సి.యస్. రావు గారి రెండు నవలల సంకలనం
రాతి పువ్వుఅమ్మ కావాలి
రచయిత రాసే రచన పాఠకుడి కోసమే. పాఠకుడు రచనను తన చేతుల్లోకి తీసుకుని ఏకాంతంగా చదువుకుంటాడు. ఆ చదువుకున్నప్పుడు కలిగే అనుభూతుల్ని బట్టి రచయితని ఉహించుకుంటాడు. అంటే రచయిత రాసిన పుస్తకానికి, చదివే పాఠకుడికి మధ్య ఎవరూ ఉండరు. పరోక్షంగా రచయిత, పాఠకుడే ఉంటారు. అంటే ఒక రకంగా వారిద్దరే ఉంటారు. ఆ ఇద్దరి మధ్య ఆత్మీయంగా జరిగే సంభాషణ "మనలో మన మాటే" కదా! అందుకే.. ఈ రెండు బహుమతి నవలల వెనుక ఉన్న కధను, అవి పుస్తక రూపంలో రావడానికి పడిన శ్రమను ఈ మనలో మన మాట రూపంలో సంక్షిప్తంగా పాఠకుడితో మాట్లాడాలనుకున్నాను. మొదటి నవల "రాతిపువ్వు". ఈ రాతిపువ్వు రచనా నేపధ్యాన్ని వివరిస్తే 1970 దశకంలో పత్రికా సాహిత్యాన్ని వివరించినట్లవుతుంది.
అలాగే కొత్త తరహా నవలలను, కొత్త నవలా రచయితలను ప్రోత్సహించడానికి "నవలా ప్రియదర్శని" అనే శీర్షిక కింద రచనలను ఆహ్వానించారు. వాటి నుండి ఆరు నవలలని ఎంపిక చేసి ధారావాహికంగా ప్రచురించడం, దానితో పాటు ప్రతీ వారం ఒక బాలెట్ నిర్వహించి పాఠకుల అభిప్రాయాలను కూడా సేకరించడం జరిగింది. ఏ నవలకు ఎక్కువ స్పందన వచ్చిందో దానికి ప్రధమ బహుమతి ఇచ్చేవారు. ప్రచురితమైన ప్రతీ నవలకు ఇచ్చే పారితోషికమే కాకుండా ప్రధమ బహుమతి వచ్చిన నవలకు బహుమతిగా సముచితమైన నగదు కూడా ఇచ్చేవారు. అలా నవలా ప్రియదర్శని పోటిల్లో ప్రధమ బహుమతి పొందిన నవల రాతిపువ్వు .
సి.యస్. రావు
సి.యస్. రావు గారి రెండు నవలల సంకలనం రాతి పువ్వు అమ్మ కావాలి రచయిత రాసే రచన పాఠకుడి కోసమే. పాఠకుడు రచనను తన చేతుల్లోకి తీసుకుని ఏకాంతంగా చదువుకుంటాడు. ఆ చదువుకున్నప్పుడు కలిగే అనుభూతుల్ని బట్టి రచయితని ఉహించుకుంటాడు. అంటే రచయిత రాసిన పుస్తకానికి, చదివే పాఠకుడికి మధ్య ఎవరూ ఉండరు. పరోక్షంగా రచయిత, పాఠకుడే ఉంటారు. అంటే ఒక రకంగా వారిద్దరే ఉంటారు. ఆ ఇద్దరి మధ్య ఆత్మీయంగా జరిగే సంభాషణ "మనలో మన మాటే" కదా! అందుకే.. ఈ రెండు బహుమతి నవలల వెనుక ఉన్న కధను, అవి పుస్తక రూపంలో రావడానికి పడిన శ్రమను ఈ మనలో మన మాట రూపంలో సంక్షిప్తంగా పాఠకుడితో మాట్లాడాలనుకున్నాను. మొదటి నవల "రాతిపువ్వు". ఈ రాతిపువ్వు రచనా నేపధ్యాన్ని వివరిస్తే 1970 దశకంలో పత్రికా సాహిత్యాన్ని వివరించినట్లవుతుంది. అలాగే కొత్త తరహా నవలలను, కొత్త నవలా రచయితలను ప్రోత్సహించడానికి "నవలా ప్రియదర్శని" అనే శీర్షిక కింద రచనలను ఆహ్వానించారు. వాటి నుండి ఆరు నవలలని ఎంపిక చేసి ధారావాహికంగా ప్రచురించడం, దానితో పాటు ప్రతీ వారం ఒక బాలెట్ నిర్వహించి పాఠకుల అభిప్రాయాలను కూడా సేకరించడం జరిగింది. ఏ నవలకు ఎక్కువ స్పందన వచ్చిందో దానికి ప్రధమ బహుమతి ఇచ్చేవారు. ప్రచురితమైన ప్రతీ నవలకు ఇచ్చే పారితోషికమే కాకుండా ప్రధమ బహుమతి వచ్చిన నవలకు బహుమతిగా సముచితమైన నగదు కూడా ఇచ్చేవారు. అలా నవలా ప్రియదర్శని పోటిల్లో ప్రధమ బహుమతి పొందిన నవల రాతిపువ్వు . సి.యస్. రావు© 2017,www.logili.com All Rights Reserved.