శంకరాచార్యులవారు ఎప్పటివారు? ఆయన ప్రాచుర్యంలోకి తెచ్చిన అద్వైతానికీ, ఆయనకు పూర్వం వ్యాప్తిలో ఉండిన అద్వైతానికి తేడా ఉన్నదా? ఈ విధమైన ప్రశ్నలు బహుకాలంగా వింటున్నవే. ప్రామాణికం అనిపించుకున్న సమాధానాలు లేవు.
శంకరులను గురించే, ఆయన వ్రాసిన భాష్యాలను గురించీ, ఆయనవిగా ప్రచారంలో ఉన్న స్తోత్రాలను గురించే జిజ్ఞాసువులకు తెలుసుకోవాలని ఉండడం సహజం. ఈ మూడు అంశాలను గురించి సంక్షిప్తంగా వివరించే గ్రంథం నాకు తెలిసినంతలో ఇంత వరకు లేదు. అట్టి ప్రయత్నాన్ని మొదటిసారి చేసిన కీర్తి శ్రీ నోరి హనుమచ్చాస్త్రీగారికి దక్కుతుంది.
శంకరుడి జీవిత చరిత్రగా ప్రచారంలో ఉన్న "శంకర విజయము" గ్రంధాల సమాచారాన్ని అందించారు. శంకరుడు స్థాపించిన చతురామ్నాయాలను గురించీ, ఊర్ధ్వమ్నాయ, ఆత్మమ్నాయ, నిష్కలమ్నయా అనే జ్ఞానామ్నాయాలను గురించీ, సర్వజ్ఞ పీఠమ్ గురించీ తరువాత కాలంలో ఎవరెవరో ఏవేవో పీఠాలు స్థాపించటం గురించీ శాస్త్రిగారు తెలియజేశారు. శంకరుడి కాలంలో ప్రసిద్ధమైనవిపించుకొన్న 72మతాల పరిస్థితిని ప్రస్తావించి వాటిని గాణాపత్య, శైవ, వైష్ణవ, సౌర, కౌమారాలనే ఆరు కూటాలు గా విభజించటం గురించి చెప్పి, సమన్వయ మార్గంగా పంచాయతన పూజావిధానం ఏర్పాటు చేసినట్లు వివరించారు. శంకరుడి జీవితంలో సాధించిన ఈ విజయాలను పేర్కొని, ప్రాస్తావికంగా ఎన్ని కధలో ఎలా ప్రచారంలోకి వచ్చాయో తెలియజేశారు.
శంకరుడి శిష్యులైన పద్మపాదుడు, సురేశ్వరాచార్యుడు, హస్తమలకుడు, త్రోటకాచార్యుడు అసాధారణ ప్రజ్ఞావంతులు. వారందరిని గురించి రేఖామాత్ర చిత్రాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి.
ఇలా శంకరుడి జీవితంలో ముఖ్య ఘట్టాలను హనుమచ్చాస్త్రిగారు ఆసక్తికరమైన విధంగా చిత్రించడంలో విజ్ఞానదాయకమైన అనేక విషయాలను చెప్పారు. ఉదాహరణకు దశవిధాలైన సన్యాసవర్గాల పేర్లు ఇచ్చారు అవి. తీర్ధ, ఆశ్రమ, వన, అరణ్య, గిరి, పర్వత, సాగర, సరస్వతీ, భారతి, పురి.
