వివిధ సందర్భాల్లో వ్రాయబడిన వ్యాసాల సంపుటి ఇది. ముఖ్యంగా రేడియో వారికోసం, పత్రికల వారికోసం వ్రాసినవి. వారి అభ్యర్ధనల మేరకు వ్రాసినప్పటికీ నా శక్తియుక్తులు అందుకు సరిపడతాయన్న ధైర్యంతో కాక సంబంధిత గ్రందాల అవలోకనానికీ పునఃపరిశీలనకూ ఆయా అవకాశాలను వినియోగించుకొన్న సంతృప్తిని మాత్రం నేను పొందగలిగానని మనవి చేస్తున్నాను.
ఇందులో - కొన్ని గ్రంధ సమీక్షలు, పీఠికా రూపంలోనున్న స్వీయ అభిప్రాయాలు, విద్యార్థుల కోసం రాసిన పాఠ్యభాగ ఘట్టాలు కూడా ఉన్నవి. అందుకే భాష విషయంలో గ్రాంధిక వ్యావహారికాలు రెండు కలిసిమెలిసి విహరించాయి. తెలుగుభాషకు జీవగర్రయై మరుగున పడిపోతున్న పద్య సాహిత్యాన్ని కొంతమేరకు ఈ తరానికి పరిచయం చేసేందుకు ఉపకరించగలదనే ఉద్దేశ్యంతో ప్రచురిస్తున్న ఈ వ్యాస సంపుటిని సాహిత్యలోకం ఆదరిస్తుందని ఆశిస్తున్నాను.
- పువ్వాడ తిక్కన సోమయాజి
వివిధ సందర్భాల్లో వ్రాయబడిన వ్యాసాల సంపుటి ఇది. ముఖ్యంగా రేడియో వారికోసం, పత్రికల వారికోసం వ్రాసినవి. వారి అభ్యర్ధనల మేరకు వ్రాసినప్పటికీ నా శక్తియుక్తులు అందుకు సరిపడతాయన్న ధైర్యంతో కాక సంబంధిత గ్రందాల అవలోకనానికీ పునఃపరిశీలనకూ ఆయా అవకాశాలను వినియోగించుకొన్న సంతృప్తిని మాత్రం నేను పొందగలిగానని మనవి చేస్తున్నాను. ఇందులో - కొన్ని గ్రంధ సమీక్షలు, పీఠికా రూపంలోనున్న స్వీయ అభిప్రాయాలు, విద్యార్థుల కోసం రాసిన పాఠ్యభాగ ఘట్టాలు కూడా ఉన్నవి. అందుకే భాష విషయంలో గ్రాంధిక వ్యావహారికాలు రెండు కలిసిమెలిసి విహరించాయి. తెలుగుభాషకు జీవగర్రయై మరుగున పడిపోతున్న పద్య సాహిత్యాన్ని కొంతమేరకు ఈ తరానికి పరిచయం చేసేందుకు ఉపకరించగలదనే ఉద్దేశ్యంతో ప్రచురిస్తున్న ఈ వ్యాస సంపుటిని సాహిత్యలోకం ఆదరిస్తుందని ఆశిస్తున్నాను. - పువ్వాడ తిక్కన సోమయాజి© 2017,www.logili.com All Rights Reserved.