అమెరికాకు ఫ్లైట్ ఎక్కబోతున్న సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు విశ్వం. పగలంతా టాక్సీలో ప్రయాణం చేసిన అలసటను కూడా లెక్కచేయకుండా, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ డిపార్చర్స్ దగ్గర ముందుకే మాత్రం కదలకూడదని
మొరాయించి మూడు లైన్లలో వున్న వాహనాల్ని చూసి దీర్ఘంగా నిట్టూర్పు వదుల్తూ, వెనక ముందూ పొయ్యే వాహనాల్ని కారు కిటికీలోనుంచే కళ్ళతోనే తోసెయ్యాలన్నంత కసితో చూస్తున్నాడు. భార్య, డ్రైవర్ వద్దని వారిస్తున్నా, చేతుల్తో, సైగలతో, వచ్చిరాని ఉర్దూతో, పక్కనెళ్తున్న వాహనాలకి డైరెక్షన్లు ఇస్తూ, ఈస్ క్రీమ్ అందుకొనే ఆరాటంతో ఉన్న క్యూలో నుంచున్న చిన్నపిల్లాడిలా, ఎప్పుడెప్పుడు ఆగుదామా, బ్యాగేజి దించుదామా అని సీటుమీదనుంచి అరంగుళం పైనే లేచినించునే ఉన్నాడు. తన ఖర్మకాలి ప్రతి ఒక్క వెహికల్ వాడు ఇసుమంత సందు దొరికితే రివ్వు మని దూర్చేస్తున్నారు. ఈ డ్రైవరుకేమో సిటీ కొత్తయే, దూర్చేటి నైపుణ్యం కరువాయె. విశ్వానికి ఓ కన్ను బయటున్న ఓ కన్ను డ్రైవర్ మీదే వుంది. స్టీరింగ్ అందిబుచ్చుకొని, తనే ముందుకు ఎత్తుకెళ్ళి డిపార్చర్స్ దగ్గర పెట్టాలనేంతగా విసుక్కొంటూ 'కృష్ణా, యీ లెక్కన మా ప్రయాణం అటకెక్కేటట్టే వుంది. ఆ పేరు పెట్టుకున్నందుకన్నాని రథాన్ని పోనీవయ్యా' అన్నాడు.
-సార్, వీళ్ళ దూకుడు చూస్తోంటే, నా బుర్ర గిర్రుమని తిరుగుతోంది, రివర్స్ లో వెనక్కి వెళ్లి పోవాలనుంది. మీరే కొంచెం ముందు బయల్దేరాల్సింది" అన్నాడు కృష్ణ,
సరే మాట్లాడకు గాని, ముందుకు పోనివ్వు", విసుక్కుంటూ అన్నాడు విశ్వం భర్త విసుగుకు, డ్రైవర్ చేతకానితనానికి మధ్యవర్తిత్వం వహిస్తూ పార్వతి బానివ్వండి, ఇంకెంత సేపు, దగ్గరగా చేరాము కదా, మహా అంటే ఇంకో పది |
నిముషాలు' అంది.
అమెరికాకు ఫ్లైట్ ఎక్కబోతున్న సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు విశ్వం. పగలంతా టాక్సీలో ప్రయాణం చేసిన అలసటను కూడా లెక్కచేయకుండా, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ డిపార్చర్స్ దగ్గర ముందుకే మాత్రం కదలకూడదని మొరాయించి మూడు లైన్లలో వున్న వాహనాల్ని చూసి దీర్ఘంగా నిట్టూర్పు వదుల్తూ, వెనక ముందూ పొయ్యే వాహనాల్ని కారు కిటికీలోనుంచే కళ్ళతోనే తోసెయ్యాలన్నంత కసితో చూస్తున్నాడు. భార్య, డ్రైవర్ వద్దని వారిస్తున్నా, చేతుల్తో, సైగలతో, వచ్చిరాని ఉర్దూతో, పక్కనెళ్తున్న వాహనాలకి డైరెక్షన్లు ఇస్తూ, ఈస్ క్రీమ్ అందుకొనే ఆరాటంతో ఉన్న క్యూలో నుంచున్న చిన్నపిల్లాడిలా, ఎప్పుడెప్పుడు ఆగుదామా, బ్యాగేజి దించుదామా అని సీటుమీదనుంచి అరంగుళం పైనే లేచినించునే ఉన్నాడు. తన ఖర్మకాలి ప్రతి ఒక్క వెహికల్ వాడు ఇసుమంత సందు దొరికితే రివ్వు మని దూర్చేస్తున్నారు. ఈ డ్రైవరుకేమో సిటీ కొత్తయే, దూర్చేటి నైపుణ్యం కరువాయె. విశ్వానికి ఓ కన్ను బయటున్న ఓ కన్ను డ్రైవర్ మీదే వుంది. స్టీరింగ్ అందిబుచ్చుకొని, తనే ముందుకు ఎత్తుకెళ్ళి డిపార్చర్స్ దగ్గర పెట్టాలనేంతగా విసుక్కొంటూ 'కృష్ణా, యీ లెక్కన మా ప్రయాణం అటకెక్కేటట్టే వుంది. ఆ పేరు పెట్టుకున్నందుకన్నాని రథాన్ని పోనీవయ్యా' అన్నాడు. -సార్, వీళ్ళ దూకుడు చూస్తోంటే, నా బుర్ర గిర్రుమని తిరుగుతోంది, రివర్స్ లో వెనక్కి వెళ్లి పోవాలనుంది. మీరే కొంచెం ముందు బయల్దేరాల్సింది" అన్నాడు కృష్ణ, సరే మాట్లాడకు గాని, ముందుకు పోనివ్వు", విసుక్కుంటూ అన్నాడు విశ్వం భర్త విసుగుకు, డ్రైవర్ చేతకానితనానికి మధ్యవర్తిత్వం వహిస్తూ పార్వతి బానివ్వండి, ఇంకెంత సేపు, దగ్గరగా చేరాము కదా, మహా అంటే ఇంకో పది | నిముషాలు' అంది.© 2017,www.logili.com All Rights Reserved.