శంకరుడి జీవిత విశేషాలను చెప్పి సూత్రభాష్యం విశేషాలను హనుమచ్చాస్త్రిగారు సులభశైలిలో తెలియజేశారు. శంకర భగవత్పాదుల పరమ గురువు గౌడపాదాచార్యుల వారి మాండూక్యోపనిషత్తు కారికలను గురించి వ్రాశారు. అలాగే సౌందర్య లహరి కర్తృత్వాన్ని గురించి వివాదం ఉన్నదంటూనే సౌందర్యలహరిలోని సౌందర్యాన్ని, "కవితా కౌశల్యం పరాకాష్ట నందుకొన్న" మరో స్తోత్రకావ్యం శివానంద లహరి ఔనత్యాన్ని వివరించారు. కావ్యసౌందర్యాన్ని ఆవిష్కరించే ఒక్కొక్క శ్లోకాన్ని ఇచ్చి అర్ధ వివరణ చేశారు
శంకరాచార్యులవారు ఎప్పటివారు? ఆయన ప్రాచుర్యంలోకి తెచ్చిన అద్వైతానికీ, ఆయనకు పూర్వం వ్యాప్తిలో ఉండిన అద్వైతానికి తేడా ఉన్నదా? ఈ విధమైన ప్రశ్నలు బహుకాలంగా వింటున్నవే. ప్రామాణికం అనిపించుకున్న సమాధానాలు లేవు. శంకరులను గురించే, ఆయన వ్రాసిన భాష్యాలను గురించీ, ఆయనవిగా ప్రచారంలో ఉన్న స్తోత్రాలను గురించే జిజ్ఞాసువులకు తెలుసుకోవాలని ఉండడం సహజం. ఈ మూడు అంశాలను గురించి సంక్షిప్తంగా వివరించే గ్రంథం నాకు తెలిసినంతలో ఇంత వరకు లేదు. అట్టి ప్రయత్నాన్ని మొదటిసారి చేసిన కీర్తి శ్రీ నోరి హనుమచ్చాస్త్రీగారికి దక్కుతుంది. శంకరుడి జీవిత చరిత్రగా ప్రచారంలో ఉన్న "శంకర విజయము" గ్రంధాల సమాచారాన్ని అందించారు. శంకరుడు స్థాపించిన చతురామ్నాయాలను గురించీ, ఊర్ధ్వమ్నాయ, ఆత్మమ్నాయ, నిష్కలమ్నయా అనే జ్ఞానామ్నాయాలను గురించీ, సర్వజ్ఞ పీఠమ్ గురించీ తరువాత కాలంలో ఎవరెవరో ఏవేవో పీఠాలు స్థాపించటం గురించీ శాస్త్రిగారు తెలియజేశారు. శంకరుడి కాలంలో ప్రసిద్ధమైనవిపించుకొన్న 72మతాల పరిస్థితిని ప్రస్తావించి వాటిని గాణాపత్య, శైవ, వైష్ణవ, సౌర, కౌమారాలనే ఆరు కూటాలు గా విభజించటం గురించి చెప్పి, సమన్వయ మార్గంగా పంచాయతన పూజావిధానం ఏర్పాటు చేసినట్లు వివరించారు. శంకరుడి జీవితంలో సాధించిన ఈ విజయాలను పేర్కొని, ప్రాస్తావికంగా ఎన్ని కధలో ఎలా ప్రచారంలోకి వచ్చాయో తెలియజేశారు. శంకరుడి శిష్యులైన పద్మపాదుడు, సురేశ్వరాచార్యుడు, హస్తమలకుడు, త్రోటకాచార్యుడు అసాధారణ ప్రజ్ఞావంతులు. వారందరిని గురించి రేఖామాత్ర చిత్రాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి. ఇలా శంకరుడి జీవితంలో ముఖ్య ఘట్టాలను హనుమచ్చాస్త్రిగారు ఆసక్తికరమైన విధంగా చిత్రించడంలో విజ్ఞానదాయకమైన అనేక విషయాలను చెప్పారు. ఉదాహరణకు దశవిధాలైన సన్యాసవర్గాల పేర్లు ఇచ్చారు అవి. తీర్ధ, ఆశ్రమ, వన, అరణ్య, గిరి, పర్వత, సాగర, సరస్వతీ, భారతి, పురి. శంకరుడి జీవిత విశేషాలను చెప్పి సూత్రభాష్యం విశేషాలను హనుమచ్చాస్త్రిగారు సులభశైలిలో తెలియజేశారు. శంకర భగవత్పాదుల పరమ గురువు గౌడపాదాచార్యుల వారి మాండూక్యోపనిషత్తు కారికలను గురించి వ్రాశారు. అలాగే సౌందర్య లహరి కర్తృత్వాన్ని గురించి వివాదం ఉన్నదంటూనే సౌందర్యలహరిలోని సౌందర్యాన్ని, "కవితా కౌశల్యం పరాకాష్ట నందుకొన్న" మరో స్తోత్రకావ్యం శివానంద లహరి ఔనత్యాన్ని వివరించారు. కావ్యసౌందర్యాన్ని ఆవిష్కరించే ఒక్కొక్క శ్లోకాన్ని ఇచ్చి అర్ధ వివరణ చేశారు© 2017,www.logili.com All Rights Reserved.