ప్రపంచ వ్యాప్తంగా అడవుల నరికివేత వేగం పుంజుకోవడంవల్ల మన ఓషధిసంపదనంతా అనుకోనంత వేగంగా కోల్పోతున్నాం. ఓషధులను కేవలం ఆయుర్వేదం మరియు హోమియోపతిలోనే వినియోగించడంలేదు మనం. అల్లోపతిలోనూ అనేకం వినియోగిస్తున్నాం. ఓషధిసంపదను కోల్పోడమంటే మన ఆరోగ్యంపై భస్మాసురహస్తాన్ని మోపినట్లే. అందువల్ల ప్రజానీకంలో ఓషధుల ప్రాశస్త్యాన్ని గురించి మరింత విజ్ఞానం జొప్పించవలసి వుంటుంది.
వనాలు మన జీవనానికి అమృతవనాలు. వనాలు(అడవులు) లేనిదే జీవజాలమే లేదు. జీవజాలం లేని భూమిని ఎడారి అంటారు. పర్యావరణ పరిజ్ఞానం ప్రజానీకంలో లోపిస్తే మనం మన నాశనాన్ని కోరితెచ్చుకున్నట్లే - అందువల్ల పర్యావరణం యందలి అత్యాధిక ప్రాధిన్యం గల బయోస్ఫియర్ (జీవజాలం)ను గురించిన పలు అంశాలను ఎప్పటికప్పుడు మనం సమాజానికందజేయడం ప్రస్తుత తరం విధి. ఈ వుద్దేశంతోనే అనేక ఓషధుల గురించి అప్పుడప్పుడనేక పత్రికలలో ప్రచురించబడిన నా యీ వ్యాసాలను పుస్తకరూపంలో తెస్తే ప్రజోపయోగం వుంటుందని నా అభిలాష, ఆశయం. మరియు ప్రత్యేకించి నా విధిగా భావిస్తున్నాను. ఈ వ్యాసాలన్నీ చదువరులకు ప్రత్యేకించి వృక్షశాస్త్ర, వైద్యశాస్త్ర అభిలాషగలవారికీ వుపయుక్త మవగలవని నా నమ్మకం.
- పాలది లక్ష్మినారాయణ
ప్రపంచ వ్యాప్తంగా అడవుల నరికివేత వేగం పుంజుకోవడంవల్ల మన ఓషధిసంపదనంతా అనుకోనంత వేగంగా కోల్పోతున్నాం. ఓషధులను కేవలం ఆయుర్వేదం మరియు హోమియోపతిలోనే వినియోగించడంలేదు మనం. అల్లోపతిలోనూ అనేకం వినియోగిస్తున్నాం. ఓషధిసంపదను కోల్పోడమంటే మన ఆరోగ్యంపై భస్మాసురహస్తాన్ని మోపినట్లే. అందువల్ల ప్రజానీకంలో ఓషధుల ప్రాశస్త్యాన్ని గురించి మరింత విజ్ఞానం జొప్పించవలసి వుంటుంది. వనాలు మన జీవనానికి అమృతవనాలు. వనాలు(అడవులు) లేనిదే జీవజాలమే లేదు. జీవజాలం లేని భూమిని ఎడారి అంటారు. పర్యావరణ పరిజ్ఞానం ప్రజానీకంలో లోపిస్తే మనం మన నాశనాన్ని కోరితెచ్చుకున్నట్లే - అందువల్ల పర్యావరణం యందలి అత్యాధిక ప్రాధిన్యం గల బయోస్ఫియర్ (జీవజాలం)ను గురించిన పలు అంశాలను ఎప్పటికప్పుడు మనం సమాజానికందజేయడం ప్రస్తుత తరం విధి. ఈ వుద్దేశంతోనే అనేక ఓషధుల గురించి అప్పుడప్పుడనేక పత్రికలలో ప్రచురించబడిన నా యీ వ్యాసాలను పుస్తకరూపంలో తెస్తే ప్రజోపయోగం వుంటుందని నా అభిలాష, ఆశయం. మరియు ప్రత్యేకించి నా విధిగా భావిస్తున్నాను. ఈ వ్యాసాలన్నీ చదువరులకు ప్రత్యేకించి వృక్షశాస్త్ర, వైద్యశాస్త్ర అభిలాషగలవారికీ వుపయుక్త మవగలవని నా నమ్మకం. - పాలది లక్ష్మినారాయణ© 2017,www.logili.com All Rights Reserved.