంశాలను, తప్పుడు చరిత్రను పాఠ్యాంశాలలో బోధించటం అప్పట్నుంచి ప్రారంభమైంది.
కమ్యూనిస్టు దేశాలైన రష్యాతో, చైనాతో నెహ్రూ చేసిన 'చెలిమి' మరికొంత కీడు చేసింది. దేశం పట్ల, దేశ సంస్కృతీ వైభవం పట్ల ఇసుమంతైనా భక్తి, శ్రద్ధాలేని ఒక గుంపు విశ్వవిద్యాలయాలల్లో, సాహిత్యసంస్థలలో కీలకమైన స్థానాల్లో పాతుకు పోయింది. ఈ 'ఎమినెంట్ హిస్టోరియన్లు' ఆడింది ఆట పాడింది పాటగా అయ్యింది.....
చరిత్ర పాఠాలు కొత్తరకంగా... 19వ శతాబ్ద ప్రథమార్థ భాగంలో బ్రిటిష్ వారు మనదేశాన్ని పూర్తిగా వశపరుచుకొని, వారి రాజ్యాధికారాన్ని స్థాపించుకొన్నారు. అప్పటికే దేశంలోని ప్రధాన భాగాలు జిహదీ మూకల పాలనలో పీల్చి పిప్పికాబడి ఉన్నాయి. తాము భారతదేశాన్ని జయించటానికి “భారతీయుల చేతకానితనం, భారతీయుల మతంలోను, సంస్కృతిలోనూ గల లోపాలు ప్రధాన కారణం" అని ప్రచారం చేశారు. పాశ్చాత్య విజ్ఞానంతో సరిపోల్చి చూస్తే భారతీయులకు పరిగణించదగిన విజ్ఞానం అంటూ లేదని, భారతీయులు తరించాలంటే ఆంగ్లేయ భాషద్వారా పాశ్చాత్య విజ్ఞానాన్ని సంపాదించడమే ఉత్తమ సాధనమనీ బ్రిటిష్ పాలకులలో అనేకులు ప్రచారం చేశారు. మన సంస్కృతిని గురించిన జ్ఞానం వారికి లేకపోవటమే ఈ అసత్య ప్రచారానికి కారణం. స్వరాజ్యం లభించిన 75 సంవత్సరాల తర్వాత కూడా ఇదే భావన కొందరు మేధావుల మస్తిష్కంలో స్థిరస్థానంలో నిలిచి ఉండటం దురదృష్టం, ఇందుకు కారణాలలో ఒకటి. 1947 నుంచి 17 సంవత్సరాల పాటు పాలించిన జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉండటం. పాశ్చాత్య విద్యలనే అభ్యసించిన ఈయన మన శాస్త్రాలు, విద్యల పట్ల విముఖుడై, మన జాతీయ గౌరవానికి, సంప్రదాయానికీ భంగం కలిగించే విధంగా ప్రవర్తించటం, తన వంటి వారినే 'విద్యా మంత్రులుగా' నియోగించుకోవటం వల్ల ఆ దుష్ప్రభావాలు ఇప్పటికీ విద్యాసంస్థల్లో పాతుకుపోయి ఉన్నాయి. మన సంస్కృతిని ఛిన్నాభిన్నం చేసే అంశాలను, తప్పుడు చరిత్రను పాఠ్యాంశాలలో బోధించటం అప్పట్నుంచి ప్రారంభమైంది. కమ్యూనిస్టు దేశాలైన రష్యాతో, చైనాతో నెహ్రూ చేసిన 'చెలిమి' మరికొంత కీడు చేసింది. దేశం పట్ల, దేశ సంస్కృతీ వైభవం పట్ల ఇసుమంతైనా భక్తి, శ్రద్ధాలేని ఒక గుంపు విశ్వవిద్యాలయాలల్లో, సాహిత్యసంస్థలలో కీలకమైన స్థానాల్లో పాతుకు పోయింది. ఈ 'ఎమినెంట్ హిస్టోరియన్లు' ఆడింది ఆట పాడింది పాటగా అయ్యింది.....© 2017,www.logili.com All Rights Reserved.