ఆధునిక తెలుగు పత్రికా రచయితలలో అగ్రగణ్యులలో నార్ల వెంకటేశ్వర రావు ఒకరు. అయన నిరంతర పాటకుడు, నిర్విరామ రచయిత. కొనదలచిన పుస్తకాల కోసం డబ్బు సంపాదించడానికి పత్రికా రచన ప్రారంభించారు. చివరకు పత్రికా రంగంలోనే స్థిరపడి సంపాదకులైనారు. చదవడం, వ్రాయడం కొనసాగించినారు. ఐదు దశాబ్దాల పత్రికా రచన వ్యాసంగంలో సంపాదకీయాలు, వ్యాసాలు, లఘు వ్యాఖ్యలు, జీవిత చిత్రణలు వ్రాయడమేగాక నాటికలు, నాటకాలు, పద్యాలు, మోనో గ్రాఫులు, భగవద్గీత పై వ్యాఖ్యానం కూడా రాసారు. అయన పౌరాణిక నాటకాలు వివాదాస్పదమైనాయి. 'సీత జోస్యం' నాటకానికి సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని ప్రకటించింది. కానీ అకాడెమీ జర్నల్ లోనే దాని పై విమర్శనాత్మక సమీక్ష రావడంతో నార్ల ఆ అవార్డు స్వీకరించలేదు.
ఆధునిక తెలుగు పత్రికా రచయితలలో అగ్రగణ్యులలో నార్ల వెంకటేశ్వర రావు ఒకరు. అయన నిరంతర పాటకుడు, నిర్విరామ రచయిత. కొనదలచిన పుస్తకాల కోసం డబ్బు సంపాదించడానికి పత్రికా రచన ప్రారంభించారు. చివరకు పత్రికా రంగంలోనే స్థిరపడి సంపాదకులైనారు. చదవడం, వ్రాయడం కొనసాగించినారు. ఐదు దశాబ్దాల పత్రికా రచన వ్యాసంగంలో సంపాదకీయాలు, వ్యాసాలు, లఘు వ్యాఖ్యలు, జీవిత చిత్రణలు వ్రాయడమేగాక నాటికలు, నాటకాలు, పద్యాలు, మోనో గ్రాఫులు, భగవద్గీత పై వ్యాఖ్యానం కూడా రాసారు. అయన పౌరాణిక నాటకాలు వివాదాస్పదమైనాయి. 'సీత జోస్యం' నాటకానికి సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని ప్రకటించింది. కానీ అకాడెమీ జర్నల్ లోనే దాని పై విమర్శనాత్మక సమీక్ష రావడంతో నార్ల ఆ అవార్డు స్వీకరించలేదు.© 2017,www.logili.com All Rights Reserved.