సంఘంచే ఆమోదించబడి, న్యాయ సమ్మతమైన బాధ్యతలు, హక్కులతో స్త్రీ, పురుషులు తాము గానీ లేక తమకు జన్మించిన సంతానంగాని కలసి జీవించడమే వివాహం.
వివాహం కాని పురుషుడు అసంపూర్ణుడు... సనాతన ధర్మం ప్రకారం కామసంబంధమైన కోర్కెలు పాపంకాదు. తప్పులేదు. వివాహం ద్వారా కామాన్ని పొందడానికి అర్హత కల్గుతుంది. వివాహం మానవుడి బలహీనతను కాపాడే మార్గం కాదు. అతడి వున్నతికి తెరిచే ద్వారం... వివాహ బంధం... జీవితంలో వున్నతమైన విలువలు కోసం పాటుపడే ఒకానొక కలయిక.
యవ్వనంలో మనస్సు ఎంతో సున్నితమైన భావాలు కలిగి వుంటుంది. స్వేఛ్చాలైంగిక ప్రవృత్తి ఆ సున్నితమైన అనుభవాలని మొద్దుబారుస్తుంది... తపన ఎప్పుడైతే కనుమరుగవుతుందో భావనాశక్తిలోని మృదుత్వం, సున్నితత్వం కూడా పోతుంది. ఎప్పుడైతే తప్పు అన్న అభిప్రాయం వుండదో నిజాయితీ అప్పుడే కుంటు పడుతుంది.
ఈ నేపధ్యంలో ప్రపంచంలో మొదటినుంచి ఈ వివాహ వ్యవస్థ ఎలా మార్పు చేర్పులకు లోనయింది అన్ని విషయాలు తెలుసుకోవడం అవసరం. అంతే కాక ఐదువేల సంవత్సరాలుగా హిందూ సాంప్రదాయంలో వివాహం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, రేపు ఏమి జరగబోతుంది అన్న విషయాలు క్లుప్తంగా ఈ పుస్తకం చర్చించబడింది.
- వేదాంతం లక్ష్మి ప్రసాదరావు
సంఘంచే ఆమోదించబడి, న్యాయ సమ్మతమైన బాధ్యతలు, హక్కులతో స్త్రీ, పురుషులు తాము గానీ లేక తమకు జన్మించిన సంతానంగాని కలసి జీవించడమే వివాహం. వివాహం కాని పురుషుడు అసంపూర్ణుడు... సనాతన ధర్మం ప్రకారం కామసంబంధమైన కోర్కెలు పాపంకాదు. తప్పులేదు. వివాహం ద్వారా కామాన్ని పొందడానికి అర్హత కల్గుతుంది. వివాహం మానవుడి బలహీనతను కాపాడే మార్గం కాదు. అతడి వున్నతికి తెరిచే ద్వారం... వివాహ బంధం... జీవితంలో వున్నతమైన విలువలు కోసం పాటుపడే ఒకానొక కలయిక. యవ్వనంలో మనస్సు ఎంతో సున్నితమైన భావాలు కలిగి వుంటుంది. స్వేఛ్చాలైంగిక ప్రవృత్తి ఆ సున్నితమైన అనుభవాలని మొద్దుబారుస్తుంది... తపన ఎప్పుడైతే కనుమరుగవుతుందో భావనాశక్తిలోని మృదుత్వం, సున్నితత్వం కూడా పోతుంది. ఎప్పుడైతే తప్పు అన్న అభిప్రాయం వుండదో నిజాయితీ అప్పుడే కుంటు పడుతుంది. ఈ నేపధ్యంలో ప్రపంచంలో మొదటినుంచి ఈ వివాహ వ్యవస్థ ఎలా మార్పు చేర్పులకు లోనయింది అన్ని విషయాలు తెలుసుకోవడం అవసరం. అంతే కాక ఐదువేల సంవత్సరాలుగా హిందూ సాంప్రదాయంలో వివాహం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, రేపు ఏమి జరగబోతుంది అన్న విషయాలు క్లుప్తంగా ఈ పుస్తకం చర్చించబడింది. - వేదాంతం లక్ష్మి ప్రసాదరావు© 2017,www.logili.com All Rights Reserved.