"ఈ దేశపు గ్రామీణ ప్రజల, అట్టడుగు జనుల స్వంత కళా ప్రక్రియ పాట. తమ పనితోపాటుగా పాటను వారు అల్లుకుంటూ పనీపాటలుగా పెనవేశారు. తమదైన జీవితాన్నీ, సంస్కృతినీ, బాధలనూ, కష్టాలనూ, ఆనందాలను, ఆవేశాలను ఒక్కమాటలో తమ భావావేశాలను గానం చేసుకున్నారు. తమ జీవన రేఖల్ని జానపదాలుగా పదిలపరుచుకున్నారు. అందుకనే పాటకు ముడిసరుకు, జీవధాతువు జానపదమైంది". ప్రజల నుండి తీసుకున్న అనేక జానపద కళారూపాలను రూపపరంగా అలాగే ఉంచి వస్తుపరంగా జనహితంగా, సందేశాత్మకంగా మలచి మన కవులు, కళాకారులు వాటిని తిరిగి మరింత కళాత్మకంగా ప్రజాపరం చేశారు.
బుర్రకథ, జముకుల కథ, హరికథ, యక్షగాన కళారూపాలు వంటి జానపద ప్రక్రియలు ఇందుకు ఉదాహరణలు - తమకు తెలిసిన తమ కళారూపం నూతన జవసత్వాలతో తిరిగి తమ ముందుకు వచ్చినప్పుడు ప్రజానీకంలో అపూర్వ స్పందన కలగటం సహజం. అలాంటి స్పందన కలిగింపజేసిన కవులు, కళాకారులు మనకు వేల సంఖ్యలోనే ఉన్నారు. అయితే వీరిలో చాలామంది పేర్లు, వివరాలు ఈనాడు తెలియని పరిస్థితి. ఈ మార్గంలో కృషిచేసి వారిని వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత మన తరం పై ఉంది.
"ఈ దేశపు గ్రామీణ ప్రజల, అట్టడుగు జనుల స్వంత కళా ప్రక్రియ పాట. తమ పనితోపాటుగా పాటను వారు అల్లుకుంటూ పనీపాటలుగా పెనవేశారు. తమదైన జీవితాన్నీ, సంస్కృతినీ, బాధలనూ, కష్టాలనూ, ఆనందాలను, ఆవేశాలను ఒక్కమాటలో తమ భావావేశాలను గానం చేసుకున్నారు. తమ జీవన రేఖల్ని జానపదాలుగా పదిలపరుచుకున్నారు. అందుకనే పాటకు ముడిసరుకు, జీవధాతువు జానపదమైంది". ప్రజల నుండి తీసుకున్న అనేక జానపద కళారూపాలను రూపపరంగా అలాగే ఉంచి వస్తుపరంగా జనహితంగా, సందేశాత్మకంగా మలచి మన కవులు, కళాకారులు వాటిని తిరిగి మరింత కళాత్మకంగా ప్రజాపరం చేశారు. బుర్రకథ, జముకుల కథ, హరికథ, యక్షగాన కళారూపాలు వంటి జానపద ప్రక్రియలు ఇందుకు ఉదాహరణలు - తమకు తెలిసిన తమ కళారూపం నూతన జవసత్వాలతో తిరిగి తమ ముందుకు వచ్చినప్పుడు ప్రజానీకంలో అపూర్వ స్పందన కలగటం సహజం. అలాంటి స్పందన కలిగింపజేసిన కవులు, కళాకారులు మనకు వేల సంఖ్యలోనే ఉన్నారు. అయితే వీరిలో చాలామంది పేర్లు, వివరాలు ఈనాడు తెలియని పరిస్థితి. ఈ మార్గంలో కృషిచేసి వారిని వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత మన తరం పై ఉంది.© 2017,www.logili.com All Rights Reserved.