ఇందులో ముప్పైకి పైగా కధలున్నాయి.
సోమయాజిగారి కధానికలలో క్లుప్తత, వేగం వుంటాయి. దాంతో ప్రతిదీ ఒక చేగోడిలా ఒక్క దెబ్బకు అయిపోతుంది. అయన భాషలో ఒక ప్రత్యేకత వుంది. ఆలోచనలో నవ్యత, మాటల్లో సాంప్రదాయం కలగలసి వుంటాయి. అందుకని ఇతివృత్తం కొత్తగానూ, పాత్రలు మన చిన్నాన్న వదిన, మేనత్త, పిన్ని పాత మిత్రుల్లా హాయిగా మాట్లాడేస్తూ వుంటారు. షామియానా కింద ప్లాస్టిక్ కుర్చీలో కూచొని కబుర్లాడుకోవడం వేరు. కొత్త తాటాకు పందిరి కింద తప్తాబిల్ల చుట్టూ వొదిగి వొదిగి కూచుని మాట్లాడుకోవడం వేరు. మా సోమయాజి గారి కధానికలు తప్తాబల్ల మీదో ఈతాకు చాప మీదో ఆప్తుల మీద వాలిపోయి మనసువిప్పి మాట్లాడుకున్నట్లుంటాయి. మరీ బలమైన సందేశాల జోలికి అయన కలం వెళ్ళదు. చిన్న చిన్న చురకలు అక్కడక్కడ పన్నీరు జల్లినంత సామ్యం గా తగుల్తాయి. అన్నిటికంటే ఎదుటివాడిని నవ్వించడం కష్టమైన విద్య. అదికూడా మంచి అభిరుచి గల సన్నివేశాల్ని సంభాషణల్ని సృష్టించడం అంత తెలికేమి కాదు.
గుణశీలాలు కలిగిన కమ్మని కధలివి. హాయిగా చదివి ఆనందించండి.
-శ్రీరమణ
ఇందులో ముప్పైకి పైగా కధలున్నాయి. సోమయాజిగారి కధానికలలో క్లుప్తత, వేగం వుంటాయి. దాంతో ప్రతిదీ ఒక చేగోడిలా ఒక్క దెబ్బకు అయిపోతుంది. అయన భాషలో ఒక ప్రత్యేకత వుంది. ఆలోచనలో నవ్యత, మాటల్లో సాంప్రదాయం కలగలసి వుంటాయి. అందుకని ఇతివృత్తం కొత్తగానూ, పాత్రలు మన చిన్నాన్న వదిన, మేనత్త, పిన్ని పాత మిత్రుల్లా హాయిగా మాట్లాడేస్తూ వుంటారు. షామియానా కింద ప్లాస్టిక్ కుర్చీలో కూచొని కబుర్లాడుకోవడం వేరు. కొత్త తాటాకు పందిరి కింద తప్తాబిల్ల చుట్టూ వొదిగి వొదిగి కూచుని మాట్లాడుకోవడం వేరు. మా సోమయాజి గారి కధానికలు తప్తాబల్ల మీదో ఈతాకు చాప మీదో ఆప్తుల మీద వాలిపోయి మనసువిప్పి మాట్లాడుకున్నట్లుంటాయి. మరీ బలమైన సందేశాల జోలికి అయన కలం వెళ్ళదు. చిన్న చిన్న చురకలు అక్కడక్కడ పన్నీరు జల్లినంత సామ్యం గా తగుల్తాయి. అన్నిటికంటే ఎదుటివాడిని నవ్వించడం కష్టమైన విద్య. అదికూడా మంచి అభిరుచి గల సన్నివేశాల్ని సంభాషణల్ని సృష్టించడం అంత తెలికేమి కాదు. గుణశీలాలు కలిగిన కమ్మని కధలివి. హాయిగా చదివి ఆనందించండి. -శ్రీరమణ© 2017,www.logili.com All Rights Reserved.