ప్రతి నెలా ఒక చిన్న నవలను పాఠకులకు అందించాలన్న లక్ష్యంతో "ఈనాడు" గ్రూపఫ్ మేగజైన్స్ వారు "చతుర " మాసపత్రికను 1978 లో స్థాపించారు. "చతుర" లో ప్రచురణకు వారు కొన్ని కఠిన నియమాలను రూపొందించి, "చతుర" లో తమ నవలల్ని ప్రచురించుకోవాలనే ప్రతి నవలాకారుడు ఆ నియమాల్ని తు.చ. తప్పకుండా పాటించాలని వీరు సూచిస్తుండేవారు . చాలాకాలాం "చతుర" మాసపత్రికకు చలసాని ప్రసాదరావు సంపాదకత్వం వహించారు. అయన సంపాదకులు సూచించిన ఏ ఒక్క నియమాన్ని పాటించకపోయిన ఆ నవలలో ఇతరత్రా విలువలున్న దానిని ప్రచురించేవాడు కాదు. ఇంత కఠినంగా వ్యవహరించటం వల్ల "చతుర" ప్రచురించిన చాలా చిన్న నవలల్లో ఎదో ఒక సామజిక సమస్య పాఠకులను ఆలోచింపజేసేలా చిత్రించబడుతుందని నవలా ప్రియులు భావించే వారు.